శనివారం, ఏప్రిల్ 7

ఆలోచనలు... 'సకల' అంతర్జాల సకుటుంబం

మనసంతా చికాకు, నీరసం, ఆత్మన్యూనతాభావం లాంటివి మనిషిని ఆవరించినపుడు, వాటిని కప్పి ఉంచటానికి ‘‘నేను ఓడిపోను, అనుకున్నది తప్పక సాధిస్తాను’ అని మనకి మనం మనోధైర్యం చెప్పుకోవటం అనేది తాత్కాలిక ప్రయోజనం కలిగించవచ్చునేమోగానీ ఈ రకమైన పాజిటివ్ థింకింగ్ (సానుకూల ఆలోచనలు) వల్ల ప్రయోజనం అంతగా ఉండదు. చెడు ఆలోచనలు వచ్చినపుడు ‘‘రామ.. రామ…’’ అని మనసులోనే జపించుకోమని కొందరు ఉచిత సలహాలు ఇస్తారు, పాజిటివ్ థింకింగ్ కూడా అలాంటిదే.
మనసు ఆందోళనకు గురైనపుడు దైవధ్యానం, దైవచింతన కొంచెం ఉపశమనం కలిగించినా, మళ్ళీ మనసు చంచలమవుతుంది. అప్పుడేం చేయాలి?
ఉదాహరణకు ఇంట్లో ఏదైనా దుర్వాసన వచ్చిందనుకోండి. ‘ఆ ఏదో వస్తోందిలే’ అని అశ్రద్ధచేసి, ఆ వాసన పోవటానికి అగరువత్తులు వెలిగించి లేదా రూమ్ ఫ్రెష్‌నర్‌ను స్ప్రే చేస్తాం. అయితే, ఆ వాసన తాత్కాలికంగా తగ్గవచ్చునేమో గానీ, కొంచెం సేపటి తరువాత ఆ దుర్వాసన మళ్ళీ మొదలవుతుంది. పాజిటివ్ థింకింగ్ కూడా అటువంటిదే. ఇందుకు వేరే ఉపాయం ఏదైనా ఉందా అని చూస్తే, అదే అథెంటిక్ థింకింగ్! మీరు ఎక్కువగా దుఃఖం గురించే ఆలోచిస్తున్నట్లు భావించి విరక్తి చెందినా, ‘లేదు, నేను సంతోషంగానే ఉన్నాను’ అనే పాజిటివ్ థింకింగ్‌ని బలవంతంగా మీ మనసు మీద రుద్దటానికి ప్రయత్నించారనుకోండి. అప్పుడు మీలో ఈ రెండు వైరుధ్యాల మధ్య ఘర్షణ మొదలవుతుంది. అలా కాకుండా మీ పరిస్థితినుంచి దూరంగా జరిగి పరిశీలించండి. ఇవి మంచి ఆలోచనలు, ఇవి చెడు ఆలోచనలు… అని ముద్రవేయడం మానేసి తటస్థంగా నిలబడి పరిశీలించుకోండి. అప్పుడు మీ ఆలోచనలపై సరైన అవగాహన మీలో కలుగుతుంది. ఈ మనఃస్థితికి చేరుకోగలిగినపుడు విచారం, సంతో షం రెండూ ఒక్కటే. సంతోషం, దుఃఖం అనేవి అనుభవాలు మాత్రమే అని అర్థమవుతుంది. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేతకానివారికి సంతోషం కూడా దుఃఖంగానే పరిణమిస్తుంది.
అతనొక మధ్యతరగతి మనిషి. పెళ్లీడుకొచ్చిన ఆరుగురు కూతుళ్లు వున్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్లు ఎలా చెయ్యాలా? అనే దిగులుతోనే ఒకరోజు అతనికి గుండెపోటు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అతను ఎప్పుడో కొన్న ఒక లాటరీ టిక్కెట్టుకు పదిలక్షల రూపాయల బహుమతి వచ్చింది. ఆ సమయంలో అతనికి ఈ శుభవార్త చెప్పటానికి భయపడిన అతని భార్యాపిల్లలు డాక్టర్ సహాయం కోరారు. మనస్తత్వ పద్ధతిలో డాక్టర్ అతనితో మాటలు ప్రారంభించాడు.
మీకు లాటరీలో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తారు?
ముందు మా పెద్దమ్మాయి పెళ్లి జరిపిస్తాను
సరే ఒకవేళ రెండులక్షలు వస్తేనో…
రెండవ అమ్మాయి పెళ్లి చేసేస్తాను.
అదిసరే, ఒకేసారి 10లక్షలు వస్తే, అప్పుడు ఏం చేస్తారు?
నాకంత అదృష్టమా డాక్టర్! ఒకవేళ మీరన్నట్లే జరిగితే కనుక తప్పకుండా అందులోంచి మీకు రెండు లక్షలు ఇస్తాను.
కలలోనైనా వూహించని తన అదృష్టానికి షాక్ తిన్న ఆ డాక్టరుకు వెంటనే గుండెపోటువచ్చి చనిపోయాడట.
సంతోషం ఎంతటి సుఖమైన అనుభవమో, బాధ కూడా ఒక కరమైన సుఖానుభవమే. అందుకేనేమో ‘‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’’ అన్నాడో కవి. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించటం కష్టం. కొందరు కాకరకాయ కూరని ఇష్టంగా తింటారు. చేదుగా వుండే ఆ కూరని వాళ్ళు ఎలా తింటారోనని మనం అనుకుంటాం. కానీ మనసుకు నచ్చితే తీపి ఎంత రుచిగా ఉంటుందో అలాగే చేదు కూడా అంతే రుచిగానూ ఉంటుంది.
మన చిన్నతనంలో ‘‘తీపి ఒక్కటే తినటానికి రుచిగా, అనువుగా వుంటుందని భావించి, ఉప్పు, పులుపు, చేదు, వగరు లాంటివన్నీ రుచి లేనివి, తినటానికి అలవికానివి’’ అని మనకు మనమే ఒక నిర్ణయానికి వచ్చి, తీపికి తప్ప మిగతా రుచులకు చోటివ్వకుడా మన ఆలోచనా తలుపులను మూసేసేవాళ్ళం. పెద్దయిన తరువాత ఇప్పుడూ అదేపని చేస్తున్నాం. కాకపోతే పసి వయసులో రుచులకు సంబంధించి అలా చేస్తే, ఇప్పుడు పెద్దయిన తరువాత జీవితానికి సంబంధించిన, చదువుకు సంబంధించిన వంటి విషయాలలో కొన్నింటికే ప్రాధాన్యతను ఇచ్చి ఆలోచనల తలుపులను మూసేస్తున్నాం. అందుకే ఏ మనిషి అయినా, ఏ విషయానికి సంబంధించి అయినా ఒకే కోణంలో, ఒకే దృక్పథంతో ఆలోచించకూడదు.
అలాగే సంతోషం ఒక్కటే సుఖమిచ్చే అనుభూతి, తక్కివవన్నీ విస్మరించదగినవి అనే భ్రమలో పడి, వాస్తవిక జీవితంలోని ఎన్నో రకాల అనుభూతులను మనం దూరం చేసుకుంటున్నాం.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచనల తలుపులకు తాళాలు వేసి బందీలవకుండా తటస్థంగా నిలబడి ఆలోచించగలిగితే మనసు, జీవితం కుదుటపడతాయి. అప్పుడు జీవితానికి ఏ ఇబ్బంది ఉండక హాయిగా సాగుతుంది.




 'సకల' అంతర్జాల సకుటుంబం
నమస్తే!               ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..             అయితే!.... ఇంకేం ఆలస్యం!?... మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.           మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.దా సేవలో,

-కంచర్ల సుబ్బానాయుడు,



 
 

'సకల' అంతర్జాల సకుటుంబం




నమస్తే!


              ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..


            అయితే!.... ఇంకేం ఆలస్యం!?... మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.


          మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.


సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/


గురువారం, మార్చి 29

వండర్ ఫుల్ వంటిల్లు



           వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగు రంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ…ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాలనే తపన ఎక్కువయింది. ఆ క్రమంలో రెడీమేడ్ కిచెన్‌లు ఆదరణ పొందుతున్నాయి. విదేశీ కంపెనీలు కూడా సరసమైన ధరలకు ఆకర్షణీయమైన రెడీమేడ్ వంటగదులను అందిస్తున్నాయి.
ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం కిచెన్‌లోనే గడుపుతుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనంలో కుటుంబసభ్యులందరూ కలిసేది కిచెన్ దగ్గరే అనడంలో సందేహం లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. సంప్రదాయ కిచెన్‌ల స్థానంలో మోడ్రన్ కిచెన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హై-ఎండ్ అపార్టుమెంటుల్లో నివసించే వారి దగ్గరి నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

 

మాడ్యులర్ కిచెన్
ఈ రెడీమేడ్ కిచ్‌న్ అందుబాటులోకి వచ్చాక వంటగది రూపమే మారిపోయింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఇది సరికొత్త మార్పులను తీసుకువచ్చింది. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణంను బట్టి కిచెన్ క్యాబినెట్‌లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్‌గా సర్దుకునే అవకాశం ఉంది. వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్, కూరగాయలు తురుముకోవడానికి గ్రానైట్ టాప్ ఉంటుంది.
హబ్స్‌లో కూడా బోలెడు వెరైటీలున్నాయి. గ్లాస్ హబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది ఇప్పుడు గ్లాస్‌హబ్‌నే ఎంచుకుంటున్నారు. పొగ బయటకు వెళ్లడానికి వీలుగా చిమ్నీ ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాలున్నాయి. 4వేల నుంచి 40 వేల రూపాయల ధర ఉన్న చిమ్నీ కూడా ఉంది. గ్లాస్ చిమ్నీకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. వంట సామగ్రి, పాత్రలు పెట్టుకోవడానికి వీలుగా పుల్ అవుట్ డ్రాలు ఉంటాయి. వంటపాత్రలు భద్రపరుచుకోవడానికి అనువుగా షట్టర్స్ ఉంటాయి. మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్‌లో చాలా రకాలున్నాయి. అనేక రకాల రంగుల్లోనూ, డిజైన్లలోనూ మాడ్యులర్ కిచెన్‌లు లభిస్తున్నాయి.
ఇల్లు మారినా ఓకె
మాడ్యులర్ కిచెన్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మాడ్యూల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా సులువుగా విప్పుకోవచ్చు. కొత్త ఇంటికి తరలించుకుని మళ్లీ బిగించుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ కాకుండా కార్పెంటర్ చేత కిచెన్ ఏర్పాటు చేయించుకుంటే ఆ కలపను తొలగించడం సాధ్యం కాదు. డ్యామేజీ ఎక్కువగా ఉంటుంది. మరో చోట బిగించడం కష్టంతో కూడకున్న పని. మాడ్యులర్ కిచెన్‌లో ఈ సమస్య ఉండదు. కొన్ని రోజులు పోయాక మళ్లీ కొత్త లుక్ కావాలనుకున్న వారు షట్టర్స్ మార్పించుకోవచ్చు. కొత్త డిజైన్లు ఉన్న షట్టర్స్ వేసుకోవడం వల్ల కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్ టాప్‌ను నిర్మించుకున్న వారు కూడా మాడ్యులర్ షట్టర్స్‌ను తెచ్చుకుని బిగించుకోవచ్చు.

