అమ్మాయలు ఇష్టపడాలంటే…
నేటి ప్రపంచం లో అబ్బాయిలకంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలకు సైట్ కొడుతున్నారని ఒక పరిశోధన.ఈ పరిశోధనలు ఎవ్వరు కనిపెట్టారో కాని అన్ని నిజాలే చెప్తారు సుమండీ!.గతం లో అమ్మాయిలకు ఉండే సిగ్గు జాడ్యం ఇప్పుడు ఎక్కువగా అబ్బాయిలకు అంటుకుందట.ఏది ఏమైనా అమ్మాయిల మనసు లోతు తెలుసు కోవడం చాల కష్టం.మనసు లోతులోకి తొంగి చూడాలంటే ఆడవాళ్ళ సైకాలజీ తెలుసుకోవాలి మరి.
- కత్తిమండ ప్రతాప్
* అమ్మాయిలను ఎక్కువగా పొగుడుతూ వుండాలి.
* వారితో చాల లాజిక్ గా మాటాలాడాలి.
* చెత్తా డైలాగ్స్ వేసేవారంటే అమ్మాయిలకు నచ్చదు
* చతుర సంభాషణగా మాటలాడే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు
* అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల అందానికి ప్రాముక్యత
ఇవ్వకపోయినప్పటికి హుందాతనానికి ప్రాముక్యత ఇస్తారు
* నడక చూసి ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు
* జోక్స్ వేసే వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
* నలుగిరిలో పేరున్న వ్యక్తులను అమ్మాయిలు లైక్ చేస్తారు.
* పిచ్చి తలలు .రంగుల తలలు వేసే వారిని ఇష్టపడే వర్గం వేరేగా వుంది.
* మరికొంతమంది మొరటు వ్యక్తులను ఇష్టపడతారు.
* అందానికి తక్కువ ప్రాముక్యత ఇస్తారు.
* సెంటిమెంటు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
* పాటలు పాడేవారిని అమ్మాయిలు లైక్ చేస్తారు.
* ఉద్యోగం చేసే వారిని ఇష్టపడతారు.
* అమ్మాయిల దగ్గర బిగ్గరగా లౌడ్ స్పీకర్ ల మాటలాడకుడదు
* మృదు మధుర సంభాషణ అలవాటు చేసుకోవాలి.
* అమ్మాయిల కళ్ళలోకి పదే పదే చూడరాదు.
* అలా చూడటం వాళ్ళకు చెడు అభిప్రాయం కలుగుతుంది.
* సింపుల్గా హుందాతనం గా ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు.
* డ్రెస్ మైంటేనెనసే పాటించేవారిని లైక్ చేస్తారు.
* అబ్బాయిల కాళ్ళు సుబ్రతను అమ్మాయిలు పరిగణలోకి తీసుకుంటారు.
* తలవంచి మాటలాడే టప్పుడు వారు కాళ్ళ భాగాన్నే గమనిస్తారు
* చేతులు ఉపే వారంటే వారికి ఇష్టముండదు.
* మీసం అందాన్ని చూసి లైక్ చేసే వారు చాల మంది ఉంటారు.
* మీసం లేని వాళ్ళను ఇష్టపడే వాళ్ళు కూడా వున్నారు కాని తక్కువ.
* హెయిర్ స్ట యిల్ ను చాల మంది ఇష్టపడతారు.
……ఇలా అనేక రకాలుగా మగవాళ్ళను ఇష్టపడుతున్నట్లు పరిశోధనల్ సారంశం.ఓకే అబ్బాయిలు చూసారు కదా ..ఇందులో మీ లక్షణాలు ఏమిటో మీరే తెలుసుకోండి.ఎవరెన్ని చెప్పిన కాని ఆడవారి మనసు తెలుసు కోవడం బహు కష్టం సుమా !!!
బాయ్ ఫ్రెండ్స్‌ను అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఏయే సందర్భాల్లో మగవారు ఎలా నడుచుకుంటారో, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి పెద్ద తెలివి తేటలు అక్కర్లేదు. కామెన్ సెన్స్ ఉంటేచాలు’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు.
అబ్బాయిల్ని యిష్టపడాలంటే వారు ఎలా నడుచుకోవాలో, ఎలాంటి వారిని లైక్ చేస్తారో ఈ అమ్మాయిలు చెపుతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరు, కావలి, బ్రహ్మదేవి, బుజబుజ నెల్లూరులోని కాలేజీ అమ్మాయిలు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. సో… అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఆలకించాలి! ఈతరం యువతులు సమానత్వం కోరుకుంటున్నారు. అవకాశం అందితే ఒక మెట్టు పైనే ఉండాలని అనుకుంటున్నారు. అసలు, ఆడ, మగ సమానమా.. కాదా… వంటి వాదనలు కాసేపు పక్కన పెడితే తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచని అబ్బాయిలంటే అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదుట. ఈతరం అమ్మాయిలకు ‘మహారాణి’గా మంచి హోదా ఇవ్వాలని అంటున్నారు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయే అబ్బాయిలంటేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. పెద్ద గొంతుతో గోలగోలగా మాట్లాడే వాళ్ళతో కాసేపు గడపాలన్నా చిరాకే. వారి గొడవ వారిది తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు ఎదుటివారి భావాలను అర్థం చేసుకోలేరు. హుందాగా ప్రవర్తిస్తూ, ఎదుటివారిని కలుపుకుంటూపోయే వారు మంచి ఫ్రెండ్‌గా, ఇష్టపడితే మంచి భాగస్వామిగా రాణిస్తారని అలాంటి వారికే అమ్మాయిలు ఎక్కువగా మార్కులు వేస్తున్నారు. మొట్టమొదటి సారిగా కలసి బయటకు వెళ్ళినప్పుడు కాస్తయినా మొహమాటం, మర్యాద లేకుండా ‘‘ఎవరి బిల్లు వారే కడితే’’ అని అడిగే అబ్బాయిలను అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరంటున్నారు.
స్నేహం బాగా పెరిగాక సంగతి వేరు. కానీ మొదటిసరా కాఫీకి, కూల్‌డ్రింక్‌కూ కూడా లెక్కలు చూసుకునే వాళ్ళంటే చులకన భావమే తప్ప గౌరవం కలగదట.
తమతమ సంస్కారం కొద్దీ కొంతమంది అమ్మాయిలు బిల్లు తామే కడతామని చెప్పవచ్చు. అది వేరే విషయం. కానీ ఆమాట అబ్బాయిలు అడిగితే మాత్రం అమ్మాయిలు సహించలేరని వారు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
- కంచర్ల
అమ్మను ఇష్టపడితే చాలు..
అమ్మను ఇష్టపడే మగవాళ్ళంటే సాధారణంగా అమ్మాయిలకు యిష్టం. తల్లిని గౌరవించిన వాడు భార్యనూ గౌరవిస్తాడని అమ్మాయిలకు ఓ నమ్మకం. అమ్మపట్ల ఆరోగ్యకరమైన ప్రేమ ఉన్నా అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుంది. భార్య స్థానంలో ఉన్నా తనను అలాగే గౌరవిస్తాడనే నమ్మకం అమ్మాయికుంది. ఈ జన్మకు కారకురాలు ఆ అమ్మే కదా మరి!
-పల్లవి
ఏడ్వగలిగినవాడే మగాడు
మనస్ఫూర్తిగా ఏడ్వగలగడం ఓ వరం. ఇది అమ్మాయిలకే పరిమితమైన విషయమనుకోను. మన సమాజంలో మగాళ్ళు ఏడవకూడదన్నట్టుగా చిన్నప్పటి నుంచీ పెంచుతారు. నిజానకి దుఃఖం వచ్చినప్పుడు ఏడ్వడానికి సిగ్గుపడనివాడే అసలైన మగాడు. బాధను వ్యక్తం చేసేందుకు సంకోచించని వాడే తన బాధ్యతలనూ పరిపూర్ణంగా నిర్వర్తించగలడు.
-సితార
నిజాయితీ ముఖ్యం
ఏ విషయంలోనై నా ఆడవాళ్ళకు నిజం కావాలి. కేవలం నిజం. అది బాధపెట్టేదైనా సరే. భయపెట్టేదైనా సరే… దాన్ని ఎదుర్కొనే మానసిక సన్నద్ధత అమ్మాయిలకు లేకపోలేదు. అబద్ధం చెప్పి సంతోష పెట్టేకంటే నిజం చెప్పి కష్టపెట్టినా సరే అమ్మాయిలు స్వాగతిస్తారు. అసలు ఓ విషయంలో నిజం దాచాల్సి వచ్చిందంటేనే ఏమో ఎవరికి తెలుసు?
-స్వర్ణ
మరో అమ్మాయి జోలికెళితే…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి