శుక్రవారం, నవంబర్ 22

ఇల్లే ఔషధ శాల

ఇల్లే ఔషధ శాల
          ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగుపెట్టడం ఆ రోజుల్లో మనకు అలవాటై పోయిందిగానీ చిన్న చిన్న అనారోగ్యాలకు మన వంటిల్లే ఔషధశాలగా పనిచేస్తుంది.
మనం వంటల్లో ఉపయోగించే చాలా వాటిల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
అంతకుమించి ఇవి శరీరానికి ఎలాంటి హాని కూడా చేయవు. కాబట్టి తరచుగా వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు, దెబ్బలు, గాయాలకు వంటిల్లే క్లినిక్ సెంటర్. మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతుక్కునే ముందు ఒకసారి వంటింట్లోకి వెళితే బాధితుల బాధకు దివ్యౌషధాలు దొరుకుతాయి.

నోటిపూతకు:

       చాలామందికి నోటిపూత చాలా బాధిస్తుంది.  అంతేకాదు మందులు వేసుకున్నా అంత త్వరగా తగ్గదు.  ఒక్కోసారి నోట్లో పుళ్లు మానేసరికి వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.
నోటిపూతకి టీ బ్యాగులతో మంచి చికిత్స చేయవచ్చు. టీలో ఉన్న టానియన్స్ నోటిపూత బాధనుంచి వెంటనే ఉపశమనం కల్గిస్తుంది. ఇది పొక్కులపై పూతగా ఏర్పడి బాధను తగ్గిస్తుంది. టీ బ్యాగుని గోరువెచ్చని నీటిలో ముంచి తర్వాత దానిని నాల్కమీద ఉంచుకోవాలి.
కొన్ని నిమిషాలు అలాగే ఉంచితే బాధ తగ్గుముఖం పడుతుంది.

చక్కని శ్వాసకు:

       శ్వాస సమస్యతో బాధపడే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు  హఠాత్తుగా తమ ఇన్‌హేలర్ అయిపోతే వెంటనే ఒక కప్పు కాఫీ తాగమంటున్నారు పరిశోధకులు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను తొలగించే మందులు ఎలా పనిచేస్తాయో కెఫిన్ రసాయనిక చర్య కూడా అంత బాగా పనిచేస్తుంది.  అయితే ఇన్‌హేలర్‌కి బదులు పూర్తి ప్రత్యామ్నయంగా కాఫీనే వాడమని చెప్పడంలేదు. ఇన్‌హేలర్ అందుబాటులో లేనపుడు, అత్యవసర సమయాల్లో
రెండు కప్పులు బ్లాక్ కాఫీ తాగితే సరిపోతుంది.

పొట్ట సమస్యలకు:

 అల్లం టీని చాలామంది వాడుతుంటారు. అది రుచికే కాదు వైద్యానికీ భేషైనది. అజీర్తి, కడుపులో తిప్పడం లాంటి  బాధలు అల్లం టీతో వెంటనే సర్దుకుంటాయి. అలాగే వాంతులు వచ్చినట్లుండటం,  తల తిప్పటం మొదలైన వాటిని కూడా తగ్గించగలుతుంది
  .

కాలిన గాయాలకు:

 కాలిన గాయాలకు తేనె బాగా పనిచేస్తుంది.
చర్మం కాలినపుడు జరిగే హాని చాలావరకు గాయాలమీద కింద బొబ్బలవల్లే జరుగుతుంది.
చర్మం కాలినపుడు బొబ్బలు, వాపు రాకుండా నివారించే చర్యలో తేనె బాగా పనిచేస్తుందని
వైద్యులు పరిశోధనలు చేసి చెబుతూనే ఉన్నారు. చిన్నపాటి కాలిన గాయాలకు తేనెని వాడవచ్చు.  ముందు చర్మంపై కాలిన ప్రదేశాన్ని నీటి ధారకింద ఒక నిమిషంపాటు ఉంచాలి.
దీనివల్ల చర్మం ఇంకా లోపల ఉడికిపోవటం తగ్గుతుంది. తరువాత ఆ ప్రదేశంలో  సున్నితంగా తేనెని రాసి, బాండేజ్ వేయాలి. అయితే దీనిని   చిన్న గాయాలకు మాత్రమే వాడటం మంచిది.

తెగిన గాయాలకు:

చర్మం తెగి గాయమైతే అది మరింత హాని చేయకుండా  తెగిన చోట వెంటనే చిటికెడు నల్ల మిరియాల పొడిని చల్లాలి.  దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్ ఎలాగైతే మంటపుడుతుందో అలాగే నల్ల మిరియాల పొడి కొన్ని సెకన్లపాటు మంటపుడుతుంది.
ఇది చర్మ కణాలకు ఎలాంటి హాని చేయదు.

వెక్కిళ్ళకు:

వెక్కిళ్ళు ఒక్కోసారి చిరాకు, అసౌకర్యానికి గురిచేస్తుంటాయి.
వీటిని ఆపడం అసాధ్యమవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదారను తింటే చాలు.
వాటంతట అవే తగ్గిపోతాయి.

దోమలు, తేనెటీగలు కుడితే:

తేనెటీగ కుట్టి బాధపడుతున్నపుడు, దోమలు కుట్టినపుడు వచ్చే దురదలకు  బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించటమే కాకుండా వాపుని రాకుండా ఆపుతుంది.
అలాగే మచ్చలు కూడా ఏర్పడవు.

జలుబుకు:

 తగిన శాస్ర్తియాధారాలు లభించినప్పటికీ జలుబుకి  మసాలాలు దట్టించిన ఆహారం, కోడి మాంసం వంటివి తీసుకుంటే  ఉపశమనంగా ఉండటం గమనించవచ్చు. జలుబుకు చేపల కూర పులుసు మరీ బెస్ట్. 
మురికిని వదిలించేందుకు: స్నానానికి ఉప్పు వాడకం వింటున్నాం కాని  ఇదో కొత్త పద్ధతి. ఒక కప్పు పంచదార తీసుకుని పేస్టులా కలపాలి. దీనిని ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేయడం ద్వారా మురికి బాగా వదులుతుంది.  మీకిష్టమైన క్లెన్సర్‌ను కూడా దీనితోపాటు వాడవచ్చు.

  పాలిచ్చే తల్లుల కోసం:

   తల్లికి పాలు గడ్డకట్టడంవల్ల రొమ్ముల్లో వచ్చే వాపు, నొప్పులకు క్యాబేజి ఆకులు
 ఉపశమనం ఇస్తాయి. చెస్ట్‌పై క్యాబేజి ఆకులను పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా వాపూ తగ్గుతుంది. అలాగే బహిష్టుకి ముందు వచ్చే రొమ్మునొప్పికి క్యాబేజి ఆకులు ఉడికించి కట్టడంవల్ల మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజీకి ఆకులు (పైపొరలు) పెద్దవి చేసి వాటిని మెత్తబడేవరకు ఉడికించి, వీటిని గోరువెచ్చగా అయ్యాక నొప్పిగా ఉన్న రొమ్ముల మీద బాగా చల్లారేదాకా ఉంచితే ఉపశమనం తప్పక ఇస్తుంది.

గొంతు నొప్పులకు:

గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటితో ఒక స్పూను ఉప్పు కలుపుకుని బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడునుంచి నాలుగుసార్లు చేయవచ్చు. అలాగే బాగావేడి చేసి
నోరు పూసిన వారు కూడా ఇలానే చేస్తే ఉపశమనం ఇస్తుంది.

శిరోజాలకు:

నూనె, గుడ్డు, పాలు కలుపుకుని  ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని స్నానం చేయడంవల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అందంగా, శిరోజాలకు మెరుపును సంతరించుకుంటుంది.
వెంట్రుకలు వూడిపోకుండా మిశ్రమం బాగా పనిచేస్తుంది.

కళ్ళకు:

బంగాళా దుంపలను చక్రాలుగా కోసుకుని కళ్ళపై ఐదారు నిమిషాలు ఉంచుకుంటే
కళ్ళ కింద చర్మం జారడం, కళ్ళకు కలిగిన శ్రమ తగ్గుతాయి.
ఇలాగే దోసకాయ కూడా పనిచేస్తుంది. కళ్ళు మంటలు తగ్గుతాయి.
అందానికి, ఆరోగ్యానికి ఇవన్నీ దివ్యౌషధాలే!

-      కంచర్ల సుబ్బానాయిడు 

సోమవారం, డిసెంబర్ 30

'సాహితీ సేవ' కూటమి కవితల పోటీ

నూతన సంవత్సర సందర్భంగా  “సాహితీ సేవ ” ముఖపుస్తకం   కూటమి (ఫేస్ బుక్) ఆధ్వర్యంలో ‘ కవితల పోటీ’ లను  నిర్వహిస్తున్నామని ఆ బృందం అడ్మిన్లు  పుష్యమి సాగర్,  డాక్టర్  కత్తిమండ ప్రతాప్ తెలిపారు.  కవితలు తెలుగులో  సామాజిక స్పృహను కలిగించే విధంగా  ఉండాలని, ఆసక్తి కలిగిన  కవి/కవయిత్రి   ఈ కవితా పోటీల్లో  పాల్గొనవచ్చని వారు తెలిపారు .


 

ప్రధమ , ద్వితీయ, తృతీయ ఉత్తమ కవితలకు తగిన పారితోషకం  అందజేస్తామని వారు తెలిపారు.  కవితలను డిశంబర్ 31, 2013 అర్థరాత్రి 12-00 నుంచి జనవరి 1 అర్ధరాత్రి 12:00 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయని,  ఆ గడువు లోపు  మాత్రమే https://www.facebook.com/groups/sahitheeseva/ కూటమిలో  టపా చేయాలని కోరారు.    జనవరి 1 అర్ధరాత్రి 12:00 గంటల తరువాత టపా అయిన కవితలు పోటీలు స్వీకరించబడవన్నారు.  కవిత చివర  ‘సాహితీ సేవ’  కవితల పోటీ కోసం .. అని తప్పని సరిగా రాయాలని .  తుది నిర్ణయము న్యాయ నిర్ణేతలదేనని, ఎలాంటి వాదనలకు తావు లేదని వారు వివరించారు.
నిబంధనల గురించి వారు చెపుతూ  కవిత కేవలం కవిత రూపంలోనే వుండాలి పద్య రూపంలో వుండకూడదన్నారు.   కనీష్టం గా 10 వరసలు ఉండి గరిష్టంగా 25 వరసలు ఉండవచ్చని, ముఖపుస్తకంలో   వారి వారి గోడలపై  గానీ,  మరెక్కడా గానీ పోస్ట్ చేసిన  కవితలను పంపవద్దని,  ఇంతవరకు ఎక్కడా పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ, గూడుల్లోనూ ప్రచురణకాని, ఎక్కడా  ప్రసారం కాని  కవితలను మాత్రమే   https://www.facebook.com/groups/sahitheeseva/  కూటమి  లో  టపా చేయాలని తెలిపారు.
    కవితలు   దేనికీ అనువాదం, అనుకరణగాని  కవితలను మాత్రమే పంపించాలని,  అలా చేసిన వాటిన పోటీకీ స్వీకరించబడవన్నారు .  ఒక కవి/ కవయిత్రి ఒకే ఒక  కవిత మాత్రమే  పోటీకి   పంపాలని,  ‘కవిత’ శీర్షిక పేరు పై భాగమున తప్పని సరిగా వుండాలని,కవిత అడుగు భాగమున పేరు, పంపిన తేదీ, ‘సాహితీ సేవ’  కవిత   పోటీ కోసం… అని తప్పని సరిగా  రాయాలని వివరించారు.
 న్యాయ నిర్ణీతల నిర్ణయమే తుది నిర్ణయమని,  2014 జనవరి 2 వతేదీ న్యాయ నిర్ణీతల పరిశీలన జరుగుతుందని,  ఫలితాలను  జనవరి 3వతేదీ ప్రకటించబడుతుందని,  ఉత్తమ కవితను పిన్ పోస్టుగా ప్రచురించబడు తుందని వారు తెలిపారు. 

 పోటీ కి పంపిన కవిత   వివరాలను, మీకు ఇష్టమైతే మీ ఫోటోను, మీ చిరునామా, చరవాణి  పూర్తి వివరాలను sahitheeseva@live.com   మెయిల్  ఐడీకి   పంపాలన్నారు. ముఖపుస్తకం లోని కూటమి లో చేరని వారు https://www.facebook.com/groups/sahitheeseva/  లో  చేరి  కవితల పోటీకి  టపా చేయాలన్నారు.
 ఇతర వివరములకు  9032215609,   9000343095 ఫోన్ నెంబర్స్ సంప్రదించవచ్చన్నారు.ఈ కవితల పోటీ నూతన వత్సరాన నిత్యనూతనంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని పుష్యమి సాగర్,  డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు.
‘సాహితి సేవ’ చేపడుతున్న ఈ కవితల పోటీల్లో కవులు, కవయిత్రులు పాల్గొని  ఈ నూతన వత్సరాన  కవిత్వం, సాహిత్యం  దిగ్విజయం కావాలని ఆశించారు.

విజయీ భవ!

మంగళవారం, మార్చి 26

ఉగాది కవితల పోటీలు: సేవ


 తెలుగు అంతర్జాల పత్రిక  ” సేవ “   ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహిస్తోంది.   ప్రపంచ  నలుమూలలా తెలుగు సాహిత్యాభిమానులు అంతర్జాలములో ఉండటం వలన  ఈ  కవితల పోటీలు 'సేవ' నిర్వహిస్తోంది.
 తెలుగుదనం ఉట్టిపడేలా, విజయ నామ తెలుగు  సంవత్సరానికి సరికొత్త స్ఫూర్తి అందించే విధంగా, తమ తమ కవితా సౌరభాన్ని అందరితో పంచుకునేందులా  ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ ఉగాది  కవితల పోటీకి కవులు, కవయిత్రులు ,  ఔత్సాహికులు   తమ తమ  రచయితలను  పంపవలసినదిగా ‘ సేవ ‘ సంస్థ  కోరుతోంది.

   

    
   
           ఉత్తమ కవితకు  మూడు వేల రూపాయలు ,
  ద్వితీయ ఉత్తమ కవితకు రెండు వేల రూపాయలు
తృతీయ  త్తమ కవితకు వెయ్యి  రూపాయలు 
నగదు అందజేయడం జరుగుతుంది.
‘సేవ’  అందించే పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 
 
    దేశ విదేశాల్లో ఎక్కడున్నా  తెలుగు కవులందరూ ఈ కవితల పోటీలో పాల్గొనవచ్చు.    వివరాలు   ఒక్కొక్కరు  ఎన్ని కవితలైనా పంపవచ్చు.    ఇంతవరకు ఎక్కడా పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ, గూడుల్లోనూ ప్రచురణకాని, ఎక్కడా  ప్రసారం కాని  కవితలను మాత్రమే  పంపాలి. పైగా దేనికీ అనువాదం, అనుకరణగాని వచన కవితలను మాత్రమే పంపించాలి.

     కవితలు 30 వరుసలకు మించి ఉండరాదు.   సామాజిక అంశంపైన రాసిన  తెలుగు కవితలు మాత్రమే ఈ పోటీలకు అర్హత కలుగుతాయి.  కవితలను విద్యుల్లేఖ (e-mail) ద్వారా  editor.seva@live.com  మరియు sahithyaseva@gmail.com ఇ-చిరునామాకు పంపాలి.  మీరు పంపే  విద్యుల్లేఖ (ఈ-మెయిలు)  విషయం (సబ్జెక్ట్)లో  ‘కవితల పోటీకి’  అని రాయాలి.   తొలుత  కవిత శీర్షిక  పేరు రాసి..   ఆ తర్వాత  కవితను రాసి పంపాలి.

     చివరన మాత్రమే  కవి లేదా  కవయిత్రి  పేరు, చిరునామా, దూరవాణి సంఖ్యను (Telephone Number) వ్యక్తిగత వివరాలు, హామీపత్రం మరియు మీ పూర్తి పేరు,  మీ ఖాతా ఉన్న బ్యాంకు పేరు, ఊరు, ఖాతా సంఖ్య   తప్పని సరిగా  పంపాలి.  రెండు రకాల  ఫోటోలను విద్యుల్లేఖకు  జతపరచాలి. కలం పేరుతో రాసే రచయితలు తప్పని సరిగా వారి పూర్తి పేరు వివరాలు తెలియపరచాలి.  

 ఆసక్తి గల వారు తమతమ కవితలను ఏప్రిల్ 6 తేదీలోగా  మా విద్యుల్లేఖ కు పంపాలి.

     విజేతలకు ఫలితాల వివరాలను నేరుగా విద్యుల్లేఖ ద్వారా  మరియు పత్రిక ద్వారా  తెలియజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఉత్తమ కవితలను

సేవ   తెలుగు అంతర్జాల పత్రిక

http://sevalive.com/ , http://www.sahithya.sevalive.com/

లోనూ ప్రచురిస్తామని నిర్వాహకులు తెలిపారు.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలను
http://www.sahithya.sevalive.com/  లో ప్రచురిస్తామని నిర్వాహకులు తెలిపారు.

   కవితాంశం వచనమైనా  ఆశాజనకంగా,   స్ఫూర్తిమంతంగా ఉన్నవాటికి అధిక ప్రాధ్యానత.   సామాజకంగా, స్పూర్తిదాయకంగా, ఆలోచన రేకెత్తించేలా ఉన్న కవితల కవితాత్మకతకు పట్టం కడుతాం.

         కవితల ఎంపికలో న్యాయ నిర్ణేతల నిర్ణయమే  తుది నిర్ణయం. ఈ విషయంలో వాదోప వాదాలకు తావు లేదు.  పంపిన కవితలను సాధారణంగా  ‘సేవ’ సంస్థ నిర్వహణలోని  తెలుగు అంతర్జాల పత్రికలో  ప్రచురించే హక్కు   ఉంటుంది.   కవితలు ‘ సేవ’లో ప్రచురణమైన తర్వాత గతంలో ప్రచురణమైనట్లు నిర్వాహకులకు తెలిసిన యడల నిబంధనలను అతిక్రమించినట్లు భావిస్తాం.  నగదు  బహుమతిని కూడా నిలిపి వేస్తాం.   ఉత్తమ, ద్వితీయ, తృతీయ  విజేతల నగదు బహుమతిని ఏప్రిల్ లోనే  పంపుతాము.  పోటీ కవితల నుంచి  ప్రత్యేకంగా  ప్రచురణకు ఐదింటిని ఎంపికచేసి   500/- రూపాయలు వంతున నగదు అందజేస్తాము. అలాగే  మరో పది మందిని ప్రోత్సహిస్తూ ఒక్కో కవితకు  వంద రూపాయల వంతున నగదు చెల్లిస్తాము. ఇది ఔత్సాహికులకు మాత్రమే.. ఔత్సాహిక రచయితలు పంపిన కవితలు ఉత్తమంగా కూడా ఎంపిక చేయవచ్చు. అయితే మేం ఔత్సాహికులమని  తప్పని సరిగా పొందుపరచాలి.   ఆయా విజేతలకు  తమ  కవితలను ప్రచురించిన తదుపరి మాసంలో నగదు బహుమతి పంపుతాము. సాధారణ ప్రచురణకు కూడా  బహుమతి పంపుతామని  నిర్వాహకులు తెలిపారు.

పోటీకి పంపే తమ రచనలను
http://lekhini.org/
http://www.google.com/intl/te/inputtools/cloud/try/
http://translate.google.co.in/ 
http://www.google.com/inputtools/windows/index.html
http://www.adityafonts.com/kbds.html
http://suravara.com/
http://anupamatyping.com/

మొదలగు  అంతర్జాలాలనుంచి     తెలుగులో స్పష్టంగా టైపు చేసి పంపాని  నిర్వాహకులు తెలిపారు.ఇతర వివరాలకు  తమను  సంప్రదించవచ్చని ‘సాహితీ సేవ’ నిర్వాహకులు  తెలిపారు. 

 పూర్తి వివరాలకు :

‘సేవ’ తెలుగు పత్రిక, పెదకాపు లేఅవుట్,తిరుపతి.

దూరవాణి:

0949 222 4 666

విద్యుల్లేఖ( ఈమెయిలు) :   editor.seva@live.com



శనివారం, ఏప్రిల్ 7

ఆలోచనలు... 'సకల' అంతర్జాల సకుటుంబం

మనసంతా చికాకు, నీరసం, ఆత్మన్యూనతాభావం లాంటివి మనిషిని ఆవరించినపుడు, వాటిని కప్పి ఉంచటానికి ‘‘నేను ఓడిపోను, అనుకున్నది తప్పక సాధిస్తాను’ అని మనకి మనం మనోధైర్యం చెప్పుకోవటం అనేది తాత్కాలిక ప్రయోజనం కలిగించవచ్చునేమోగానీ ఈ రకమైన పాజిటివ్ థింకింగ్ (సానుకూల ఆలోచనలు) వల్ల ప్రయోజనం అంతగా ఉండదు. చెడు ఆలోచనలు వచ్చినపుడు ‘‘రామ.. రామ…’’ అని మనసులోనే జపించుకోమని కొందరు ఉచిత సలహాలు ఇస్తారు, పాజిటివ్ థింకింగ్ కూడా అలాంటిదే.
మనసు ఆందోళనకు గురైనపుడు దైవధ్యానం, దైవచింతన కొంచెం ఉపశమనం కలిగించినా, మళ్ళీ మనసు చంచలమవుతుంది. అప్పుడేం చేయాలి?
ఉదాహరణకు ఇంట్లో ఏదైనా దుర్వాసన వచ్చిందనుకోండి. ‘ఆ ఏదో వస్తోందిలే’ అని అశ్రద్ధచేసి, ఆ వాసన పోవటానికి అగరువత్తులు వెలిగించి లేదా రూమ్ ఫ్రెష్‌నర్‌ను స్ప్రే చేస్తాం. అయితే, ఆ వాసన తాత్కాలికంగా తగ్గవచ్చునేమో గానీ, కొంచెం సేపటి తరువాత ఆ దుర్వాసన మళ్ళీ మొదలవుతుంది. పాజిటివ్ థింకింగ్ కూడా అటువంటిదే. ఇందుకు వేరే ఉపాయం ఏదైనా ఉందా అని చూస్తే, అదే అథెంటిక్ థింకింగ్! మీరు ఎక్కువగా దుఃఖం గురించే ఆలోచిస్తున్నట్లు భావించి విరక్తి చెందినా, ‘లేదు, నేను సంతోషంగానే ఉన్నాను’ అనే పాజిటివ్ థింకింగ్‌ని బలవంతంగా మీ మనసు మీద రుద్దటానికి ప్రయత్నించారనుకోండి. అప్పుడు మీలో ఈ రెండు వైరుధ్యాల మధ్య ఘర్షణ మొదలవుతుంది. అలా కాకుండా మీ పరిస్థితినుంచి దూరంగా జరిగి పరిశీలించండి. ఇవి మంచి ఆలోచనలు, ఇవి చెడు ఆలోచనలు… అని ముద్రవేయడం మానేసి తటస్థంగా నిలబడి పరిశీలించుకోండి. అప్పుడు మీ ఆలోచనలపై సరైన అవగాహన మీలో కలుగుతుంది. ఈ మనఃస్థితికి చేరుకోగలిగినపుడు విచారం, సంతో షం రెండూ ఒక్కటే. సంతోషం, దుఃఖం అనేవి అనుభవాలు మాత్రమే అని అర్థమవుతుంది. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేతకానివారికి సంతోషం కూడా దుఃఖంగానే పరిణమిస్తుంది.
అతనొక మధ్యతరగతి మనిషి. పెళ్లీడుకొచ్చిన ఆరుగురు కూతుళ్లు వున్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్లు ఎలా చెయ్యాలా? అనే దిగులుతోనే ఒకరోజు అతనికి గుండెపోటు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అతను ఎప్పుడో కొన్న ఒక లాటరీ టిక్కెట్టుకు పదిలక్షల రూపాయల బహుమతి వచ్చింది. ఆ సమయంలో అతనికి ఈ శుభవార్త చెప్పటానికి భయపడిన అతని భార్యాపిల్లలు డాక్టర్ సహాయం కోరారు. మనస్తత్వ పద్ధతిలో డాక్టర్ అతనితో మాటలు ప్రారంభించాడు.
మీకు లాటరీలో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తారు?
ముందు మా పెద్దమ్మాయి పెళ్లి జరిపిస్తాను
సరే ఒకవేళ రెండులక్షలు వస్తేనో…
రెండవ అమ్మాయి పెళ్లి చేసేస్తాను.
అదిసరే, ఒకేసారి 10లక్షలు వస్తే, అప్పుడు ఏం చేస్తారు?
నాకంత అదృష్టమా డాక్టర్! ఒకవేళ మీరన్నట్లే జరిగితే కనుక తప్పకుండా అందులోంచి మీకు రెండు లక్షలు ఇస్తాను.
కలలోనైనా వూహించని తన అదృష్టానికి షాక్ తిన్న ఆ డాక్టరుకు వెంటనే గుండెపోటువచ్చి చనిపోయాడట.
సంతోషం ఎంతటి సుఖమైన అనుభవమో, బాధ కూడా ఒక కరమైన సుఖానుభవమే. అందుకేనేమో ‘‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’’ అన్నాడో కవి. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించటం కష్టం. కొందరు కాకరకాయ కూరని ఇష్టంగా తింటారు. చేదుగా వుండే ఆ కూరని వాళ్ళు ఎలా తింటారోనని మనం అనుకుంటాం. కానీ మనసుకు నచ్చితే తీపి ఎంత రుచిగా ఉంటుందో అలాగే చేదు కూడా అంతే రుచిగానూ ఉంటుంది.
మన చిన్నతనంలో ‘‘తీపి ఒక్కటే తినటానికి రుచిగా, అనువుగా వుంటుందని భావించి, ఉప్పు, పులుపు, చేదు, వగరు లాంటివన్నీ రుచి లేనివి, తినటానికి అలవికానివి’’ అని మనకు మనమే ఒక నిర్ణయానికి వచ్చి, తీపికి తప్ప మిగతా రుచులకు చోటివ్వకుడా మన ఆలోచనా తలుపులను మూసేసేవాళ్ళం. పెద్దయిన తరువాత ఇప్పుడూ అదేపని చేస్తున్నాం. కాకపోతే పసి వయసులో రుచులకు సంబంధించి అలా చేస్తే, ఇప్పుడు పెద్దయిన తరువాత జీవితానికి సంబంధించిన, చదువుకు సంబంధించిన వంటి విషయాలలో కొన్నింటికే ప్రాధాన్యతను ఇచ్చి ఆలోచనల తలుపులను మూసేస్తున్నాం. అందుకే ఏ మనిషి అయినా, ఏ విషయానికి సంబంధించి అయినా ఒకే కోణంలో, ఒకే దృక్పథంతో ఆలోచించకూడదు.
అలాగే సంతోషం ఒక్కటే సుఖమిచ్చే అనుభూతి, తక్కివవన్నీ విస్మరించదగినవి అనే భ్రమలో పడి, వాస్తవిక జీవితంలోని ఎన్నో రకాల అనుభూతులను మనం దూరం చేసుకుంటున్నాం.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచనల తలుపులకు తాళాలు వేసి బందీలవకుండా తటస్థంగా నిలబడి ఆలోచించగలిగితే మనసు, జీవితం కుదుటపడతాయి. అప్పుడు జీవితానికి ఏ ఇబ్బంది ఉండక హాయిగా సాగుతుంది.




 'సకల' అంతర్జాల సకుటుంబం
నమస్తే!               ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..             అయితే!.... ఇంకేం ఆలస్యం!?... మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.           మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.దా సేవలో,

-కంచర్ల సుబ్బానాయుడు,



 
 

'సకల' అంతర్జాల సకుటుంబం




నమస్తే!


              ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..


            అయితే!.... ఇంకేం ఆలస్యం!?... మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.


          మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.


సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/