కిచెన్‌లో మూడు ముఖ్యమైన ప్రాంతాలుంటాయి. అవి ఫ్రిజ్, కుకింగ్ టాప్, సింక్. వంట చేసే సమయంలో ఈ మూడింటి తోనే ఎక్కువగా పని ఉంటుంది. కిచెన్‌ను డిజైన్ చేసుకునే ముందు ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, చిమ్నీ, హబ్, సింక్, బాస్కెట్స్ నాణ్యమైనవి ఎంచుకోవాలి. వంటగది విస్తీర్ణాన్ని బట్టి రెడీమేడ్ కిచెన్‌కు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.
సైజుతో పని లేదనుకుంటే పది అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో తీసుకోవచ్చు. ఇది మాడ్యులర్ కిచెన్‌లో లభించే సాధారణ సైజు. ఒకవేళ ఇంకా పెద్దగా కావాలనుకునే వారు ఆ మేరకు సైజులు ఇచ్చి తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలుసైతం మాడ్యులర్ కిచెన్ పట్ల మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఈ సౌకర్యాలే. అందుకే రాబోయే రోజుల్లో ఈ రెడీమేడ్ కిచెన్‌దే హవా అనడంలో సందేహం లేదు.
ఇటాలియన్ మాడ్యులర్ కిచెన్
ఇటలీకి చెందిన ఆర్మోనీ కంపెనీ స్ట్రెయిట్ లైన్ మాడ్యులర్ కిచెన్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. 10్ఠ2 సైజు గల మాడ్యులర్ కిచెన్ లక్షా యాభైవేలకు లభిస్తోంది. ఇందులో కార్‌కస్ ఎమ్‌డీఎఫ్‌తో తయారవుతుంది. హబ్, గ్రానైట్ టాప్ ఇండియావి, మిగతా యాక్సెసరీస్ అన్నీ ఇటలీ నుంచి దిగుమతి అయినవి ఉంటాయి. కిచెన్ ఎక్కువ సైజులో కావాలంటే ధర మారుతుంది. కంప్లీట్ ఇంపోర్టెడ్ ఇటాలియన్ మాడ్యులర్ కిచెన్ కావాలన్నా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 3.5 లక్షల నుంచి మొదలుకుని రూ. 40 లక్షల వరకు ఉంది. యాక్సెసరీస్, డిజైన్లను బట్టి ధర మారుతుంది.
గోద్రేజ్
ఇందులో నాలుగు రకాల మాడ్యులర్ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. స్ట్రెయిట్ కిచెన్, గ్యాలరీ కిచెన్, ఎల్ షేప్‌డ్ కిచెన్, యూ షేప్‌డ్ కిచెన్ అని నాలుగురకాల డిజైన్లు లభిస్తున్నాయి. వీటి తయారీలో గాల్వనైజ్‌డ్ స్టీల్‌ను ఉపయోగించారు. దీని మూలంగా ఎక్కువ కాలం మన్నుతాయి. క్యాబిన్‌ట్ డోర్స్ స్టీల్‌తో తయారు చేసినవే. కలవతో చేసినవి కూడా అందుబాటులో ఉన్నాయి. అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు.

లీనియర్ కిచెన్

దేశీయంగా తయారయ్యే మాడ్యులర్ కిచెన్ ఇది. కార్‌కస్ ఎమ్‌డీఎఫ్‌తో తయారవుతుంది. ఫ్యాక్టర్ మేడ్ కిచెన్ ఇది. కార్‌కస్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్‌తో తయారుచేసింది కూడా లభిస్తోంది. దీన్ని కస్టమైజ్‌డ్ మాడ్యులర్ కిచెన్ అంటారు. ఇందులో షట్టర్స్ మెంబ్రేన్‌వి ఉంటాయి. 10్ఠ10 సైజు కిచెన్ ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలవుతోంది. ఇందులో కూడా యాక్సెసరీస్‌ని బట్టి ధర మారుతుంది.

అవగాహన పెరిగింది

కొంత కాలం క్రితం వరకు మాడ్యులర్ కిచెన్‌ను సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు సైతం రెడీమేడ్ కిచెన్ కావాలని కోరుకుంటున్నారు. మాడ్యులర్ కిచెన్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. రాబోయే నాలుగైదేళ్లలో ఈ కిచెన్ ట్రెండ్ బాగా విస్తరిస్తుంది.

నీలి నీలాలి కురులు మీవేగా

 

అందరిలోకి భిన్నంగా కన్పించటమే ఫ్యాషన్. అందరి కళ్ళలో పడి ఆకర్షించటమే నేటి గొప్పతనం.ఆ ఆలోచనకు తగినట్లుగానే నేటి జుట్టు, రంగు విషయాల్లో మార్పువచ్చింది.

  
ప్రకృతిలో ఉన్న ఏ రంగునైనా శిరోజాలకు వేసుకోవచ్చు.
హెయిర్ స్టైల్ మార్చుకోవటంలో భాగం శిరోజాలకు కొత్త రంగు వేసుకోవటం.
లిప్‌స్టిక్‌లు ఎన్ని రంగులలో దొరుకుతున్నాయో అన్నిరంగులు శిరోజాలకు వేసుకోవచ్చు.
అంతర్జాతీయ సూపర్ మోడల్స్ నిగనిగలాడే ఎరుపు రంగు, మెరిసే రాగి రంగు, నలుపు రంగులతో కనిపించి అందరినీ అమితంగా ఆకట్టుకోవచ్చు. ఎన్నో రంగులతో జుట్టు ఫ్యాషన్లు వచ్చాయి. రకరకాల హెయిర్ స్టయిల్స్ రూపుదాల్చుకున్నాయి. ముఖం, ఆకారానికి తగిన హెయిర్ స్టయిల్స్‌ను నేడు అనుసరించటమే ఆధునిక అమ్మాయిలకు మేలైన పద్దతి. ఈ హెయిర్ స్టైల్స్ పట్ల అతివలు అమితంగా మోజుపడుతున్నారు కూడా-
చక్కని శిరోజాలున్నపుడు వాలుజడ వేసుకున్నా, ముడి వేసుకున్నా అందంగానే ఉంటుంది. మారుతున్న సమాజ పరిస్థితులకు తగిన విధంగా ఫ్యాషన్ కూడా మారుతుంది. ఫ్యాషన్‌తో డ్రెస్‌లు మారాయి. హెయిర్ స్టైల్స్ మారాయి.
ఈ తరం అమ్మాయిలు ఎప్పుడూ ఒకే తరహా హెయిర్ స్టైల్‌లో ఉండాలనుకోవటంలేదు. ముఖానికి తగిన హెయిర్ స్టైల్ కోరుకుంటున్నారు. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. కొందరి ముఖాలు గుండ్రంగా ఉంటే, మరికొందరివి అండాకారంలో ఉంటాయి. పొడవు ముఖాలు మరికొందరివి.
తలరూపమే కాదు ముక్కు, నుదురు, పెదవులు అన్నీ ఒకరితో ఒకరికి సంబంధముండదు.
వెడల్పాటి నుదురు కలవారు కొందరైతే, పొడవు ముక్కు మరికొందరిది.
 
గడ్డం ముందుకు సాగి,
వెడల్పాటి నోరు కలవారు వుంటారు. ముఖ రూపం, ముఖం మీది భాగాలు ఎలా ఉన్నా అందరి హెయిర్ స్టైల్ ఒకటిగానే ఉండేది. సాంప్రదాయకంగా జుట్టును వెనక్కి దువ్వి, బిగించి జడవేసేవారు. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు అదే హెయిర్‌స్టైల్. పిల్లలు పెద్దవారవుతుండగా తల్లులు ముడీ చుట్టుకోవటం మొదలుపెట్టేవారు. అటువంటి హెయిర్ స్టైల్‌తో బోర్ కొట్టిన యువతరం కొత్తరకం హెయిర్‌స్టైల్ మీదికి దృష్టిపెట్టారు. మూడు దశాబ్దాలక్రితం నుంచి హెయిర్‌స్టైల్ ఫ్యాషన్ పుంజుకుంది. 1980లో ఫ్యాషన్ విప్లవం మొదలైంది.
ఇటీవల కాలంలో మోడలింగ్ ఇండస్ట్రీ ఎదుగుదలతో హెయిర్ స్టైల్‌లో
గణనీయమైన మార్పులు వచ్చాయి. అందం మీద అధ్యయనం ఆరంభించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేకంగా బ్యూటీసెలూన్లు వచ్చాయి. అందరి హెయిర్‌స్టైల్స్ ఒక్కటే కాక వారి ముఖానికి తగిన హెయిర్‌స్టైల్‌ని ఫ్యాషన్‌గా వేయడం మొదలుపెట్టారు. ఎవరి ముఖం, ఆకారానికి తగినట్టుగా హెయిర్‌స్టైల్‌ను అనుసరించడమే మేలైన పద్ధతిగా బ్యూటిషియన్లు చెప్తున్నారు.

కలరింగ్


ఆడపిల్లలు ఇప్పుడు చేపట్టని వృత్తిలేదు. మోడలింగ్, యాక్టింగ్, యాంకరింగ్… వంటి
అందాలకు చెందిన వాటిలో అన్ని అంశాలు ఆ పరిశ్రమలో ఉన్నవారే చూసుకుంటున్నారు. కానీ హోటల్స్‌లో, ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నవారికి తమ రూపంలో మార్పు గురించిన ఆలోచన ఉంటుంది. ఉద్యోగం లేదా వృత్తిపరమైన జీవితానికి తగిన విధంగా హెయిర్‌స్టైల్ ఉండాలి. అలాగే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, షాపింగ్, పిక్‌నిక్ లాంటి చోట్ల వెళ్ళేటప్పుడు హెయిర్ స్టైల్‌లో మార్పులుంటాయి.
ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కోసం ప్రత్యేకంగా కలర్స్ తయారుచేస్తున్నారు. విదేశీ కంపెనీలు
పలు రకాల రంగులతో మన దేశపు ఫ్యాషన్ మార్కెట్‌లోకి దూసుకువచ్చాయి.
జుట్టుకి ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులతో ఎవరైనా తారసపడినట్లయితే చూసి ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఫ్యాషన్ రంగం అంతగా  దూసుకుపోతుంది మరి.                      

 

హఠాత్తు మార్పు వద్దు:

‘హెయిర్‌స్టైల్ మార్చుకోవటం, రంగు వేసుకోవటం వంటివి రెండూ జీవితంలో మరువలేని అంశాలే.
ఒక్కసారిగా హెయిర్‌స్టైల్ మార్చుకుని నలుగురిలోకి వెళ్ళటంలో కొంతవరకు ఇబ్బంది ఉంటుంది.
రెండు మూడు వారాలు ఇంట్లోనూ, చుట్టుప్రక్కల మార్పుకు అలవాటుపడాలి’’ అని
ఓ బ్యూటీ కార్నర్ అధినేత ఉష చెబుతున్నారు. హెయిర్ స్టైల్‌తో చూపు, నడక, డ్రెస్, నవ్వు వంటివన్నీ మారతాయి. మారాలి కూడానని ఆమె అంటున్నారు.
హెయిర్‌స్టైల్‌ను అందంగా, ఆకర్షణీయంగా అతివలు మార్చుకోవటానికి,పెర్మింగ్, టింటింగ్ వంటివి జుట్టుకు పట్టడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి బ్యూటీగా తయారయ్యే అమ్మాయిలు జాగ్రత్తలు గమనించి, అనుకరిస్తే కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్త ఆకర్షణ   కొత్త ఆకర్షణ సంపాదించుకోగలుగుతారు.
                                                                                                                                - ఉష

 

శిరోజాలకు ఆరోగ్యం

 

 

 

‘‘హెయిర్ స్టైల్ ఎటువంటిదైనా దానికి ఆరోగ్యకరమైన జుట్టు అవసరం.
శిరోజాల ఆరోగ్యానికి చక్కని ఆహారం కావాలి. స్వతహాగా ఆరోగ్యం లేని శిరోజాలకు
ఎలాంటి మేకప్ చేసినా ఒక్కటే. పోషక పదార్థాలు తగు మోతాదులో తీసుకోవడం తప్పనిసరి.
అన్ని రకాల విటమిన్‌లు, లవణాలు శరీరానికి తప్పక అందాలి.
రక్తం ద్వారా ఆ కీలక పోషక పదార్థాలు మాడుకు చేరినపుడే శిరోజాలు చక్కగా ఎదుగుతాయి.
చక్కని రంగునూ చూపుతాయి. రంగులూ అద్దుకుంటాయి. ఆరోగ్యంతో కూడిన శిరోజాలు ఎటు తిప్పినా తిరుగుతాయి’’ అని డాక్టర్ సింధు వెల్లడించారు. రాలిపోయే శిరోజాలకు హెయిర్ స్టైల్ అనవసరం. రక్తం సరఫరా కాకపోవడమే జుట్టు రాలిపోవటానికి కారణం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రక్తప్రసరణ జరుగుతుంది. శరీర భాగాలకు మంచి శక్తినిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా మార్చుకోవచ్చు. అందంగా, అందరినీ ఆకట్టుకోవచ్చు.
                                                                                                                                    - డాక్టర్ సింధు

హ్యాండ్ బ్యాగ్‌లోనే అన్నీ

 
తక్కువ సమయంలో ఎక్కువ ఆకర్షణ కలిగిన రూపం తెచ్చుకోవటం నేడు
వర్కింగ్ ఉమెన్ లక్ష్యంగా మారింది. ఆఫీసునుండి
అప్పుడప్పుడు కొన్ని పార్టీలకు, సభలు, సమావేశాలకు ఇతర ఫంక్షన్లకు
హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తుందని అందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని
శ్రీమతి సంధ్య వెల్లడించారు. రకరకాల హ్యాండ్ బ్యాగులు వచ్చినట్లే అందంగా తయారుకావటానికి అనేక రకాల మేకప్ సామగ్రి మార్కెట్‌లో లభిస్తున్నాయని తెలిపారు. మేకప్ చేసుకోవడానికి ఏ బ్యూటీ సెలూన్‌కో, ఇంటి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నింటిని హ్యాండ్ బ్యాగులో భద్రపరచుకునేలా వస్తున్నాయని సంధ్య చెపుతున్నారు.                                                                            – సంధ్య

 

అందు

 

మేకప్ సామగ్రి

         రంగు రంగుల హెయిర్ క్లిప్స్, వాటిమీద రంగుల పూలు పొదిగినవి ఇప్పుడు మార్కెట్‌లో
లభిస్తున్నాయని, ఇతర మేకప్ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాయని ప్రతిమ చెప్పారు.
సంధ్య అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ త్వరత్వరగా అందంగా తయారుకావటానికి ప్రతి అతివలకు హ్యాండ్‌బ్యాగ్ అవసరమన్నారు. చాలా సింపుల్‌గా హెయిర్ స్టైల్‌కి, ఇతరత్రా మేకప్ సామగ్రిని బ్యాగులో ఉంచుకోవాలని, దువ్వెనలు, హెయిర్‌పిన్నులు మరచిపోకూడదని ప్రతిమ అన్నారు. మనం అందంగా తయారుకావటానికి ఆఫీసు లేదా ఏదో ఓ మూల ప్రదేశం, చివరికి బాత్‌రూములైనా ఉపయోగించవచ్చని నిర్మొహమాటంగా అభిప్రాయపడ్డారు. అంత తక్కువ సమయంలో చక్కని ఆకర్షణతో తయారవగలిగిన రహస్యం ఏమిటోనని మిగిలినవారు ఆశ్చర్యపోతారని ఆమె చెప్పారు.
                                                                                                                                       - ప్రతిమ

నా పెళ్ళికి నేనే’’

  
ముఖానికి, చేస్తున్న వృత్తికి తగిన హెయిర్ స్టైల్‌ను ఎంచుకోవాలని,
అందులోనే అసలు కిటుకు, అందం ఉందని ప్రముఖ బ్యూటీషియన్ స్వాతి చెప్పారు.
గంటల తరబడి అద్దం ముందు కూర్చుని హెయిర్ స్టైల్ తయారుచేసుకునేంత తీరిక ప్రతిరోజు ఉండదు. అందంగా కనిపించాలన్న కోరికయితే ఉంటుందిగాని తీరికతోపాటు ఓపిక కూడా అందరికి ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిరోజూ బ్యూటీ సెలూన్‌కి వెళ్ళే సమయం ఉండదు కనుక కొద్దిపాటి తీరిక, ఓపికతోపాటు ఉత్సాహం చూపితే తనకు తానే అందంగా తయారుకావచ్చని అన్నారు. ఎలాంటి కోర్సు చేయకుండానే తాను బ్యూటీషియన్ అయ్యానని, తన పెళ్లికి తానే అలంకరించుకున్నానని స్వాతి ఆనందం వ్యక్తంచేసింది.

                                                                                                       - స్వాతి