అందరిలోకి భిన్నంగా కన్పించటమే ఫ్యాషన్. అందరి కళ్ళలో పడి ఆకర్షించటమే నేటి గొప్పతనం.ఆ ఆలోచనకు తగినట్లుగానే నేటి జుట్టు, రంగు విషయాల్లో మార్పువచ్చింది.
ప్రకృతిలో ఉన్న ఏ రంగునైనా శిరోజాలకు వేసుకోవచ్చు.
హెయిర్ స్టైల్ మార్చుకోవటంలో భాగం శిరోజాలకు కొత్త రంగు వేసుకోవటం.
లిప్‌స్టిక్‌లు ఎన్ని రంగులలో దొరుకుతున్నాయో అన్నిరంగులు శిరోజాలకు వేసుకోవచ్చు.
అంతర్జాతీయ సూపర్ మోడల్స్ నిగనిగలాడే ఎరుపు రంగు, మెరిసే రాగి రంగు, నలుపు రంగులతో కనిపించి అందరినీ అమితంగా ఆకట్టుకోవచ్చు. ఎన్నో రంగులతో జుట్టు ఫ్యాషన్లు వచ్చాయి. రకరకాల హెయిర్ స్టయిల్స్ రూపుదాల్చుకున్నాయి. ముఖం, ఆకారానికి తగిన హెయిర్ స్టయిల్స్‌ను నేడు అనుసరించటమే ఆధునిక అమ్మాయిలకు మేలైన పద్దతి. ఈ హెయిర్ స్టైల్స్ పట్ల అతివలు అమితంగా మోజుపడుతున్నారు కూడా-
చక్కని శిరోజాలున్నపుడు వాలుజడ వేసుకున్నా, ముడి వేసుకున్నా అందంగానే ఉంటుంది. మారుతున్న సమాజ పరిస్థితులకు తగిన విధంగా ఫ్యాషన్ కూడా మారుతుంది. ఫ్యాషన్‌తో డ్రెస్‌లు మారాయి. హెయిర్ స్టైల్స్ మారాయి.
ఈ తరం అమ్మాయిలు ఎప్పుడూ ఒకే తరహా హెయిర్ స్టైల్‌లో ఉండాలనుకోవటంలేదు. ముఖానికి తగిన హెయిర్ స్టైల్ కోరుకుంటున్నారు. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. కొందరి ముఖాలు గుండ్రంగా ఉంటే, మరికొందరివి అండాకారంలో ఉంటాయి. పొడవు ముఖాలు మరికొందరివి.
తలరూపమే కాదు ముక్కు, నుదురు, పెదవులు అన్నీ ఒకరితో ఒకరికి సంబంధముండదు.
వెడల్పాటి నుదురు కలవారు కొందరైతే, పొడవు ముక్కు మరికొందరిది.

గడ్డం ముందుకు సాగి,
వెడల్పాటి నోరు కలవారు వుంటారు. ముఖ రూపం, ముఖం మీది భాగాలు ఎలా ఉన్నా అందరి హెయిర్ స్టైల్ ఒకటిగానే ఉండేది. సాంప్రదాయకంగా జుట్టును వెనక్కి దువ్వి, బిగించి జడవేసేవారు. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు అదే హెయిర్‌స్టైల్. పిల్లలు పెద్దవారవుతుండగా తల్లులు ముడీ చుట్టుకోవటం మొదలుపెట్టేవారు. అటువంటి హెయిర్ స్టైల్‌తో బోర్ కొట్టిన యువతరం కొత్తరకం హెయిర్‌స్టైల్ మీదికి దృష్టిపెట్టారు. మూడు దశాబ్దాలక్రితం నుంచి హెయిర్‌స్టైల్ ఫ్యాషన్ పుంజుకుంది. 1980లో ఫ్యాషన్ విప్లవం మొదలైంది.

ఇటీవల కాలంలో మోడలింగ్ ఇండస్ట్రీ ఎదుగుదలతో హెయిర్ స్టైల్‌లో
గణనీయమైన మార్పులు వచ్చాయి. అందం మీద అధ్యయనం ఆరంభించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేకంగా బ్యూటీసెలూన్లు వచ్చాయి. అందరి హెయిర్‌స్టైల్స్ ఒక్కటే కాక వారి ముఖానికి తగిన హెయిర్‌స్టైల్‌ని ఫ్యాషన్‌గా వేయడం మొదలుపెట్టారు. ఎవరి ముఖం, ఆకారానికి తగినట్టుగా హెయిర్‌స్టైల్‌ను అనుసరించడమే మేలైన పద్ధతిగా బ్యూటిషియన్లు చెప్తున్నారు.కలరింగ్
ఆడపిల్లలు ఇప్పుడు చేపట్టని వృత్తిలేదు. మోడలింగ్, యాక్టింగ్, యాంకరింగ్… వంటి
అందాలకు చెందిన వాటిలో అన్ని అంశాలు ఆ పరిశ్రమలో ఉన్నవారే చూసుకుంటున్నారు. కానీ హోటల్స్‌లో, ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నవారికి తమ రూపంలో మార్పు గురించిన ఆలోచన ఉంటుంది. ఉద్యోగం లేదా వృత్తిపరమైన జీవితానికి తగిన విధంగా హెయిర్‌స్టైల్ ఉండాలి. అలాగే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, షాపింగ్, పిక్‌నిక్ లాంటి చోట్ల వెళ్ళేటప్పుడు హెయిర్ స్టైల్‌లో మార్పులుంటాయి.
ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కోసం ప్రత్యేకంగా కలర్స్ తయారుచేస్తున్నారు. విదేశీ కంపెనీలు
పలు రకాల రంగులతో మన దేశపు ఫ్యాషన్ మార్కెట్‌లోకి దూసుకువచ్చాయి.
జుట్టుకి ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులతో ఎవరైనా తారసపడినట్లయితే చూసి ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఫ్యాషన్ రంగం అంతగా దూసుకుపోతుంది మరి.
హఠాత్తు మార్పు వద్దు:
‘హెయిర్‌స్టైల్ మార్చుకోవటం, రంగు వేసుకోవటం వంటివి రెండూ జీవితంలో మరువలేని అంశాలే.ఒక్కసారిగా హెయిర్‌స్టైల్ మార్చుకుని నలుగురిలోకి వెళ్ళటంలో కొంతవరకు ఇబ్బంది ఉంటుంది.
రెండు మూడు వారాలు ఇంట్లోనూ, చుట్టుప్రక్కల మార్పుకు అలవాటుపడాలి’’ అని
ఓ బ్యూటీ కార్నర్ అధినేత ఉష చెబుతున్నారు. హెయిర్ స్టైల్‌తో చూపు, నడక, డ్రెస్, నవ్వు వంటివన్నీ మారతాయి. మారాలి కూడానని ఆమె అంటున్నారు.
హెయిర్‌స్టైల్‌ను అందంగా, ఆకర్షణీయంగా అతివలు మార్చుకోవటానికి,పెర్మింగ్, టింటింగ్ వంటివి జుట్టుకు పట్టడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి బ్యూటీగా తయారయ్యే అమ్మాయిలు జాగ్రత్తలు గమనించి, అనుకరిస్తే కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్త ఆకర్షణ కొత్త ఆకర్షణ సంపాదించుకోగలుగుతారు.
- ఉష
శిరోజాలకు ఆరోగ్యం
‘‘హెయిర్ స్టైల్ ఎటువంటిదైనా దానికి ఆరోగ్యకరమైన జుట్టు అవసరం.
శిరోజాల ఆరోగ్యానికి చక్కని ఆహారం కావాలి. స్వతహాగా ఆరోగ్యం లేని శిరోజాలకు
ఎలాంటి మేకప్ చేసినా ఒక్కటే. పోషక పదార్థాలు తగు మోతాదులో తీసుకోవడం తప్పనిసరి.
అన్ని రకాల విటమిన్‌లు, లవణాలు శరీరానికి తప్పక అందాలి.
రక్తం ద్వారా ఆ కీలక పోషక పదార్థాలు మాడుకు చేరినపుడే శిరోజాలు చక్కగా ఎదుగుతాయి.
చక్కని రంగునూ చూపుతాయి. రంగులూ అద్దుకుంటాయి. ఆరోగ్యంతో కూడిన శిరోజాలు ఎటు తిప్పినా తిరుగుతాయి’’ అని డాక్టర్ సింధు వెల్లడించారు. రాలిపోయే శిరోజాలకు హెయిర్ స్టైల్ అనవసరం. రక్తం సరఫరా కాకపోవడమే జుట్టు రాలిపోవటానికి కారణం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రక్తప్రసరణ జరుగుతుంది. శరీర భాగాలకు మంచి శక్తినిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా మార్చుకోవచ్చు. అందంగా, అందరినీ ఆకట్టుకోవచ్చు.

- డాక్టర్ సింధు
హ్యాండ్ బ్యాగ్‌లోనే అన్నీ
తక్కువ సమయంలో ఎక్కువ ఆకర్షణ కలిగిన రూపం తెచ్చుకోవటం నేడు
వర్కింగ్ ఉమెన్ లక్ష్యంగా మారింది. ఆఫీసునుండి
అప్పుడప్పుడు కొన్ని పార్టీలకు, సభలు, సమావేశాలకు ఇతర ఫంక్షన్లకు
హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తుందని అందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని
శ్రీమతి సంధ్య వెల్లడించారు. రకరకాల హ్యాండ్ బ్యాగులు వచ్చినట్లే అందంగా తయారుకావటానికి అనేక రకాల మేకప్ సామగ్రి మార్కెట్‌లో లభిస్తున్నాయని తెలిపారు. మేకప్ చేసుకోవడానికి ఏ బ్యూటీ సెలూన్‌కో, ఇంటి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నింటిని హ్యాండ్ బ్యాగులో భద్రపరచుకునేలా వస్తున్నాయని సంధ్య చెపుతున్నారు. – సంధ్య

అందు
మేకప్ సామగ్రి
రంగు రంగుల హెయిర్ క్లిప్స్, వాటిమీద రంగుల పూలు పొదిగినవి ఇప్పుడు మార్కెట్‌లో
లభిస్తున్నాయని, ఇతర మేకప్ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాయని ప్రతిమ చెప్పారు.
సంధ్య అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ త్వరత్వరగా అందంగా తయారుకావటానికి ప్రతి అతివలకు హ్యాండ్‌బ్యాగ్ అవసరమన్నారు. చాలా సింపుల్‌గా హెయిర్ స్టైల్‌కి, ఇతరత్రా మేకప్ సామగ్రిని బ్యాగులో ఉంచుకోవాలని, దువ్వెనలు, హెయిర్‌పిన్నులు మరచిపోకూడదని ప్రతిమ అన్నారు. మనం అందంగా తయారుకావటానికి ఆఫీసు లేదా ఏదో ఓ మూల ప్రదేశం, చివరికి బాత్‌రూములైనా ఉపయోగించవచ్చని నిర్మొహమాటంగా అభిప్రాయపడ్డారు. అంత తక్కువ సమయంలో చక్కని ఆకర్షణతో తయారవగలిగిన రహస్యం ఏమిటోనని మిగిలినవారు ఆశ్చర్యపోతారని ఆమె చెప్పారు.

- ప్రతిమ
నా పెళ్ళికి నేనే’’
ముఖానికి, చేస్తున్న వృత్తికి తగిన హెయిర్ స్టైల్‌ను ఎంచుకోవాలని,
అందులోనే అసలు కిటుకు, అందం ఉందని ప్రముఖ బ్యూటీషియన్ స్వాతి చెప్పారు.గంటల తరబడి అద్దం ముందు కూర్చుని హెయిర్ స్టైల్ తయారుచేసుకునేంత తీరిక ప్రతిరోజు ఉండదు. అందంగా కనిపించాలన్న కోరికయితే ఉంటుందిగాని తీరికతోపాటు ఓపిక కూడా అందరికి ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిరోజూ బ్యూటీ సెలూన్‌కి వెళ్ళే సమయం ఉండదు కనుక కొద్దిపాటి తీరిక, ఓపికతోపాటు ఉత్సాహం చూపితే తనకు తానే అందంగా తయారుకావచ్చని అన్నారు. ఎలాంటి కోర్సు చేయకుండానే తాను బ్యూటీషియన్ అయ్యానని, తన పెళ్లికి తానే అలంకరించుకున్నానని స్వాతి ఆనందం వ్యక్తంచేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి