న...న...న..నత్తి లోపం కాదు
- కంచర్ల
మాట్లాడడంలో వుండే ఒకరమైన ఇబ్బందిని ‘నత్తి’ అంటారు. నలుగురులో వున్నప్పుడు నత్తి వున్నవారు పడే ఇబ్బంది అంతా ఇంతాకాదు. ఫోన్ అందుకున్న వెంటనే అవతలివారు హలో... హలో... అంటుంటే బదులుగా మాట్లాడలేదు. ఒకరికి నాలుగుసార్లు ప్రయత్నిస్తే కాని మాట బయటికి రాదు. ఈలోగా అవతలివారు ఫోన్ కూడా పెట్టేయవచ్చు.
వారు అలా మాట్లాడుతుంటే చాలామంది ఎగతాళి చేస్తారు. వారిలానే మాట్లాడి వారిని మానసిక వ్యధకు గురిచేస్తారు. ఫలితంగా నత్తిబ్బంది కలవారు ఒత్తిడికి లోనై మానసిక వ్యాధికి గురవుతారు. స్వతహాగా మాట్లాడేందుకు సాహసించలేరు. స్నేహాలు చేయలేరు. నత్తిని ఎలా వదిలించుకోవాలో వారికి తెలియకపోవచ్చు. నత్తి వున్నవారికి ఏవిధమైన సహకారం అందించాలో ఇవతలివారికి కూడా తెలియకపోవచ్చు. కుంటివారికి, గుడ్డివారికి ఎలాంటి సహాయం అవసరమో, ఎలా సహాయపడాలో తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే నత్తి ఉన్నవారి పరిస్థితి వేరు. నత్తిగలవారికి అన్ని రకాల ఉద్యోగాలు సరిపోవు. పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగాలకు వెళ్ళలేరు. వెళ్ళినా తట్టుకు నిలబడలేరు. ఎనౌన్సర్‌గా పనికిరారు.
రిసెప్షన్ కౌంటర్‌లో కూర్చోలేరు. మొత్తంమీద మాట్లాడాల్సిన అవసరం అతి తక్కువగా వుండే పనుల్లోకి మాత్రమే వీరిని తీసుకుపోవాల్సి వుంటుంది. నత్తి అనేది హఠాత్తుగా వచ్చేది కాదు. మాటలను నేర్చుకునే రోజుల్లోనే పిల్లల్లో కనిపిస్తుంది. మాట్లాడడంలో తత్తరపడుతున్నా వెంటవెంటనే మాటలు రాకపోయినా నత్తి సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. దీన్ని చిన్నతనంలోనే సరిదిద్దే ప్రయత్నం చేస్తే ‘నత్తి’ మటుమాయం కాకపోయినా తీవ్ర స్థాయికి చేరకుండా వుంటుంది. నత్తి సమస్య ఆడపిల్లల్లోకన్నా మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల్లో ఒకరికి ఉంటే మగపిల్లల్లో నలుగురికి ఉంటుంది.
చిన్నతనంలో చేసే చికిత్సలో కూడా ఆడపిల్లల స్పందన మగపిల్లలకన్నా మెరుగ్గా వుండడం గమనించదగిన విషయం.
టైఫాయిడ్ జ్వరాలు వచ్చినపుడు, షాక్ తగిలినపుడు, ప్రేమ, ఆప్యాయతలు కొరవడినపుడు కూడా ‘నత్తి’ రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఎదుటివారు తమ మాటలను ఎలా వింటున్నారనే ఆలోచన నత్తిగా మాట్లాడేవారికి ఎప్పుడూ వుంటుంది. కాబట్టి వారి ఎదురుగా వున్నప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నదీ గమనించడం మాని, వారి మాటలు వింటున్నట్టుగా కనిపించాలి. వారు చెప్పదలచుకున్న మాటలను పూర్తిగా చెప్పనివ్వాలి. వారు చెప్పడంలో ఆలస్యం అవగానే ఆ పదాన్ని ఎదుటివారు పూర్తిచేయకూడదు. వారి మాటలు వినడంలో చిరాకు వున్నట్టు ముఖంలో చూపకూడదు. వారి మాటలు వేగాన్ని అర్ధం చేసుకొని కబుర్లు చెప్పడంలో కొంచెం వేగం తగ్గించాలి. దీనివల్ల సాధారణ మనుషులమేనన్న నమ్మకాన్ని వారు పెంచుకోగలుగుతారు.
నత్తికి శాశ్వత పరిష్కారం ఇంతవరకూ లేదు. ఫిజియోథెరపీ ద్వారా చేసే చికిత్స తాత్కాలికమే. కొంతకాలం తర్వాత తిరిగి నత్తి వస్తుంది. అయితే నత్తి అవరోధం కాకూడదు. మిగిలిన అంశాలలో బాగుండే నత్తి సర్దుకుపోతుంది. నత్తి లక్షణాలు కలిగినవారికి- నివారణకు ఒకటే మార్గం. అది ‘స్పీచ్ థెరపీ’. దీనివల్ల నత్తి లక్షణాలు తగ్గుతాయే తప్ప పూర్తిగా నయం కాదు. అయితే నత్తివల్ల నష్టం ఏమీ లేదు. నత్తి వుండి జీవితంలో ఎన్నో విజయాలు సాధించినవాళ్ళూ వున్నారు.
ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకులు ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్‌కి నత్తి ఉండేది. అయినా నాయకుడిగా ఎదిగాడు. బ్రిటీష్ ప్రధానుల్లో అత్యుత్తముడిగా చెప్పుకునే విన్‌స్టన్ చర్చిల్‌కి నత్తి ఉంది. అయినా తన ప్రసంగాలతో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పౌరులను ఆకట్టుకోగలిగాడు.
అలాగే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రచయిత సోమర్‌సెట్‌మామ్, ప్రఖ్యాత నటి మార్లిన్ మన్రోలు, ‘అంతిమ తీర్పు’ ప్రసాద్ నత్తితో బాధపడేవారు. అయితే ఆయా రంగాల్లో వారు రాణించగలిగారు.
ఇలా ఎందరో... కాబట్టి తమకున్న నత్తి మరచి నలుగురిలో కలిసిపోయే ప్రయత్నం చేయాలి. అలాగే నత్తి వున్నవారిపట్ల ఇతరులు సహృదయంతో ఆదరించాలి. నత్తివారికైనా వికలాంగులకైనా మీరు చూపించే సుహృద్భావమే వారికి సరైన మందు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి