సోమవారం, ఏప్రిల్ 18

పలకరింపు... పులకరింపు..


  
పొగడ్త మంచిదే...! ..
. ప్రశంసల  వర్షం కురిపించండి..!
పలకరింపు... పులకరింపు...
ప్రశంస తిరుగులేని సాటిలేని హార్మోన్ వంటిది. దానివల్ల మనస్సు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే ఎటువంటి వారికైనా ప్రశంస ప్రధానం.
విమర్శనాత్మకమైన విశే్లషణలతో మనస్సు పాడుచేసుకోవద్దు. చాలామంది ఎదుటివారిలోని మంచిని గుర్తించినప్పటికీ ఆ ముక్కను వారితో చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. చెబితే తామెక్కడ తక్కువయి పోతావేమోనన్నది వారి ఆలోచన. అయితే ఇంకొందరికి అహం అడ్డు వస్తుంటుంది. ఎదుటివారిని ప్రశంసించవలసి వచ్చిన సందర్భాల్లో నోరుకట్టేసుకుంటారు. అప్పుడు ఇలాంటి వారిని ఎవరు మాత్రం ప్రశంసిస్తారు. ప్రశంసలు కావాలని కోరుకోని వారుండరు. కాబట్టి మనమూ ప్రశంసించడం నేర్చుకోవాలి. ప్రశంసలు మన మనస్సును ఉల్లాసపరుస్తుంది. అభివృద్ధికీ దోహద పడుతుంది.

 
ఏ వయసులో ఉన్నా, ఏ దశలో ఎంత ఉన్నతిలో ఉన్నా చిన్నపాటి ప్రశంసను కోరుకోని వారు బహుశః ఎవరూ ఉండరు. ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించి, ప్రశంసించే గుణం అందరికీ ఉండదు. ఎవరయినా ప్రశంసిస్తే, మొహమాటానికి పొగడ్తలు వద్దులే అని ఓ మాట అనేస్తాం. కాని ఆ ప్రశంసతో మనసు ఎంత చిందులు వేస్తుందో, ఉత్సాహం ఎంతగా పరవళ్ళు తొక్కుతుందో అనుభవించిన వారికి కాని తెలియదు.

 
నవ్వినప్పుడు మోములో ఒంపు వస్తుంది. కాని ఎన్నో విషయాల్ని సరిచేసే లక్షణం ఆ నవ్వుకు ఉంది. ఎదుటివారి అందాన్నో, పర్సనాలిటీనో, నచ్చిన గుణాన్నో, వారి వృత్తి, ఉద్యోగ మెళకువల్నో, తెలివితేటల్నో అభినందిస్తే ఆ ఆనందం నవ్వులో పరిమళిస్తుంది. ఎదుటివారిలోని గుణగుణాల్ని ప్రశంసించగల వ్యక్తులు నిజంగా గొప్పవారే. చాలామందికి తోటి వారిలోని మంచిని ప్రశంసించడానికి అహం అడ్డు వస్తుంటుంది.


 
ముఖస్తుతి, పొగడ్తల్ని మర్చిపోదాం. మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి వాఖ్యానం చాలు ఎదుటివారిని కదిలించడానికి. మనస్ఫూర్తిగా విష్ చేస్తే చాలు. పొగడ్త మిళితమయిన పలకరింపు వారి కన్నులను తడిపేస్తుంది. ఇది ఎమోషనల్ ఆహారం. చాక్లెట్ల కంటే తీయనైనది. కిచిడి కంటే పోషకాహారం. మరెన్నో వాటికంటే శక్తి నిచ్చేది. అంటే రోజుకొక్కసారైనా అందే ప్రశంస రోజంతా ఎదుర్కొనే ఒత్తిళ్ళను దూరం చేయగల శక్తివంతం అయినదన్నమాట. సంతోషపూరితమయిన బాంధవ్యంలో ఉండాల్సిన లక్షణాల జాబితాలో ప్రేమ తర్వాతి స్థానం పరస్పర ప్రశంసలదే.

 
మన ప్రశంసలకు పాత్రులయ్యే వారు వారిని వర్ణించే మన మాటలోని గొప్పతనం గ్రహిస్తారు. అంటే వారి జీవితాలు విజయ పథంలో సాగడానికి మద్దతును, స్ఫూర్తిని, ప్రశంసల ద్వారా అందిస్తున్నట్లేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రశంస అనేది తిరుగులేని, సాటిలేని హార్మోన్ వంటిది. మనస్సు, శరీరం రెండూ సంతోషంతో నాట్యం చేయాలని వాంఛిస్తాయి.
 
శివుడు సమాధిలో కూర్చున్నప్పుడు విశ్వమంతా అతనిలో ఒదిగిపోయి వుండి, అతను ఆనందంలో నర్తిస్తున్నప్పుడు ఆ విశ్వం బద్దలయిన మాదిరి, మనలోని శివశక్తి ప్రశంసలతో తడిచి ముద్దవుతుంది. ఆ స్ఫూర్తితో మన జీవితాలను పునర్నిర్మించుకోగలం. మన ధోరణిని పునః సృష్టించుకుంటాం. విభిన్న భావోద్రేకాలకు, విభిన్న నరాలు అనుసంధానం అయి వుంటాయి కాబట్టి నరాలు, అనుభూతులకు ప్రశంసలకు వేర్వేరుగా నరాలన్నీ మన మెదడులో గూడు కట్టుకుని ఉంటాయి. భావోద్రేకాల న్యూరాన్ల నెట్‌వర్క్ రోగనిరోధక వ్యవస్థను, నాడీ వ్యవస్థను, జీర్ణవ్యవస్థను, హృదయ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 
మనుగడకు ప్రశంసల అవసరం ఎంతయితే ఉందో ఎదుటివారికీ అంతే ఉంటుందని మనం గుర్తించాలి. ఇది విశ్వజనీన సూత్రం. ఎదుటివారికి ఏదైతే ఇస్తామో మనకూ అదే దక్కుతుంది. ‘‘మీకు కనుక ఎదుటివారి అటెన్షన్, ప్రశంస కావాలనుకుంటే ఆ రెంటినీ మీరూ ఇవ్వాల్సిందే. అందుకే ఎదుటివ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించండి. గుర్తించిన దానిని ఎంచక్కా వారికి చెప్పేయండి. ప్రశంసలవల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆలోచనలకు, శక్తికి రీచార్జి అవుతుంది. పరిధిని విస్తరించుకోవాలని, దయా గుణాలతో, ప్రతిదానినీ మరింతగా ప్రేమించాలని వాంఛిస్తారు. అందుకు ఎటువంటి వారికైనా ప్రశంస ప్రధానం. కాబట్టి కురిపించండి ప్రశంసల జల్లు. దాంతో మీకు దక్కుతుంది మంచి ప్రశంసల పులకరింత.
 - సుబ్బానాయుడు


బుధవారం, ఏప్రిల్ 13

హ్యాపీ లైఫ్ కు ఆనంద సుత్రాలివిగో...

 

హ్యాపీ లైఫ్ కు ఆనంద సుత్రాలివిగో...

టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.

దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలీ...
-  సుబ్బానాయుడు.
 

మంగళవారం, ఏప్రిల్ 12

నేటి ఫ్యాషన్ ట్రెండ్ ..జీన్స్


ఫ్యాషన్  ట్రెండ్  ..జీన్స్


 


ఒకప్పుడు జీన్స్ వన్ ఆఫ్ ది డ్రెసెస్... కానీ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ స్టైల్... అదే నేటి యువత ప్యాషన్ స్టేట్‌మెంట్. కొన్ని కాలేజీల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. స్టూడెంట్స్‌కు కొత్తగా డ్రెస్ కోడ్ ఏమైనా విధించారా అని అనుమానం వేస్తుంది.
ఎందుకో తెలుసా...?

ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ జీన్స్ ప్యాంట్స్. అబ్బాయిలే కాదు.. అమ్మాయిల సంగతీ అంతే.. ఇంకో మాటలో చెప్పాలంటే జీన్స్ ధరించే వారిలో అమ్మాయిలే ఎక్కువే. అబ్బాయిలకు ప్యాంట్స్ విషయంలో ప్రత్యామ్నాయాలున్నా, అమ్మాయిలు మాత్రం జీన్స్, కాటన్స్ మాత్రమే ధరిస్తున్నారు. జీన్స్ స్టైలే వేరని అంటున్నారు.

జీన్స్‌లో ఫ్యాషన్, స్టైల్స్‌తోపాటు కంఫర్ట్ కూడా ఉండడంతో వాళ్ళంతా దానికే ఓటేస్తున్నారు. వీళ్ళందరినీ చూశాక మేమెందుకు వేయకూడదంటూ చిన్నపిల్లలు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరూ ఇష్టపడి ఇదే కొత్త ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు.


జీన్స్ రెగ్యులర్ వేర్‌లో ఒక భాగంగా మారిపోయింది. ఒకే రకంగా మూసపోసినట్టు బ్లూ రంగులో మాత్రమే ఉండే జీన్స్‌లో కూడా ఫ్యాషన్ ట్రెండ్స్ నేడు ఎన్నో మార్పులు తెచ్చాయి.
రకరకాల స్టయిల్స్‌లో, మోడల్స్‌లో యువతను ఆకట్టుకునేలా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌కి ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.


ఫ్యాషన్‌కు తగ్గట్టు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా తగిన ఫిట్స్ లభించడమే జీన్స్ ప్రత్యేకత. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వేస్ట్, హిప్స్, ఎట్లా ఉన్నా అందరికీ తగిన ఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ఫిట్స్ వారివారి శరీరాకృతికి నప్పేలా కూడా ఉంటున్నాయి. స్టయిల్‌గా ఉండడం ఈ ఫిట్స్‌కు అదనపు ఆకర్షణ. అందుకే జీన్స్ అంటే చిన్న, పెద్ద అందరూ ఇష్టపడతారు. బటన్‌పై, స్ట్రెయిట్ లెగ్, స్లిమ్ ఫిట్, బూట్ కట్, లోబూట్ కట్, రిలాక్స్‌డ్ బూట్ కట్, కంఫర్ట్ ఫిట్, రెగ్యులర్ ఫిట్, రిలాక్స్‌డ్ ఫిట్, అంటూ రకరకాల ఆకృతులలో వస్తున్నాయి.

స్టోన్ వాష్, ఆసిడ్ వాష్, ఐడల్ వాష్, రాబిన్‌సన్ వాష్ పేరిట జీన్స్‌లో వివిధ రకాల వాష్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అక్కడక్కడా రంగు వెలసిపోయి రఫ్‌గా కనిపించే ఈ జీన్స్‌లో అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఇక ప్యాంటు అక్కడక్కడా దారాలు వేలాడుతూ ఉండడం కూడా ఓ ఫ్యాషన్‌గా మారింది. వీటిని ఛోపర్, డిస్ట్రక్షన్, వర్క్ జీన్స్‌గా పిలుస్తారు.
అమ్మాయిల ఒంటి విరుపులకు అనుగుణంగా లోఫ్లేర్, సూపర్ లోఫ్లేర్, స్ట్రెచ్‌లలో జీన్స్, సూపర్ లోబూట్‌కట్ అంటూ అందమైన డిజైన్లలో అనేక రకాల జీన్స్ అందుబాటులో వచ్చాయి.
జీన్స్ సక్సెస్‌కి అంతాదాని అందుబాటు గుణంలోనే ఉంది. మధ్యతరగతి నుంచి ధనికుల వరకు అందరి స్థోమతకు తగిన ధరల్లో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వంద రూపాయలు మొదలుకొని ఐదారువేలకు పైగా జీన్స్ ధర పలుకుతున్నాయి. సాధారణ కంపెనీ జీన్స్, మూడు వందలకే లభ్యమవుతున్నాయి. లీ, రాంగ్లర్, లెవీస్, పెపె, డాకర్స్, డిక్కీస్, ఆక్సంబర్గ్, బఫెల్లో, పాయిజన్, కిల్లర్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ జీన్స్ కూడా ఏడొందల నుండి ప్రారంభమై రెండువేలకు పైబడిన రేంజ్‌లో లభిస్తున్నాయి.

జీన్స్ స్టయిల్‌గా ఉండడంతోపాటు వెచ్చగా అనిపిస్తాయి. మందంగా ఉండే జీన్స్ ప్యాంట్లను ఏ కాలంలో ధరించినా ఇబ్బంది లేదు. వేసవిలో వీటికి చెమటను పీల్చే గుణం ఉంటుంది. చలికాలం జీన్స్‌లో ఉన్నంత సుఖం ఎందులోనూ లేదు.
అందుకే చాలామంది ముఖ్యంగా కుర్రకారు స్వెటర్లు, జర్కిన్‌ల కన్నా జీన్స్ జాకెట్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. వీటితోపాటు జీన్స్ షర్ట్‌లుకూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. డెనిమ్ షర్ట్స్‌గా పిలవబడే జీన్స్ కూడా చలిని దూరంగా ఉంచుతాయి. అందులో ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొన్ని కంపెనీల వాళ్ళు పదహారేళ్ళ వయసు వారి నుంచి 25 ఏళ్ళ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జీన్స్ ప్యాంట్లు, టాప్‌లు తయారు చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ, స్టడెడ్, రిబ్బన్ జీన్స్, ఇలా రకరకాలుగా మంచి అల్లికతో తయారయ్యే జీన్స్ అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయిల కోసం కొన్ని కంపెనీలు అనేక షేడ్స్‌లో బోలెడు మోడల్స్‌లో రూపొందిస్తున్నారు. మరి కొన్ని కంపెనీలు ఏ టు జెడ్ అంటూ రకరకాల డిజైన్లు, పువ్వుల ఎంబ్రాయిడరీలతో, అబ్‌స్ట్రాక్ట్ ప్రింటులతో, శాటిన్ ట్రిమ్మింగ్స్‌తో, బ్లూ, చార్‌కోల్, నలుపు, తెలుపు రంగురంగుల జీన్స్ నేడు మార్కెట్‌లో అన్ని వయసుల వారికి లభిస్తున్నాయి. చిన్నపిల్లల మొదలుకొని అరవై ఏళ్ళ వయసువారి వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే జీన్స్ అంటే నేడు అందరికీ క్రేజ్...
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ వేషధారణలో కూడా మార్పులు తెస్తున్నాయి. అందులో భాగమే అమ్మాయిల డ్రస్సింగ్ స్టయిల్లో మార్పులు చోటు చేసుకోవడం.
పంజాబీ సూట్స్ వచ్చి లంగా వోణీల ట్రెండ్‌కు స్వస్తి పలికితే... జీన్స్ ప్యాంట్లు వచ్చి పంజాబీ సూట్స్‌ను పక్కకు నెట్టేసాయి.. నేటి తరం అమ్మాయిల ఫ్యాషన్ స్టేట్‌మెంట్ జీన్స్.


‘‘్ఫర్మల్ ప్యాంట్స్ అరుదుగా ధరిస్తాం. జీన్స్ స్టయిల్‌గా కనిపిస్తాయి. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. ఎట్లా మెయింటెయిన్ చేసినా ఫ్యాషన్‌బుల్‌గానే ఉంటాయి’’ అని ఆనంద్ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సునీల్ అంటున్నాడు. ఈ కుర్రాడికి అనేక రంగుల్లో అనేక మోడల్స్ జీన్స్ ఉన్నాయిట. ఎప్పుడూ జీన్స్ వాడుతాడుట. అవే కంఫర్టని చెబుతాడు. ‘‘జీన్స్ స్టయిల్‌గా ఉండటమే కాదు. రేటు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యాషన్‌తో పాటు ఎక్కువ కాలం డ్రెస్ వేసుకోవచ్చు.
ప్యాంటు చిరిగినా, దారాలు వేలాడినా ఫ్యాషనే. ఫ్రెండ్స్‌తో పాటు అమ్మాయిలూ జీన్స్ ధరించిన అబ్బాయిల్ని లైక్ చేస్తార’’ని ఇంజనీరింగ్ చదివి, జావా చేస్తున్న శ్రీకాంత్ అన్నాడు. ‘జీన్స్’ ధరించ డం ఇప్పుడు యువతకు కల్చర్‌గా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పెద్దపెద్ద నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనూ చివరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువతీ యువకులతో పాటు వయసుపైబడిన వారు కూడా జీన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని ప్రాంతాల్లోనూ, అన్నిరకాల జీన్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్తకొత్త సొబగులు అద్దుకొని మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ జీన్స్‌ని ఫాస్ట్‌గా ఫాలో అయిపోండి ఇక...
- కంచర్ల
 

శనివారం, ఏప్రిల్ 9

ఈ తరం అభిరుచి..

అమ్మాయలు ఇష్టపడాలంటే…


నేటి ప్రపంచం లో అబ్బాయిలకంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలకు సైట్ కొడుతున్నారని ఒక పరిశోధన.ఈ పరిశోధనలు ఎవ్వరు కనిపెట్టారో కాని అన్ని నిజాలే చెప్తారు సుమండీ!.గతం లో అమ్మాయిలకు ఉండే సిగ్గు జాడ్యం ఇప్పుడు ఎక్కువగా అబ్బాయిలకు అంటుకుందట.ఏది ఏమైనా అమ్మాయిల మనసు లోతు తెలుసు కోవడం చాల కష్టం.మనసు లోతులోకి తొంగి చూడాలంటే ఆడవాళ్ళ సైకాలజీ తెలుసుకోవాలి మరి.

- కత్తిమండ ప్రతాప్

* అమ్మాయిలను ఎక్కువగా పొగుడుతూ వుండాలి.
* వారితో చాల లాజిక్ గా మాటాలాడాలి.
*   చెత్తా డైలాగ్స్ వేసేవారంటే అమ్మాయిలకు నచ్చదు
* చతుర సంభాషణగా మాటలాడే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు
* అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల అందానికి ప్రాముక్యత

ఇవ్వకపోయినప్పటికి హుందాతనానికి ప్రాముక్యత ఇస్తారు
* నడక చూసి ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు
* జోక్స్ వేసే వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
* నలుగిరిలో పేరున్న వ్యక్తులను అమ్మాయిలు లైక్ చేస్తారు.
*  పిచ్చి తలలు .రంగుల తలలు వేసే వారిని ఇష్టపడే వర్గం వేరేగా వుంది.
* మరికొంతమంది మొరటు వ్యక్తులను ఇష్టపడతారు.
*  అందానికి తక్కువ ప్రాముక్యత ఇస్తారు.
* సెంటిమెంటు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
* పాటలు పాడేవారిని అమ్మాయిలు లైక్ చేస్తారు.
* ఉద్యోగం చేసే వారిని ఇష్టపడతారు.
* అమ్మాయిల దగ్గర బిగ్గరగా లౌడ్ స్పీకర్ ల మాటలాడకుడదు
* మృదు మధుర సంభాషణ అలవాటు చేసుకోవాలి.
* అమ్మాయిల కళ్ళలోకి పదే పదే చూడరాదు.
* అలా చూడటం వాళ్ళకు చెడు అభిప్రాయం కలుగుతుంది.
*  సింపుల్గా హుందాతనం గా ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు.
* డ్రెస్ మైంటేనెనసే పాటించేవారిని లైక్ చేస్తారు.
*  అబ్బాయిల కాళ్ళు సుబ్రతను అమ్మాయిలు పరిగణలోకి తీసుకుంటారు.
* తలవంచి మాటలాడే టప్పుడు వారు కాళ్ళ భాగాన్నే గమనిస్తారు
*  చేతులు ఉపే వారంటే వారికి ఇష్టముండదు.
* మీసం అందాన్ని చూసి లైక్ చేసే వారు చాల మంది ఉంటారు.
*  మీసం లేని వాళ్ళను ఇష్టపడే వాళ్ళు కూడా వున్నారు కాని తక్కువ.
* హెయిర్ స్ట యిల్ ను చాల మంది ఇష్టపడతారు.


……ఇలా అనేక రకాలుగా మగవాళ్ళను ఇష్టపడుతున్నట్లు పరిశోధనల్ సారంశం.ఓకే అబ్బాయిలు చూసారు కదా ..ఇందులో మీ లక్షణాలు ఏమిటో మీరే తెలుసుకోండి.ఎవరెన్ని చెప్పిన కాని ఆడవారి మనసు తెలుసు కోవడం బహు కష్టం సుమా !!!

బాయ్ ఫ్రెండ్స్‌ను అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఏయే సందర్భాల్లో మగవారు ఎలా నడుచుకుంటారో, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి పెద్ద తెలివి తేటలు అక్కర్లేదు. కామెన్ సెన్స్ ఉంటేచాలు’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు.

అబ్బాయిల్ని యిష్టపడాలంటే వారు ఎలా నడుచుకోవాలో, ఎలాంటి వారిని లైక్ చేస్తారో ఈ అమ్మాయిలు చెపుతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరు, కావలి, బ్రహ్మదేవి, బుజబుజ నెల్లూరులోని కాలేజీ అమ్మాయిలు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. సో… అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఆలకించాలి! ఈతరం యువతులు సమానత్వం కోరుకుంటున్నారు. అవకాశం అందితే ఒక మెట్టు పైనే ఉండాలని అనుకుంటున్నారు. అసలు, ఆడ, మగ సమానమా.. కాదా… వంటి వాదనలు కాసేపు పక్కన పెడితే తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచని అబ్బాయిలంటే అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదుట. ఈతరం అమ్మాయిలకు ‘మహారాణి’గా మంచి హోదా ఇవ్వాలని అంటున్నారు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయే అబ్బాయిలంటేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. పెద్ద గొంతుతో గోలగోలగా మాట్లాడే వాళ్ళతో కాసేపు గడపాలన్నా చిరాకే. వారి గొడవ వారిది తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు ఎదుటివారి భావాలను అర్థం చేసుకోలేరు. హుందాగా ప్రవర్తిస్తూ, ఎదుటివారిని కలుపుకుంటూపోయే వారు మంచి ఫ్రెండ్‌గా, ఇష్టపడితే మంచి భాగస్వామిగా రాణిస్తారని అలాంటి వారికే అమ్మాయిలు ఎక్కువగా మార్కులు వేస్తున్నారు. మొట్టమొదటి సారిగా కలసి బయటకు వెళ్ళినప్పుడు కాస్తయినా మొహమాటం, మర్యాద లేకుండా ‘‘ఎవరి బిల్లు వారే కడితే’’ అని అడిగే అబ్బాయిలను అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరంటున్నారు.
స్నేహం బాగా పెరిగాక సంగతి వేరు. కానీ మొదటిసరా కాఫీకి, కూల్‌డ్రింక్‌కూ కూడా లెక్కలు చూసుకునే వాళ్ళంటే చులకన భావమే తప్ప గౌరవం కలగదట.
తమతమ సంస్కారం కొద్దీ కొంతమంది అమ్మాయిలు బిల్లు తామే కడతామని చెప్పవచ్చు. అది వేరే విషయం. కానీ ఆమాట అబ్బాయిలు అడిగితే మాత్రం అమ్మాయిలు సహించలేరని వారు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

- కంచర్ల


అమ్మను ఇష్టపడితే చాలు..

అమ్మను ఇష్టపడే మగవాళ్ళంటే సాధారణంగా అమ్మాయిలకు యిష్టం. తల్లిని గౌరవించిన వాడు భార్యనూ గౌరవిస్తాడని అమ్మాయిలకు ఓ నమ్మకం. అమ్మపట్ల ఆరోగ్యకరమైన ప్రేమ ఉన్నా అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుంది. భార్య స్థానంలో ఉన్నా తనను అలాగే గౌరవిస్తాడనే నమ్మకం అమ్మాయికుంది. ఈ జన్మకు కారకురాలు ఆ అమ్మే కదా మరి!

   -పల్లవి                        

ఏడ్వగలిగినవాడే మగాడు

మనస్ఫూర్తిగా ఏడ్వగలగడం ఓ వరం. ఇది అమ్మాయిలకే పరిమితమైన విషయమనుకోను. మన సమాజంలో మగాళ్ళు ఏడవకూడదన్నట్టుగా చిన్నప్పటి నుంచీ పెంచుతారు. నిజానకి దుఃఖం వచ్చినప్పుడు ఏడ్వడానికి సిగ్గుపడనివాడే అసలైన మగాడు. బాధను వ్యక్తం చేసేందుకు సంకోచించని వాడే తన బాధ్యతలనూ పరిపూర్ణంగా నిర్వర్తించగలడు.

-సితార

            నిజాయితీ ముఖ్యం

ఏ విషయంలోనై  నా  ఆడవాళ్ళకు నిజం కావాలి.   కేవలం నిజం. అది బాధపెట్టేదైనా సరే. భయపెట్టేదైనా సరే… దాన్ని ఎదుర్కొనే మానసిక సన్నద్ధత అమ్మాయిలకు లేకపోలేదు. అబద్ధం చెప్పి సంతోష పెట్టేకంటే నిజం చెప్పి కష్టపెట్టినా సరే అమ్మాయిలు స్వాగతిస్తారు. అసలు ఓ విషయంలో నిజం దాచాల్సి వచ్చిందంటేనే ఏమో ఎవరికి తెలుసు?

-స్వర్ణ

            మరో అమ్మాయి జోలికెళితే…

ఎంత ఆధునికత అంటూ కబుర్లు చెప్పినా, స్నేహాలే కదా ఏముందిలే అని పైపైన సర్దుకున్నట్టు కనబడినా తన బాయ్ ఫ్రెండ్ ఇంకొకరివైపు కనె్నత్తి చూడడాన్ని కూడా ఏ అమ్మాయి సహించదు. ఈ విషయంలో ఓటు సంప్రదాయానికే. ‘‘నేను ఆమెతో అలా…’’ ‘కాలేజీలో ఇలా’.. అంటూ గొప్పలకు పోయే కోతలరాయుళ్ళంటే అమ్మాయిలకు ఒళ్ళు మండి పోతుంది.

-రాధ

మల్లెపూల పరిమళంగా…

ఈ రోజుల్లో అమ్మాయిలూ మంచి చదువులు చదివి, అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సంపాదిస్తున్నారనేది నిజం. తాము ఎంత సంపాదించినా సరే. బాయ్ ఫ్రెండ్ సంపాదనను ఖర్చు పెట్టడానికే అమ్మాయిలు ఇష్టపడతారు. ‘‘నీవు తెచ్చే మల్లెపూలకు పరిమళం ఎక్కువ’’ అన్న సంగతి తెలుసుకదా! అది డబ్బుల విషయంలోనూ వర్తిస్తుంది.

-అలేఖ్య

అమ్మాయిలకే తెలివెక్కువ!

మానసికంగా అబ్బాయిలకంటే మేమే బలవంతులం. ఈ విషయంలో అనవసరంగా వాదించి టైం వృథా చేసుకోలేం. సాధారణ తెలివితేటలున్న ఓ అమ్మాయి కూడా ఓ తెలివైన అబ్బాయిని అంచనా వేయడంలో పొరబడదు. అదే చాలా తెలివి తేటలున్న అబ్బాయి అమాయకమైన అమ్మాయి మనసును అర్థం చేసుకోవడంలో కూడా బోర్లా పడతారు.

- భారతి

బుధవారం, ఏప్రిల్ 6

చేతి స్పర్శ


 
నీ చేయి తాకగానే...

చంద్రబింబంలాంటి ముఖం... తామర తూడుల్లాంటి చేతులు... పద్మాల వంటి పాదాలు... కలువల వంటి కళ్ళు... సంపెంగలాంటి నాసిక... ఇలా ఎన్నో రకాలుగా స్ర్తిలను కవులు వర్ణిస్తూ ఉంటారు.
నేటి ఆధునిక స్ర్తిలు బ్యూటీ పార్లర్లపై ఎక్కువమోజు చూపిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో కేవలం ముఖం, జుట్టు వరకే శ్రద్ధ వహించేవారు. కాని ఇపుడు అంతే ప్రాముఖ్యం చేతులకి, పాదాలకి కూడా ఇస్తున్నారు. చేతులకి వాక్సింగ్ లాంటివి చేయించుకొని క్రీమ్స్ మసాజ్ చేసి, గోళ్ళు శుభ్రం చేసుకొని నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు. అరచేతికి అందంగా గోరింటాకు రకరకాలుగా డిజైన్లు పెట్టుకుంటున్నారు. భగవంతుడు స్ర్తిలకి చేతులు అందాల అలంకరణకు ఇచ్చాడా అన్నంతగా వ్రేళ్ళని, ముంజేతిని బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు.
కానీ, ఈ చేతుల ప్రత్యేకత ఇంతవరకే కాదు.. ఇంకా ఎంతో ప్రతిభాన్వితమైన మహత్తులు గలవి ఈ చేతులచేతలు. అనేక వందల మాటలు కలిగించనటువంటి ఒక మంచిభావాన్ని ఒక్కసారి ఆ బంగారు గాజుల చేతుల్తో తాకితే కలిగించవచ్చు. అంతటి మహత్తరమైన శక్తి గాజుల చేతికుంది.
తల్లి బిడ్డ తలపై చేయి వుంచి కొంతసేపు తలనిమిరితే అది పిల్లలకిచ్చే ఆనందం అనేక మాటలతో ప్రేమ వొలకపోస్తూ చెప్పినా ఇవ్వదు.
భార్యాభర్తలుగాని, స్నేహితులు గాని, ప్రేమికులు గాని ఎవరైనా సరే మాటలతో అభిమానం కురిపించే కన్నా ఒక్కసారి వారి భుజం మీద చేయి వేస్తే చాలు.. మాటలు బయటపెట్టలేని ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. ప్రేమాభిమానములు మానవులకి మానసిక సంతోషాన్ని, శక్తిని ఇస్తుంది.
అమితమైన ప్రేమ ఉన్నంతలో లాభం లేదు. అది ఎవరికి ఉద్దేశించబడిందో వారికి తెలిసేలా చేసినపుడే సార్థకత లభిస్తుంది. అందుకు ఈ బంగారు చేయి ఎంతో సాయపడుతుంది.
మెడిసిన్‌లా చేతి స్పర్శ.. చాలామంది తల్లులు పిల్లల్ని ఊరికే కొడుతూ ఉంటారు. పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి కోపాన్ని ప్రదర్శించటం లేక దండించటం జరిగిన తరువాత వారితో ప్రేమగా మాట్లాడినంతలో సరిపోదు. క్షమించినట్లు వారికి తెలిసేలా.. వారిని మన చేతుల్లోకి తీసుకొన్నపుడు, తలను నిమిరినపుడు దండన సత్ఫలితాలు కనబడతాయి. వారిలోని భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి.
ఒక్క దండన మాత్రమే చూపే పెద్దల యందు భయం తప్ప చిన్నారికి ప్రేమాభిమానాలు ఏ మాత్రం ఉండవు. కాబట్టి దండనతో పాటు ప్రేమగా చేతులతో దగ్గరకు తీసుకోవడం అవసరం. మానవ సంబంధాలకు చేతలను ఉపయోగించుకోవటం తెలుసుకుంటే వాటికున్న శక్తి ఇట్టే అర్థమవుతుంది. సులభంగా పని సార్థకం కావాలంటే చేయి స్పర్శ అద్భుతంగా మెడిసిన్‌లా పనిచేస్తుంది.
‘‘చేతికి గాజులందము, చెంపకు సిగ్గులందము’’ అని స్ర్తిని ఓ కవి వర్ణించాడు. అయితే ఆ గాజుల చేయి పురుషునికి ఆనందం అయితే బిడ్డకి ఆత్మీయత. స్ర్తిలు రకరకాల ఇంటి పన్లు చేతులతోనే చేయాల్సి ఉంటుంది. కనుక ఆ చేతులు వాటి నాజూకుతనాన్ని కోల్పోతాయి. తిరిగి అవి అందాన్ని సంతరించుకొనేందుకు అలంకరణ సామగ్రి ఉపయోగిస్తున్నారు. అలాగే పిల్లల్ని దండించే చేతుల్తోనే వారిని లాలించటం కూడా స్ర్తికి వెన్నతో పెట్టిన విద్య.
పురుషుని చేతి స్పర్శకంటే మృదువైన స్ర్తి చేతి స్పర్శకి స్పందన ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు సైతం తేల్చి చెపుతున్నారు. పిల్లల్ని ఎక్కువగా లాలించేది స్ర్తియే. తల్లి పిల్లల్ని అక్కున చేర్చుకుంటే ఆ పసి హృదయాలు అన్ని మరచిపోతారు. పురుషుడు తన్మయం చెందుతాడు. స్ర్తి చేతికి అంత శక్తి ఉంది మరి. చేతి వేళ్ళనుంచి ప్రకృతి సిద్ధం అయిన దివ్యశక్తి బయటకు ప్రవహిస్తుందని మానసిక శాస్త్ర ఆధారాలు కూడా ఉన్నాయి. కెనెల్‌వర్తు అనే మానసిక శాస్తవ్రేత్త ఇలా వ్రాశాడు. ‘‘మానవుని మించిన దివ్య శక్తి లేదు. ప్రకృతిలో మానవుడే ఒక దివ్యశక్తి పైకి కనబడే మానవుడు కాదు, అతని అంతఃకరణ. ఆ అంతఃకరణ అతని చేతల ద్వారా వ్యక్తం అవుతుంది. ప్రకృతిలో స్ర్తి - పురుషుడి కంటే ప్రేమకి, త్యాగానికి, ఓర్పుకి ప్రతీక. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. అంటే ఆ స్ర్తి చేతి నేర్పుని బట్టి ఇల్లు అలంకరణ, పిల్ల పెంపకం, ఓర్పు, నేర్పు, కుటుంబ గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు... అన్నీ ఇమిడి ఉంటాయి. ఆమె ప్రేమతో పిల్లల్ని చేరదీసి బుజ్జగింపుతో వారిని నేర్పులుగా, విద్యావంతులుగా మలుస్తుంది. మంచి నడవడి నేర్పిస్తుంది. భర్తకు సుఖ సంతోషాల్లో మహిళ పాలుపంచుకుంటోంది. అందరికీ అండగా నిలిచే గాజుల చేతులకి సాధ్యంకానిదంటూ ఏమీ లేదు.
-కంసుడు

పెళ్లి కళ వచ్చిందే బాలా!

 
 
 
 పెళ్లికి ... అతివల  ఇలా ! 
పెళ్ళి... ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం.
అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం.
ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే... మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం.
అందానికి మెరుగులు దిద్దే ప్రక్రియలో బ్యూటీ పార్లర్లు వెలసాయి. పల్లెల్లో కూడా కొందరు మహిళలు హౌస్ బ్యూటీషియన్లుగా తయారయ్యారు. అయితే.. ఎవరి సహాయం లేకపోయినా మీరు బ్యూటీగా తయారుకావచ్చు. బ్యూటీషియన్స్ అందుబాటులో లేరని ఏ మాత్రం చింతించవద్దు. కొద్దిపాటి ప్రణాళికతో సొంతంగా ఎవరిని వారే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు సుమా! కావాలంటే చూడండి!
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో... సరైన వేళ పాటించడమూ అంతే అవసరం.
జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.
తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. ఎక్కడపడితే అక్కడి నీరు తాగనే కూడదు. మినరల్ వాటరయితే
ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.
మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతా కాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళాదుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
శుభఘడియలు దగ్గరపడినకొద్దీ.. మీ తయారీ వేగమంతమవ్వాలి. వారం, పదిరోజులముందు వ్యాక్సింగ్ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ముందు రోజు చేయించుకోవడం అవసరం. పార్లర్లో బ్రైడల్ మేకప్ చేయించుకుంటున్నట్లైతే మీ పెళ్లి తేది, సమయం చెప్పి ముందుగానే కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజుల ముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భం కోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే.. రిహార్సల్ అన్నమాట.
పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక, వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్... మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్ళనిండా కమ్మని కలలతో ఆనందకరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికే పెళ్ళికళ!
-కంచర్ల

ఆదివారం, ఏప్రిల్ 3

ఉగాది శుభాకాంక్షలు


Ugadi 

 

అంతా జీరో!




జీరో... జీరో... ఓన్లీ జీరో...
జీరో క్యాలరీలు... జీరో కొలెస్ట్రాల్.. జీరో షుగర్.. జీరో సైజ్.. అంతా శూన్యమే!
అవును మరి... ఓవరాల్ జీరో...!!
అసలు... ‘ఏమీ లేకపోవడమే’ నేటి ట్రెండ్!!!
***
అంతా శూన్యం!
ఎవరు చెప్పారోగాని, ఎంత గొప్పతత్వం. పెద్దల మాట చద్దన్నం మూట కదూ!
అలాగని చద్దన్నం గబగబా లాగించేయకూడదు. అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో తెలుసుకోవాలి. అది షుగర్‌ను పెంచుతుందో లేదో తెలుసుకోవాలి. ‘సైజ్ జీరో’ ఫిగర్‌ను ప్రభావితం చేస్తుందో లేదో కనుక్కోవాలి. మారిన పరిస్థితుల దృష్ట్యా ఇంత తతంగముంది మరి.
కాస్త ఫన్నీగా ఉన్నా... మన దేశంలో ‘జీరో సైజ్’కు కరీనా కపూర్‌నే ఆద్యురాలు. ఆమె అలా అయ్యాకే అమ్మాయిల్లో ఆ స్పృహ వచ్చింది.
సైజ్ జీరో.. ఇది స్ర్తిల దుస్తుల సైజుల్లో భాగంగా వచ్చింది. సైజ్ జీరో అంటే 31-23-32 అన్నమాట. నిజానికి అమ్మాయిల్లో బాడీ మాస్ ఇండెక్స్ ఉండాల్సిన దానికంటే బాగా తగ్గిపోయింది.
కారణం ఏదేమైనా- ఈ ‘సైజ్ జీరో’ మన భారతీయ మహిళలకు ఏ మాత్రం నప్పదు. దీన్ని ఫ్యాషన్ రంగ నిపుణులు, వైద్యులూ ధృవీకరిస్తున్నారు. అయినా వినిపించుకునే వాళ్ళేరీ?
మన మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మూడు ప్రధాన అనారోగ్య సమస్యలు- స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం. అన్ని వయస్సులవారినీ, స్ర్తి పురుషులిద్దరినీ కూడా ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. చిన్న వయసులోనే కోట్లమంది చిన్నారుల్ని ఇవి పట్టి పీడిస్తున్నాయని పరిశీలకులంటున్నారు.
మన దేశంలో స్థూలకాయుల సంఖ్య పది కోట్లు! మధుమేహంతో బాధపడేవారు 15 కోట్లు. 2025 నాటికి వీరి సంఖ్య దేశజనాభాలో 30 శాతానికి చేరుతుందట. దేశంలో 6 నుంచి 15 ఏళ్ళలోపు చిన్నారుల్లో 25 శాతం స్థూలకాయులేనట! ఇవన్నీ తెలుసుకున్న కొన్ని కంపెనీలు ఇలాంటి వాళ్ళకోసం జీరో క్యాలరీ టీ, డ్రింకులు, బబుల్‌గమ్, జీరో ఫ్యాట్, చాక్లెట్లు, బిస్కెట్లు... ఇలా ఎన్నో ఉత్పత్తి చేస్తున్నాయి.
నిజానికి ఇవి ఆరోగ్యానికి మంచివేనా?... వీటిలో క్యాలరీలు ఏమీ ఉండవా?... అంటే నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో ‘కాదు’ అనే చెప్పాలి.
అదీ సంగతి! ఆహార పదార్థాల్లో ఎంత కొవ్వు ఉండాలనే దానిపై కొన్ని షరతులున్నాయి. వంద గ్రాముల పదార్థంలో 5 గ్రాముల సంతృప్త కొవ్వు తప్పనిసరిగా ఉండాలి. జీరో క్యాలరీవిగా చెప్పే చూయింగ్ గమ్‌లు రెండు ఒకేసారి నమిలితే 5 క్యాలరీల శక్తి వస్తుందట. 300 మిల్లీలీటర్ల గ్రీన్ టీని తాగితే రెండు క్యాలరీలు అందుతాయి.
ఇక షుగర్ ఫ్రీ జెల్లీలు... ఇందులో కూడా పళ్ళ రసాలు, ఫ్రక్టోజ్ లాంటి స్వీటెనర్లు ఉంటాయి. అంటే అందులో కొంత చక్కెర ఉంటుందన్నమాటే!
మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం అనేక ప్రత్యామ్నాయ తీపి పదార్థాలు వస్తున్నాయి. అయితే వీటిల్లోనూ ఎంతో కొంత గ్లూకోజ్ ఉండకపోదు. పైగా వీటిల్లోని ఆస్పర్టేమ్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇవన్ని తెలుసుకుంటుంటే... ‘‘నేతి బీర కాయ’’ సామెత గుర్తుకు రావట్లేదూ!
ఇక కొలెస్ట్రాల్... శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయడంలో ఉపకరించే పదార్థం. అంతాకాదు ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల తయారీలోనూ కీలకపాత్ర వహిస్తుంది. అయితే ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అన్నట్లు ఎక్కువయితే కొలెస్ట్రాల్ కూడా మంచిది కాదు. మనం కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలు తినకపోవయినప్పటికీ మన శరీరం నిత్యం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ను పెంచే పదార్థాలు తగ్గిస్తే చాలు.
ఇంతేనా... జీరో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, జీరో కార్బన్ హౌసెస్, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, జీరో పర్సంట్ వడ్డీలు... ఇవన్నీ మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో వింటున్నవే. సున్నాకి విలువలేదని ఎవరనగలరు.. ఇవన్నీ తెలిశాక.

ఉగాది శుభాకాంక్షలు




 

శనివారం, ఏప్రిల్ 2

ర్యాగింగ్

  
బిడియం మనకేలా

  ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వ అధికారులు, కళాశాల అధిపతులు ఎన్ని చర్యలు గైకొన్నా, ఫ్రెషర్స్ డే జరిపినా సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించినా, నిరోధక చర్యలు ఎన్నింటిని చేపట్టినా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల కాలంలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడిప్పుడే కొంత మార్పులు వస్తున్నా, ర్యాగింగ్ చేసిన విద్యార్థులు బలవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడంతో తీవ్ర చర్యలు చేపట్టాక రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకచోట్ల ర్యాగింగ్ సంఘటనలను కళాశాల యాజమాన్యం వెలుగు చూడనీయటం లేదు.
 
మారుతున్న కాలంతో పాటు ర్యాగింగ్ భయాన్ని కూడా పారద్రోలాల్సిన అవసరం ఉంది.
బెరుకు, బిడియం ఉన్నవాళ్ళు ఇంట్లోనైనా కలివిడిగా తిరగలేరు. అలాంటి వారు స్కూలు నుంచి కళాశాలలో ప్రవేశిస్తే అయో‘మయసభ’లో అడుగు పెట్టినట్టే. నిజానికి అయోమయమనేది మనలోనే గాని, మనం వెళ్ళిన ప్రదేశంలో లేదు. కొత్తవారు కనిపించేసరికి అప్పటికే ఏడాది కాలంగా పాతుకుపోయిన వారిలో తుంటరితనం ప్రవేశిస్తుంది. కొత్తవాళ్ళను ఆట పట్టించాలనే కొంటెతనం లోలోపల నుంచి తన్నుకొస్తుంది. ఆ కొంటెతనం శ్రుతి మించేసరికి ర్యాగింగ్ ఓ భూతమవుతుంది.
 
 
ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాల ప్రాంగణంలో బెరుకు బెరుకుగా ప్రవేశించిన జూనియర్లను తొలినాడు ర్యాగింగ్ భయపెడుతుంది. ర్యాగింగ్ పేరిట యుద్ధ ఖైదీలా వారిని చిత్రవిచిత్ర హింసకు గురిచేస్తారనే భయం ముందుగానే ఆవహిస్తుంది. తొలిపరిచయం ఆదరంగా, ఆప్యాయంగా ఉంటే దానిలోని మజాయే వేరుగా ఉంటుంది. అలాకాక కాస్తంత శ్రుతి మించినా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలెందుకీ ర్యాగింగ్? అన్న ప్రశ్న వేస్తే ... పరిచయం పెంచుకోవటానికని ఠక్కున సమాధానం వస్తుంది.
సాధారణంగా మన పక్కింట్లోకి ఎవరైనా కొత్తగా దిగితే పరిచయం చేసుకోవటం కోసం వారిని ఇబ్బందులకు గురిచేయం కదా! పైగా కొత్తకాబట్టి మన సహాయం ఏమైనా అవసరమేమోనని కొంచెం వాకబు చేస్తాం. అలాంటి ఉన్నత సంప్రదాయాలు అనుసరించే కుటుంబ వ్యవస్థ, ఔన్నత్యాన్ని ర్యాగింగ్ భూతం ఆవహించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థినీ విద్యార్థుల ఎందరి జీవితాలనో ఇది బలి తీసుకుంటుంది. తాము చెప్పినట్లు చేయలేదని ఆగ్రహించిన ర్యాగింగ్ రాక్షసులు కిరాతకంగా హత్య చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. సీనియర్లు కొత్తగా వచ్చిన సహ విద్యార్థిని ర్యాగింగ్ పేరిట వేధించటంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలెన్నో. ఇది సహజంగానే కొత్తగా కళాశాలలోకి అడుగుపెట్టే విద్యార్థులందర్నీ భయకంపితులను చేస్తుంది. సీనియర్ల వెకిలి చేష్టలకు, పెడపోకడలకు, అవమానకర వ్యాఖ్యలకు కుంగిపోతూనే వౌనంగా వేదనను అనుభవించే వారెందరో. తల్లిదండ్రులకు చెబుతామంటే వారిని బాధ పెట్టడం ఎందుకన్న ఆలోచనతో వెనక్కు తగ్గుతుంటారు. 
కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామంటే, ఆ కక్షతో మరింత వేధిస్తారని జంకుతుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరిగిన సంఘటనలు బహుకొద్ది. ఈ వేధింపులు భరించలేని సున్నిత హృదయాలు లక్షణమైన కోర్సుకు పుల్‌స్టాప్ పెట్టేసి, లక్ష్యంలేని ఏదో ఒక చదువుకు సిద్ధమైపోతున్నారు. మరికొందరైతే కాలేజీ చదువులకే స్వస్తి పలుకుతున్నారు.
ఒకప్పుడు కేవలం కొత్తవారితో మాట కలిపి వారికి కళాశాల వాతావరణాన్ని పరిచయం చాలనే సదుద్దేశంతో ఇది మొదలైంది. అప్పుడు సత్ఫలితాలే లభించాయి. బెరుకు, బిడియం వదిలి ఉజ్వల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకున్నారు. అయితే కాలానుగుణంగా ఆధునికమయి ర్యాగింగ్‌లో అనాగరిక లక్షణాలు కనిపించడం మొదలైంది. ఇది తీవ్రస్థాయిలో రూపుదాల్చి విషాద పరిణామాలు చోటుచేసుకున్న స్థితికి చేరుకుంది.
అలాగే కాలేజీలో కొత్తగా అడుగుపెట్టే అమ్మాయిలూ, అబ్బాయిలూ గుండెనిండా మనసును నిగ్రహించుకోవాలి. ర్యాగింగ్‌కు భయపడడం మొదలైతే మీసాటి అమ్మాయిలూ, అబ్బాయిలూ పరిసరాలు, పాఠాలు అన్ని మనతో ఆడుకుంటాయని గుర్తించి, ధైర్యంగా ముందుకు నడవండి. బెరుకు, బిడియం ఇంట్లోనే వదిలేసి కాలేజీలో హ్యాపీగా అడుగు పెట్టండి. ఆద్ ద బెస్ట్..

సుమవర్ణం.. హైడ్రాంజియా


 
 మనసుకోరే సుమవర్ణం..

పొద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. 

అది పొద్దుతిరుగుడు. పొద్దుతో పాటే రంగులూ మారిపోతే... 

- అది పత్తి మందార ఇంతవరకూ మనకు తెలిసిందే. 

ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం...

హైడ్రాంజియా


కానీ కొన్ని పూలు ఉన్నాయి. మీకు కావలసిన రంగుల్లో పూయించుకోవచ్చు. కొంత కాలం గులబీ రంగులో పూస్తే మరికొంత కాలం నీలి రంగులో... ఆపైన వంకాయ రంగు... ఇలా సప్తవర్ణాలు విరబూస్తాయి.
ఇదేం మ్యాజిక్ కాదు. ‘‘హైడ్రాంజియా’’ అనే మొక్క విరజిమ్మే రంగుల పూల కథ ఇది.
సృష్టికే అంచదాన్నిచ్చే పూబాలలు పలురకాలు. ఒక్కో పువ్వుదీ ఒక్కో అందం. ఒక్కో వర్ణం. ఒక్కో రూపం. కానీ ఒక్క పువ్వులోనే ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం... హైడ్రాంజియా.
నేలతీరుమారితే ఈ పూలరంగులు మారిపోతాయి. ఇవి ఎక్కువగా గులాబీ, తెలుపు, నీలి రంగుల్లో పూస్తుంటాయి. అయితే రంగు మాత్రం నేలలోని ఆమ్లక్షార గాఢతను బట్టి మారుతుంటుంది. అంటే ఆమ్లగుణం ఎక్కువగా ఉన్న నేలల్లో పెరిగేవి నీలిరంగు పుష్పం. క్షారగుణం కలిగిన నేలల్లో పెరిగేవి గులాబీ రంగు పుష్పాలన్నీ పూస్తాయి. రెండు గుణాలూ కలిగిన నేలల్లో వంకాయరంగులో పూస్తాయి. తెలుపు రంగు హైడ్రాంజియా మాత్రం ఏ నేలలో అయినా ధవళ కాంతుల్నే వెదజల్లుతుంది.

హైడ్రాంజియాల స్వస్థలం తూర్పు ఆసియాగా చెప్పవచ్చు. పెంపకం మాత్రం జపాన్‌లోనే ఎక్కువ. ఎందుకంటే వీటిని అక్కడ 150 సంవత్సరాల నుంచీ ఆర్నమెంటల్ మొక్కలుగా విరివిగా పెంచుతున్నారని పరిశీలనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇటీవల కాలంలో వీటిని బాగా పెంచుతున్నారు.
ఈతరం అమ్మాయిలు వీటిపై మోజుపడి కుండీల్లో చక్కగా పెంచడం మొదలు పెట్టారు. అతివలు ఇష్టపడే హైడ్రాంజియాలు నూరు వరహాలు లేదా గుత్తిపూల మాదిరిగా ఉంటాయి. వీటిల్లో పాకేవి ఉన్నాయి. హైడ్రాంజియాని ఫెన్సింగ్‌ల్లోనూ, గోడల మీద అల్లిస్తే ఆ అందమే వేరు.
ఏ రంగు కావాలి?

నేల తీరునుబట్టి రంగును మార్చే ఈ పూలలో ఉన్న చక్కని సౌలాభ్యం కోరుకున్న రంగులో వీటిని పూయించడమే. సున్నపు తేట లేదా అల్యూమినియం సల్ఫేట్లను నేలలో కలపడం ద్వారా దాని పీహెచ్ అంటే ఆమ్లక్షార గాఢతను పెంచడం, తగ్గించడం చూస్తే రంగును మార్చుకోవచ్చు.
సోడియం బైకార్పొరేట్‌ను తగిన మోతాదులో నేలలో కలిపితే హరివిల్లులోని సప్తవర్ణాన్ని పూలల్లో ఆవిష్కరించవచ్చు. నేలలోని సారం మారడమో లేదా మొక్కలలోనే మార్పులు రావడమో, కారణం ఏమిటన్నది? కచ్చితంగా తెలియదు కానీ ఈ మొక్క తన జీవితకాలం మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఒకటి, రెండేళ్ళపాటు ఆకుపచ్చ రంగులోనూ పుష్పిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే రంగులు దిద్దుకుంటుంది. అయితే ఆ సమయంలో కూడా ఎరుపుల వాడకం ద్వారా పూలరంగును మార్చుకోవచ్చు.
సహజ రంగులు

ఎరువుల ద్వారా మార్చేవి కొన్నయితే వీటిల్లో కొన్ని రకాలు వాటంతటవే రంగుల్ని మార్చుకుంటుంటాయి. ఏడు రంగుల్ని పుష్పించే మొక్కలూ ఉన్నాయి. హైడ్రాంజియాల్లో ఇంద్ర ధనస్సు పూలు కాంతుల్ని వెదజిమ్ముతాయి. కాగా ఏరకమైనా మొక్కను నాటిన ఏడాదికి ఆ వాతావరణానికి తగ్గట్టు హైడ్రాంజియా అలవాటుపడుతుంది. సాధారణంగా ఇవి గులాబీ, నీలిరంగు ఛాయల్లోనే పుష్పిస్తాయి. గులాబీ రంగు పూలు వద్దనుకుంటే నేలలో కాస్త అల్యూమినియం సల్ఫేట్‌ను కలిపితే చాలు నీలిరంగులో పూలు పూస్తాయి.
గులాబీ రంగులోనే పుష్పించాలీ అంటే.. ఆ మొక్క నేలలోని అల్యూమినియంను గ్రహించకూడదు. అందుకోసం చిన్నచిన్న చిట్కాల్ని ఉపయోగిస్తే సరి. తరచూ సున్నపు నీళ్ళను నేలలో కలపడంవల్ల అక్కడి పీహెచ్ శాతం పెరుగుతుంది. దాంతో పీల్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. మొక్కలో ఐరన్ లోపిస్తుంది. ఫలితంగా గులాబీ రంగులోనే పూలను పూస్తుంది.

నేల తీరు మాత్రమేకాక, కొన్ని సందర్భాల్లో వాతావరణం కూడా ఈ పూలరంగుల్ని ప్రభావితం చేస్తుంది. వేడి వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఎర్రని హైడ్రాంజియాల్ని పూయించడం సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ముదురు గులాబీ రంగు వరకూ ప్రయత్నించవచ్చు. దీనికి సంబంధించి మొక్క విత్తుల్ని కొనేటప్పుడు నర్సరీలు ఓ క్యాట్ ల్యాగ్‌ను కూడా ఇస్తున్నాయి. దాన్ని చూసి నేలలో ఎంత సున్నం కలపాలో నిర్ణయించుకోవచ్చు. సున్నం శాతం ఎక్కువయ్యే కొద్దీ ఎరువు శాతం పెరుగుతుంది. విభిన్న వర్ణాలే కాదు. త్వరగా వాడిపోని తాజాదనమూ వీటి సొంతం మొక్క నుంచి కోసిన ఈ రంగుల గుత్తుల్ని ఫ్లవర్ వేజ్‌లో పెడితే చాలాకాలం వాడకుండా ఉంటాయి.
సో... మీ వాకిట్లో ఏ రంగు హైడ్రాంజియాలు విరియాలన్నదీ వాటిని ఏ వర్ణంలోకి మార్చుకునేదీ అంతా మీ చేతుల్లోనే ఉంది మరి.

పెంపకం మనపైనే

మ్మా నాన్న దే అడుగు జాడ
 




‘‘వాళ్ల నానమ్మకి టాబ్లెట్ ఇమ్మని చెప్పినా ఆ టీవీ ముందు కూర్చుని కదలడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకంటే...‘నానమ్మనే తెచ్చుకోమను’ అని ఎదురు సమాధానం చెప్తాడు’’.
‘‘్ఫన్ వస్తే వంటింట్లోనుంచి ఎంత పనిలో ఉన్నా పరిగెత్తుకు రావాల్సిందే.
ఇంటి ముందు తలుపు తడుతున్నా, బెల్ మోగిస్తున్నా, కేకలు పెడుతున్నా పట్టించుకోరు. బంధుమిత్రులు ఇంటికొచ్చి పలకరించినా ‘హాయ్ ఆంటీ!’ అని ఒక నవ్వు నవ్వేసి వెళ్లిపోతారు. బాగున్నారా? అని కూడా అనరు. చివరికి అన్నం తింటూ వెక్కిళ్లు పెడుతున్నా... కాస్త మంచినీళ్లయినా ఇస్తామన్న ధ్యాసే పట్టదు పిల్లలకి’’
ఈ అనుభవాలు ఈ తరం తల్లిదండ్రులందరికీ. పిల్లల్లో ఒకరకమైన పట్టని తనం. ఇతరుల అవసరాలకు స్పందించని గుణం కనిపించి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి.
అయితే, ఇందుకు బాధ్యులు తల్లిదండ్రులే. చిన్న వయసులోనే పిల్లలకు మంచి చెడ్డలను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్న విషయాన్ని గుర్తించాలని మానసిక తత్వవేత్తలు కూడా అంటున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ! అన్నారు పెద్దలు. వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడమే మూల కారణం.
తల్లిదండ్రులు, బోధకులు, ఇరుగు పొరుగువారు సమా జం, మీడియా ఇవన్నీ కూడా చిన్నప్పటినుండి జ్ఞానాన్ని పెంచడానికి ఇచ్చే ప్రాధాన్యం, విలువల్ని నేర్పించడానికి ఇవ్వడంలేదు. రెండేళ్లకే ఎబిసిడిలు గుర్తించడానికి వీలయ్యే పుస్తకాలు, కంప్యూటర్లు వచ్చేయి కదా ఇప్పుడు సిడిలు, ఆరేళ్లనుంచే జికె పుస్తకాలు, సిడీలు వాళ్ల ముందు ఉంచుతున్నారు. సమాచారాన్ని వాళ్ల బుర్రలోకి ఎక్కిస్తున్నారు.
కానీ, పక్కవాడితో వీళ్ల ప్రవర్తన ఎలా ఉంది, తప్పుగా ఉంటే ఎలా సరిచేయాలి అన్న ఆలోచన మాత్రం చేయడంలేదు. తమ పిల్లలు దురుసుగా మాట్లాడినా, అవతలి వాడిని రంగు, ఎత్తు, సన్నం, లావు తదితర లక్షణాలను బట్టి హేళన చేసినా తల్లిదండ్రులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అందరూ ఇలా ఉంటారని కాదు. ఉంటున్న వారి సంఖ్య గతం కంటే పెరుగుతోందన్నది మాత్రం సత్యం. ఈ ధోరణి పిల్లలకు నష్టమే చేస్తుంది. వాళ్లు తరగతులలో మొదటి స్థానంలో ఉండగలరేమో కానీ మానవ సంబంధాలలో మాత్రం చివరి స్థానంలో ఉంటారు.
పక్కనున్న వారి సమస్యను అర్థం చేసుకోలేని వాళ్లు, పట్టించుకోలేని వాళ్లు ఇతరులతో కలిసి పనిచేయలేరు. అందుకే పిల్లల్లో మానవ సంబంధాలను ఏర్పరచాలి. చుట్టూ వున్నవారి పట్ల ప్రేమ, దయ పెరిగేలా చేయాలి. తోటిపిల్లల, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ఈ దిశగా తమ ప్రయత్నాలను ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. పిల్లల వయసుకు తగినట్టుగా తల్లిదండ్రులు కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాలి.
ఐదేళ్ల లోపు పిల్లలకు..
నడక నేర్చుకునే వయసునుంచే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. తల్లిదండ్రులు వారిపట్ల ఎంత ప్రేమాభిమానంతో దయా గుణంతో వ్యవహరించగలిగితే అంత ఫలితం ఉంటుంది. వారు ఇతరులపట్ల కూడా తమలాగే ఉండగలుగుతారు. మీ పిల్లలని తమ బొమ్మల్ని తోటి పిల్లలకి ఆడుకోవడానికి ఇమ్మని ప్రోత్సహించండి. చివరికి నీ బొమ్మలు నువ్వు తీసేసుకోవచ్చు. కాసేపు ఆడుకోవడానికి ఇవ్వు...అంటే ఇవ్వడానికి ఎక్కువ మంది సిద్ధంగానే ఉంటారు. లేకపోయినా నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. ఇతరులను సంతోషపెట్టడంలో వచ్చే సంతృప్తి వారికి ఆ వయసులోనే అనుభవంలోకి రావడం ఎంతో మంచిది. జీవితాంతం పంచుకునే లక్షణాన్ని మిగుల్చుకోగలుగుతారు. మనుషుల మధ్య బంధం ఏర్పడడంలో, గట్టిపడడంలో పంచుకునే లక్షణం కీలకపాత్ర పోషిస్తుంది.
ఐదేళ్లనుంచి ఎనిమిదేళ్ల వయసు పిల్లలకు..
ఈ వయసు పిల్లలపై మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆపై వయసు కలిగిన వారిపై కూడా ఈ ప్రభావం పనిచేస్తుంది. అయితే అతి చిన్న వయసు పిల్లలకు టీవీలో చూసిన పాత్రల ప్రభావం, ప్రవర్తన తప్పనిసరిగా పడుతోంది. టీవీ కార్యక్రమాల ప్రభావం పిల్లలపై పడినట్టుగా మనస్తత్వ శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి వారికి అన్ని చానళ్లు అందుబాటులో ఉంచకూడదు. ప్రేమ, దయ, స్నేహం పంచుకోవడం వంటి లక్షణాలు పెంచే కథనాలను చూపించే కార్యక్రమాలను మాత్రమే పెట్టండి. కొన్ని వీడియో గేమ్స్ హింసను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. వాటికి దూరంగా ఉంచండి.
పనె్నండేళ్ల లోపు వయసు పిల్లలకు..
ఎనిమిదేళ్లనుంచి పనె్నండేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని మంచి పనులు చేసే దిశగా ప్రేరేపించాలి. తనకి నచ్చిన కళనో, ఆటనో సాధన చేయించాలి. దానిని ఇతరులకు కూడా నేర్పించమని ప్రోత్సహించాలి. అలా చేయడంవల్ల తన మీద తనకి విశ్వాసం కలగడంతోపాటు ఇతరులకు తెలియని నేర్పించడం, వారికి అండగా ఉండడం అలవాటవుతుంది. మీ పిల్లలకు కథలు చదవడం ఇష్టమనుకోండి. చదివిన కథలను ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చండి. అవసరాలలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం తోచిన ఆర్థిక సహాయం చేసేలా ప్రోత్సహించండి. బహుమతులుగానో, పాకెట్ మనీగానో పిల్లలకిచ్చే డబ్బును దాచుకోమని చెప్పండి. డబ్బును అవసరాలకు వినియోగించుకునేలా నేర్పండి. దయాగుణం, దానం నిరుపేదలకు నిస్సహాయులకు ఎంతగా ఉపయోగపడుతుందో పిల్లలకు వివరిస్తే మంచి పని చేసామన్న భావనతో పిల్లలు సంతృప్తిగా ఉంటారు.
టీనేజ్ పిల్లలకు..
ఈ వయసులో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రవర్తన, వేషధారణ తదితర విషయాల్లో తమ గ్రూపులో భాగంగానే ఉండాలన్న ఒత్తిడి తోటిపిల్లలనుంచి ఎదురవుతుంది. ఒక్కొక్కసారి దానివల్ల వారిలో దుఃఖం, అసహనం పెరగవచ్చు. నిర్లక్ష్యంగా ప్రవర్తించేలా వారిని మార్చొచ్చు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు సహనంగా వ్యవహరించాలి. వారిపట్ల మీకెంతో ప్రేముందని, ఏ సమస్యనైనా మీతో చెప్పుకోవచ్చునని తెలిసేలా ప్రవర్తించాలి. వారి సమస్యలను అంతేనా అన్నట్టు తీసి పడేయవద్దు. వారిని బాధపెట్టే ఏ సమస్యనైనా ప్రధానమైనదిగా భావించండి. సున్నితంగా వ్యవహరించండి. అపుడే వాళ్లు చుట్టూ ఉన్న వారిపట్ల సున్నితంగా ఉండగలుగుతారు. ఏ వయసులో వారినైనా వారు దుఃఖంలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకోవడానికి సందేహించవచ్చు. వాళ్లు ఎప్పటికీ మీ పిల్లలే. అంటే చిన్నపిల్లలుగానే భావించాలన్న మాట.
మీ పిల్లలు కాస్త కోపంగానో, మొండిగానో ప్రవర్తించినా సతాయించినా ఓర్పు పట్టండి. ఆ సమయంలో వారికేదైనా సమస్య ఉన్నా నిస్పృహకు గురైనా అలా ప్రవర్తించవద్దు. కాబట్టి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
అనారోగ్యంగా ఉన్న పెద్దలకు సాయం చేయడం తర్వాత తరాలవారి విధి అని తెలిసేలా చేయండి. అందుకు రోల్‌మోడల్‌గా మీరు నిలవండి. ఆర్థికంగానే కాదు శారీరకంగా మానసికంగా విజ్ఞానదాయకంగా ఎదుటివారికి సహాయపడే మనస్తత్వాన్ని కలిగించండి.