నూతన సంవత్సర సందర్భంగా “సాహితీ సేవ ” ముఖపుస్తకం కూటమి (ఫేస్ బుక్) ఆధ్వర్యంలో ‘ కవితల పోటీ’ లను నిర్వహిస్తున్నామని ఆ బృందం అడ్మిన్లు పుష్యమి సాగర్, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. కవితలు తెలుగులో సామాజిక స్పృహను కలిగించే విధంగా ఉండాలని, ఆసక్తి కలిగిన కవి/కవయిత్రి ఈ కవితా పోటీల్లో పాల్గొనవచ్చని వారు తెలిపారు .
ప్రధమ , ద్వితీయ, తృతీయ ఉత్తమ కవితలకు తగిన పారితోషకం అందజేస్తామని వారు తెలిపారు. కవితలను డిశంబర్ 31, 2013 అర్థరాత్రి 12-00 నుంచి జనవరి 1 అర్ధరాత్రి 12:00 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయని, ఆ గడువు లోపు మాత్రమే https://www.facebook.com/groups/sahitheeseva/ కూటమిలో టపా చేయాలని కోరారు. జనవరి 1 అర్ధరాత్రి 12:00 గంటల తరువాత టపా అయిన కవితలు పోటీలు స్వీకరించబడవన్నారు. కవిత చివర ‘సాహితీ సేవ’ కవితల పోటీ కోసం .. అని తప్పని సరిగా రాయాలని . తుది నిర్ణయము న్యాయ నిర్ణేతలదేనని, ఎలాంటి వాదనలకు తావు లేదని వారు వివరించారు.
నిబంధనల గురించి వారు చెపుతూ కవిత కేవలం కవిత రూపంలోనే వుండాలి పద్య రూపంలో వుండకూడదన్నారు. కనీష్టం గా 10 వరసలు ఉండి గరిష్టంగా 25 వరసలు ఉండవచ్చని, ముఖపుస్తకంలో వారి వారి గోడలపై గానీ, మరెక్కడా గానీ పోస్ట్ చేసిన కవితలను పంపవద్దని, ఇంతవరకు ఎక్కడా పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ, గూడుల్లోనూ ప్రచురణకాని, ఎక్కడా ప్రసారం కాని కవితలను మాత్రమే https://www.facebook.com/groups/sahitheeseva/ కూటమి లో టపా చేయాలని తెలిపారు.
కవితలు దేనికీ అనువాదం, అనుకరణగాని కవితలను మాత్రమే పంపించాలని, అలా చేసిన వాటిన పోటీకీ స్వీకరించబడవన్నారు . ఒక కవి/ కవయిత్రి ఒకే ఒక కవిత మాత్రమే పోటీకి పంపాలని, ‘కవిత’ శీర్షిక పేరు పై భాగమున తప్పని సరిగా వుండాలని,కవిత అడుగు భాగమున పేరు, పంపిన తేదీ, ‘సాహితీ సేవ’ కవిత పోటీ కోసం… అని తప్పని సరిగా రాయాలని వివరించారు.
న్యాయ నిర్ణీతల నిర్ణయమే తుది నిర్ణయమని, 2014 జనవరి 2 వతేదీ న్యాయ నిర్ణీతల పరిశీలన జరుగుతుందని, ఫలితాలను జనవరి 3వతేదీ ప్రకటించబడుతుందని, ఉత్తమ కవితను పిన్ పోస్టుగా ప్రచురించబడు తుందని వారు తెలిపారు.
పోటీ కి పంపిన కవిత వివరాలను, మీకు ఇష్టమైతే మీ ఫోటోను, మీ చిరునామా, చరవాణి పూర్తి వివరాలను sahitheeseva@live.com మెయిల్ ఐడీకి పంపాలన్నారు. ముఖపుస్తకం లోని కూటమి లో చేరని వారు https://www.facebook.com/groups/sahitheeseva/ లో చేరి కవితల పోటీకి టపా చేయాలన్నారు.
ఇతర వివరములకు 9032215609, 9000343095 ఫోన్ నెంబర్స్ సంప్రదించవచ్చన్నారు.ఈ కవితల పోటీ నూతన వత్సరాన నిత్యనూతనంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని పుష్యమి సాగర్, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు.
‘సాహితి సేవ’ చేపడుతున్న ఈ కవితల పోటీల్లో కవులు, కవయిత్రులు పాల్గొని ఈ నూతన వత్సరాన కవిత్వం, సాహిత్యం దిగ్విజయం కావాలని ఆశించారు.
విజయీ భవ!