ఐస్ క్రీం


అరెవా! భలే భలేగా ఉంది ఐస్‌క్రీమ్! రంగు, రుచి, వాసన గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని వాటిల్లో ఐస్‌క్రీమ్ ఒకటి. ఐస్‌క్రీమ్ ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ఒక వయసు వారికో మాత్రమే సంబంధించింది కాదు.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐస్‌క్రీమ్ అంటే అదొక చల్లటి మంచు స్వప్నం. అందులోని రకాలు, రకరకాల ఫ్లేవర్స్, షేప్స్, సైజుల గురించి చెబుతూంటేనే నోరూరి పోతూంటుంది. ఐస్‌క్రీమ్ ఎంత రుచిగా ఉంటుందో దానికి అంత విలువైన పురాతన చరిత్ర కూడా ఉంది.

ఐస్‌క్రీమ్ చైనాలో పుట్టింది. మొదటగా గడ్డ కట్టిన మంచు, పాలతో రుచికరమైన వంటకాలు చేసినట్టు చెబుతారు. ‘మార్కోపోలో’ 700 ఏళ్ల క్రితం ఈ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. చైనా నుంచి దీని రుచి ఇటలీకి, ఫ్రాన్స్‌కి పాకింది. తర్వాత అమెరికన్లకు మహా మోజుగా మారింది. ప్రపంచమంతా విస్తరించింది.

ఐస్‌క్రీమ్ చైనాలో పుట్టింది. మొదటగా గడ్డ కట్టిన మంచు, పాలతో రుచికరమైన వంటకాలు చేసినట్టు చెబుతారు. ‘మార్కోపోలో’ 700 ఏళ్ల క్రితం ఈ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. చైనా నుంచి దీని రుచి ఇటలీకి, ఫ్రాన్స్‌కి పాకింది. తర్వాత అమెరికన్లకు మహా మోజుగా మారింది. ప్రపంచమంతా విస్తరించింది.
మొదటిసారిగా 1904లో సెయింట్ లూయిస్‌లో ‘ప్రపంచ ప్రదర్శన’లో ఐస్‌క్రీంను ఉంచారు. 1921లో మొదటిగా ఐస్‌క్రీం బార్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో ఐస్‌క్రీం అనేది రాజ ప్రాసాదాలకో, అధికార వర్గాలకో, ఏ కొద్ది సంపన్నులకో పరిమితంగా ఉండేది. అప్పట్లో నిల్వ ఉంచడానికి తగిన సౌకర్యాలు లేనందున ఇలా లగ్జరీగా మిగిలిపోయింది. కేవలం కొద్దిమందికే పరిమితమైన ఐస్‌క్రీమ్ రానురాను సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. వివిధ సమాజాలు, వారివారి ఆచార వ్యవహారాలను బట్టి రోజువారీ ఆహారపు టలవాట్లలో చోటు చేసుకుంది. నిజానికి రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత దీనికి మరింత పాపులారిటీ పెరిగింది.
పాలు, వెన్న, చక్కెర లేదా తేనె, కోడిగుడ్లు, వివిధ రకాల పండ్లూ, విత్తనాలు, చాక్లెట్లు మొదలైనవి ఐస్‌క్రీమ్‌లో వాడటం ప్రారంభమైంది. కమర్షియల్‌గా ఐస్‌క్రీంని తయారుచేసే పద్ధతులూ కనిపెట్టారు.
మిల్క్ సాలిడ్, ఫ్యాట్స్, షుగర్, నీరు కలిపి మిక్స్ చేసి, ఐస్‌క్రీం ప్లాంట్‌లో వీటిని ‘పాశ్చరైజ్’ చేస్తారు. తర్వాత ‘హోమోజెనైజేషన్’ ప్రక్రియ ద్వారా అందులోని కొవ్వు పదార్థాలను కరిగిస్తారు. స్టోరేజ్ ట్యాంక్‌లో మూడు, నాలుగు గంటల పాటు ఉంచి తరువాత వివిధ రకాల ఫ్లేవర్లు, కలర్లు కలుపుతారు. ఫ్రీజర్లలో లిక్విడ్ అమ్మోనియా ద్వారా 30 డిగ్రీల టెంపరేచర్‌ని స్థిరంగా ఉంచుతారు. ఫ్రీజర్‌లో అత్యధిక వేగంతో తిరిగే ఫ్యాన్ వంటి బ్లేడ్ల వల్ల మిక్స్ ఫ్రీజర్ పక్కలకు చేరుకుంటుంది.
ఐస్‌క్రీంకు మంచి గాలి ఎంతో ప్రధానమైనది. ఈ గాలి చేరక పోయినట్లయితే కేవలం ఐస్ క్యూబ్‌లు తింటున్నట్టే ఉంటుంది. అలాగే గాలివల్ల మిక్స్ పరిమాణం కూడా పెరుగుతుంది. అన్ని ఐస్‌క్రీముల్లోనూ గాలి ఉంటుంది. గాలి పెరిగే కొద్దీ ఐస్‌క్రీమ్ తేలిక పడుతుంది. ఇలా గాలి ప్రవేశించడానికి ముందు వెనక ఐస్‌క్రీం పరిమాణంలో ఉండే తేడాని సాంకేతికంగా ‘ఓవర్ రన్’ అంటారు. ఇంటి అవసరాలకు ప్యాక్ చేసే ఐస్‌క్రీమ్‌లో 80 శాతం ‘ఓవర్ రన్’ ఉంటుంది. ప్యాకేజీ ముందు ఐస్‌క్రీమ్‌లో పండ్లూ, విత్తనాలు ఉంచుతారు. ప్యాకేజింగ్ అయిన తర్వాత ‘హార్డెనింగ్ రూం’లో పెడతారు.
-23 డిగ్రీల నుంచి -29 డిగ్రీల వరకూ టెంపరేచర్‌లో 12 గంటలసేపు ఈ హార్డెనింగ్ ప్రక్రియ సాగుతుంది. ఐస్‌క్రీంలో ఉండే అత్యధిక భాగం నీరు ఈ దశలోనే గడ్డ కడుతుంది.
తొలి నాళ్లలో ఐస్‌క్రీం తినాలంటే డైరీ పార్లర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇవాళ ఐస్‌క్రీం పార్లర్లే వెలిశాయి. ఏవో కొన్ని చోట్ల మాత్రమే దొరికే ఐస్‌క్రీంలు ఇప్పుడు ప్రతి చోట్ల కనిపిస్తున్నాయి. అందుబాటులో అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇలా బయట ఎన్ని లభిస్తున్నా చాలామంది మిహిళలకు ఇంట్లోనే ఐస్‌క్రీం తయారుచేసుకోవాలన్న సరదా ఉంటుంది. అంతేకాదు, స్వయంగా చేసిన ఈ ఐస్‌క్రీంని నలుగురికీ తినిపించి గొప్పగా ఎంజాయ్ చేయాలనుకుంటారు.
కమర్షియల్‌గా చేసిన ఐస్‌క్రీమ్‌కీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌కీ చాలా తేడా ఉంటుంది. కానీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌లో అదో ఆనందం.


ఐస్‌క్రీమ్ క్వాలిటీని దాని మెత్తదనాన్నిబట్టి, సులువుగా చెప్పవచ్చు. అందులో వాడే క్రీములను బట్టి అది ఉంటుంది.
వెనిల్లా, చాక్లెట్, పిస్తా, ఫ్రూట్.. ఇలా ఎన్ని వెరైటీలైనా మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. తాజా ఫలాలతో, కేకులతో, ఫుడ్డింగ్స్‌తో కలిపితే ఇక ఆ రుచి భలేగా ఉంటుంది.
చూడగానే నోరూరించడానికి ఐస్‌క్రీమ్‌లపైన చాక్లెట్ ముక్కలు, ఫ్రూట్స్, జెల్లీ, తేనె అద్దుతారు. ఇక అవి చూశాక తినేదాకా మనసు, నోరు ఊరుకోవు. ఇవాళ ఐస్‌క్రీమ్ చాలా రొటీన్ అయిపోయింది.
చూడగానే నోరూరించడానికి ఐస్‌క్రీమ్‌లపైన చాక్లెట్ ముక్కలు, ఫ్రూట్స్, జెల్లీ, తేనె అద్దుతారు. ఇక అవి చూశాక తినేదాకా మనసు, నోరు ఊరుకోవు. ఇవాళ ఐస్‌క్రీమ్ చాలా రొటీన్ అయిపోయింది.
ప్రతి ఫంక్షన్‌లోనూ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే. పెళ్లిలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, పుట్టినరోజు వేడుకలో కానివ్వండి. ఏ కార్యక్రమంలోనైనా ఇప్పుడు ఐస్‌క్రీమ్ చివరి ఐటమ్‌గా ప్రత్యక్షమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి