మంగళవారం, మార్చి 26

ఉగాది కవితల పోటీలు: సేవ


 తెలుగు అంతర్జాల పత్రిక  ” సేవ “   ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహిస్తోంది.   ప్రపంచ  నలుమూలలా తెలుగు సాహిత్యాభిమానులు అంతర్జాలములో ఉండటం వలన  ఈ  కవితల పోటీలు 'సేవ' నిర్వహిస్తోంది.
 తెలుగుదనం ఉట్టిపడేలా, విజయ నామ తెలుగు  సంవత్సరానికి సరికొత్త స్ఫూర్తి అందించే విధంగా, తమ తమ కవితా సౌరభాన్ని అందరితో పంచుకునేందులా  ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ ఉగాది  కవితల పోటీకి కవులు, కవయిత్రులు ,  ఔత్సాహికులు   తమ తమ  రచయితలను  పంపవలసినదిగా ‘ సేవ ‘ సంస్థ  కోరుతోంది.

   

    
   
           ఉత్తమ కవితకు  మూడు వేల రూపాయలు ,
  ద్వితీయ ఉత్తమ కవితకు రెండు వేల రూపాయలు
తృతీయ  త్తమ కవితకు వెయ్యి  రూపాయలు 
నగదు అందజేయడం జరుగుతుంది.
‘సేవ’  అందించే పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 
 
    దేశ విదేశాల్లో ఎక్కడున్నా  తెలుగు కవులందరూ ఈ కవితల పోటీలో పాల్గొనవచ్చు.    వివరాలు   ఒక్కొక్కరు  ఎన్ని కవితలైనా పంపవచ్చు.    ఇంతవరకు ఎక్కడా పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ, గూడుల్లోనూ ప్రచురణకాని, ఎక్కడా  ప్రసారం కాని  కవితలను మాత్రమే  పంపాలి. పైగా దేనికీ అనువాదం, అనుకరణగాని వచన కవితలను మాత్రమే పంపించాలి.

     కవితలు 30 వరుసలకు మించి ఉండరాదు.   సామాజిక అంశంపైన రాసిన  తెలుగు కవితలు మాత్రమే ఈ పోటీలకు అర్హత కలుగుతాయి.  కవితలను విద్యుల్లేఖ (e-mail) ద్వారా  editor.seva@live.com  మరియు sahithyaseva@gmail.com ఇ-చిరునామాకు పంపాలి.  మీరు పంపే  విద్యుల్లేఖ (ఈ-మెయిలు)  విషయం (సబ్జెక్ట్)లో  ‘కవితల పోటీకి’  అని రాయాలి.   తొలుత  కవిత శీర్షిక  పేరు రాసి..   ఆ తర్వాత  కవితను రాసి పంపాలి.

     చివరన మాత్రమే  కవి లేదా  కవయిత్రి  పేరు, చిరునామా, దూరవాణి సంఖ్యను (Telephone Number) వ్యక్తిగత వివరాలు, హామీపత్రం మరియు మీ పూర్తి పేరు,  మీ ఖాతా ఉన్న బ్యాంకు పేరు, ఊరు, ఖాతా సంఖ్య   తప్పని సరిగా  పంపాలి.  రెండు రకాల  ఫోటోలను విద్యుల్లేఖకు  జతపరచాలి. కలం పేరుతో రాసే రచయితలు తప్పని సరిగా వారి పూర్తి పేరు వివరాలు తెలియపరచాలి.  

 ఆసక్తి గల వారు తమతమ కవితలను ఏప్రిల్ 6 తేదీలోగా  మా విద్యుల్లేఖ కు పంపాలి.

     విజేతలకు ఫలితాల వివరాలను నేరుగా విద్యుల్లేఖ ద్వారా  మరియు పత్రిక ద్వారా  తెలియజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఉత్తమ కవితలను

సేవ   తెలుగు అంతర్జాల పత్రిక

http://sevalive.com/ , http://www.sahithya.sevalive.com/

లోనూ ప్రచురిస్తామని నిర్వాహకులు తెలిపారు.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలను
http://www.sahithya.sevalive.com/  లో ప్రచురిస్తామని నిర్వాహకులు తెలిపారు.

   కవితాంశం వచనమైనా  ఆశాజనకంగా,   స్ఫూర్తిమంతంగా ఉన్నవాటికి అధిక ప్రాధ్యానత.   సామాజకంగా, స్పూర్తిదాయకంగా, ఆలోచన రేకెత్తించేలా ఉన్న కవితల కవితాత్మకతకు పట్టం కడుతాం.

         కవితల ఎంపికలో న్యాయ నిర్ణేతల నిర్ణయమే  తుది నిర్ణయం. ఈ విషయంలో వాదోప వాదాలకు తావు లేదు.  పంపిన కవితలను సాధారణంగా  ‘సేవ’ సంస్థ నిర్వహణలోని  తెలుగు అంతర్జాల పత్రికలో  ప్రచురించే హక్కు   ఉంటుంది.   కవితలు ‘ సేవ’లో ప్రచురణమైన తర్వాత గతంలో ప్రచురణమైనట్లు నిర్వాహకులకు తెలిసిన యడల నిబంధనలను అతిక్రమించినట్లు భావిస్తాం.  నగదు  బహుమతిని కూడా నిలిపి వేస్తాం.   ఉత్తమ, ద్వితీయ, తృతీయ  విజేతల నగదు బహుమతిని ఏప్రిల్ లోనే  పంపుతాము.  పోటీ కవితల నుంచి  ప్రత్యేకంగా  ప్రచురణకు ఐదింటిని ఎంపికచేసి   500/- రూపాయలు వంతున నగదు అందజేస్తాము. అలాగే  మరో పది మందిని ప్రోత్సహిస్తూ ఒక్కో కవితకు  వంద రూపాయల వంతున నగదు చెల్లిస్తాము. ఇది ఔత్సాహికులకు మాత్రమే.. ఔత్సాహిక రచయితలు పంపిన కవితలు ఉత్తమంగా కూడా ఎంపిక చేయవచ్చు. అయితే మేం ఔత్సాహికులమని  తప్పని సరిగా పొందుపరచాలి.   ఆయా విజేతలకు  తమ  కవితలను ప్రచురించిన తదుపరి మాసంలో నగదు బహుమతి పంపుతాము. సాధారణ ప్రచురణకు కూడా  బహుమతి పంపుతామని  నిర్వాహకులు తెలిపారు.

పోటీకి పంపే తమ రచనలను
http://lekhini.org/
http://www.google.com/intl/te/inputtools/cloud/try/
http://translate.google.co.in/ 
http://www.google.com/inputtools/windows/index.html
http://www.adityafonts.com/kbds.html
http://suravara.com/
http://anupamatyping.com/

మొదలగు  అంతర్జాలాలనుంచి     తెలుగులో స్పష్టంగా టైపు చేసి పంపాని  నిర్వాహకులు తెలిపారు.ఇతర వివరాలకు  తమను  సంప్రదించవచ్చని ‘సాహితీ సేవ’ నిర్వాహకులు  తెలిపారు. 

 పూర్తి వివరాలకు :

‘సేవ’ తెలుగు పత్రిక, పెదకాపు లేఅవుట్,తిరుపతి.

దూరవాణి:

0949 222 4 666

విద్యుల్లేఖ( ఈమెయిలు) :   editor.seva@live.com



2 కామెంట్‌లు:

  1. కంచర్ల గారికి,
    నమస్కారములు.
    మీ సేవలో కవితల పోటీలు నిర్వహిస్తున్నందులకు ధన్యవాదములు.
    కవితలను మీరు సేవ http://sevalive.com/ లో ప్రచురిస్తున్నట్లు తెలిపారు.
    పోటీకి ఎంపికయిన కవితలను ఎప్పుడు, ఏ తారీఖున ప్రచురిస్తారో ముందుగా మాకు తెలుపగలరా?
    - జి.వెంకటేశ్వర్లు

    రిప్లయితొలగించండి
  2. వందనాలు
    కవితలపోటీ జరుపుతున్న విషయం తెలుసుకొన్నాము.. బాగుంది. మేము ఈరోజు మీ మెయిల్ ఐ డీ కి కవితలు రెండు పంపినాను. పరిశీలించగలరు. అలాగే.. మీరు మొదట రెండువేలు రూపాయలు ఉత్తమ కవితకు ఇస్తామన్నారు. ఇక్కడ మూడు వేలు ప్రకటించారు. ఏది కరక్టు. నగదు పెంచారా? తెలియజేయగలరు>
    - లక్ష్మి, హైదరాబాద్

    రిప్లయితొలగించండి