మనసంతా చికాకు, నీరసం, ఆత్మన్యూనతాభావం లాంటివి మనిషిని ఆవరించినపుడు, వాటిని కప్పి ఉంచటానికి ‘‘నేను ఓడిపోను, అనుకున్నది తప్పక సాధిస్తాను’ అని మనకి మనం మనోధైర్యం చెప్పుకోవటం అనేది తాత్కాలిక ప్రయోజనం కలిగించవచ్చునేమోగానీ ఈ రకమైన పాజిటివ్ థింకింగ్ (సానుకూల ఆలోచనలు) వల్ల ప్రయోజనం అంతగా ఉండదు. చెడు ఆలోచనలు వచ్చినపుడు ‘‘రామ.. రామ…’’ అని మనసులోనే జపించుకోమని కొందరు ఉచిత సలహాలు ఇస్తారు, పాజిటివ్ థింకింగ్ కూడా అలాంటిదే.
మనసు ఆందోళనకు గురైనపుడు దైవధ్యానం, దైవచింతన కొంచెం ఉపశమనం కలిగించినా, మళ్ళీ మనసు చంచలమవుతుంది. అప్పుడేం చేయాలి?
ఉదాహరణకు ఇంట్లో ఏదైనా దుర్వాసన వచ్చిందనుకోండి. ‘ఆ ఏదో వస్తోందిలే’ అని అశ్రద్ధచేసి, ఆ వాసన పోవటానికి అగరువత్తులు వెలిగించి లేదా రూమ్ ఫ్రెష్‌నర్‌ను స్ప్రే చేస్తాం. అయితే, ఆ వాసన తాత్కాలికంగా తగ్గవచ్చునేమో గానీ, కొంచెం సేపటి తరువాత ఆ దుర్వాసన మళ్ళీ మొదలవుతుంది. పాజిటివ్ థింకింగ్ కూడా అటువంటిదే. ఇందుకు వేరే ఉపాయం ఏదైనా ఉందా అని చూస్తే, అదే అథెంటిక్ థింకింగ్! మీరు ఎక్కువగా దుఃఖం గురించే ఆలోచిస్తున్నట్లు భావించి విరక్తి చెందినా, ‘లేదు, నేను సంతోషంగానే ఉన్నాను’ అనే పాజిటివ్ థింకింగ్‌ని బలవంతంగా మీ మనసు మీద రుద్దటానికి ప్రయత్నించారనుకోండి. అప్పుడు మీలో ఈ రెండు వైరుధ్యాల మధ్య ఘర్షణ మొదలవుతుంది. అలా కాకుండా మీ పరిస్థితినుంచి దూరంగా జరిగి పరిశీలించండి. ఇవి మంచి ఆలోచనలు, ఇవి చెడు ఆలోచనలు… అని ముద్రవేయడం మానేసి తటస్థంగా నిలబడి పరిశీలించుకోండి. అప్పుడు మీ ఆలోచనలపై సరైన అవగాహన మీలో కలుగుతుంది. ఈ మనఃస్థితికి చేరుకోగలిగినపుడు విచారం, సంతో షం రెండూ ఒక్కటే. సంతోషం, దుఃఖం అనేవి అనుభవాలు మాత్రమే అని అర్థమవుతుంది. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేతకానివారికి సంతోషం కూడా దుఃఖంగానే పరిణమిస్తుంది.
అతనొక మధ్యతరగతి మనిషి. పెళ్లీడుకొచ్చిన ఆరుగురు కూతుళ్లు వున్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్లు ఎలా చెయ్యాలా? అనే దిగులుతోనే ఒకరోజు అతనికి గుండెపోటు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అతను ఎప్పుడో కొన్న ఒక లాటరీ టిక్కెట్టుకు పదిలక్షల రూపాయల బహుమతి వచ్చింది. ఆ సమయంలో అతనికి ఈ శుభవార్త చెప్పటానికి భయపడిన అతని భార్యాపిల్లలు డాక్టర్ సహాయం కోరారు. మనస్తత్వ పద్ధతిలో డాక్టర్ అతనితో మాటలు ప్రారంభించాడు.
మీకు లాటరీలో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తారు?
ముందు మా పెద్దమ్మాయి పెళ్లి జరిపిస్తాను
సరే ఒకవేళ రెండులక్షలు వస్తేనో…
రెండవ అమ్మాయి పెళ్లి చేసేస్తాను.
అదిసరే, ఒకేసారి 10లక్షలు వస్తే, అప్పుడు ఏం చేస్తారు?
నాకంత అదృష్టమా డాక్టర్! ఒకవేళ మీరన్నట్లే జరిగితే కనుక తప్పకుండా అందులోంచి మీకు రెండు లక్షలు ఇస్తాను.
కలలోనైనా వూహించని తన అదృష్టానికి షాక్ తిన్న ఆ డాక్టరుకు వెంటనే గుండెపోటువచ్చి చనిపోయాడట.
సంతోషం ఎంతటి సుఖమైన అనుభవమో, బాధ కూడా ఒక కరమైన సుఖానుభవమే. అందుకేనేమో ‘‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’’ అన్నాడో కవి. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించటం కష్టం. కొందరు కాకరకాయ కూరని ఇష్టంగా తింటారు. చేదుగా వుండే ఆ కూరని వాళ్ళు ఎలా తింటారోనని మనం అనుకుంటాం. కానీ మనసుకు నచ్చితే తీపి ఎంత రుచిగా ఉంటుందో అలాగే చేదు కూడా అంతే రుచిగానూ ఉంటుంది.
మన చిన్నతనంలో ‘‘తీపి ఒక్కటే తినటానికి రుచిగా, అనువుగా వుంటుందని భావించి, ఉప్పు, పులుపు, చేదు, వగరు లాంటివన్నీ రుచి లేనివి, తినటానికి అలవికానివి’’ అని మనకు మనమే ఒక నిర్ణయానికి వచ్చి, తీపికి తప్ప మిగతా రుచులకు చోటివ్వకుడా మన ఆలోచనా తలుపులను మూసేసేవాళ్ళం. పెద్దయిన తరువాత ఇప్పుడూ అదేపని చేస్తున్నాం. కాకపోతే పసి వయసులో రుచులకు సంబంధించి అలా చేస్తే, ఇప్పుడు పెద్దయిన తరువాత జీవితానికి సంబంధించిన, చదువుకు సంబంధించిన వంటి విషయాలలో కొన్నింటికే ప్రాధాన్యతను ఇచ్చి ఆలోచనల తలుపులను మూసేస్తున్నాం. అందుకే ఏ మనిషి అయినా, ఏ విషయానికి సంబంధించి అయినా ఒకే కోణంలో, ఒకే దృక్పథంతో ఆలోచించకూడదు.
అలాగే సంతోషం ఒక్కటే సుఖమిచ్చే అనుభూతి, తక్కివవన్నీ విస్మరించదగినవి అనే భ్రమలో పడి, వాస్తవిక జీవితంలోని ఎన్నో రకాల అనుభూతులను మనం దూరం చేసుకుంటున్నాం.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచనల తలుపులకు తాళాలు వేసి బందీలవకుండా తటస్థంగా నిలబడి ఆలోచించగలిగితే మనసు, జీవితం కుదుటపడతాయి. అప్పుడు జీవితానికి ఏ ఇబ్బంది ఉండక హాయిగా సాగుతుంది.

'సకల' అంతర్జాల సకుటుంబం
నమస్తే!
' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
అయితే!.... ఇంకేం ఆలస్యం!?... మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.
సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి