బిడియం మనకేలా
ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వ అధికారులు, కళాశాల అధిపతులు ఎన్ని చర్యలు గైకొన్నా, ఫ్రెషర్స్ డే జరిపినా సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించినా, నిరోధక చర్యలు ఎన్నింటిని చేపట్టినా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల కాలంలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడిప్పుడే కొంత మార్పులు వస్తున్నా, ర్యాగింగ్ చేసిన విద్యార్థులు బలవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడంతో తీవ్ర చర్యలు చేపట్టాక రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకచోట్ల ర్యాగింగ్ సంఘటనలను కళాశాల యాజమాన్యం వెలుగు చూడనీయటం లేదు.
మారుతున్న కాలంతో పాటు ర్యాగింగ్ భయాన్ని కూడా పారద్రోలాల్సిన అవసరం ఉంది.
బెరుకు, బిడియం ఉన్నవాళ్ళు ఇంట్లోనైనా కలివిడిగా తిరగలేరు. అలాంటి వారు స్కూలు నుంచి కళాశాలలో ప్రవేశిస్తే అయో‘మయసభ’లో అడుగు పెట్టినట్టే. నిజానికి అయోమయమనేది మనలోనే గాని, మనం వెళ్ళిన ప్రదేశంలో లేదు. కొత్తవారు కనిపించేసరికి అప్పటికే ఏడాది కాలంగా పాతుకుపోయిన వారిలో తుంటరితనం ప్రవేశిస్తుంది. కొత్తవాళ్ళను ఆట పట్టించాలనే కొంటెతనం లోలోపల నుంచి తన్నుకొస్తుంది. ఆ కొంటెతనం శ్రుతి మించేసరికి ర్యాగింగ్ ఓ భూతమవుతుంది.
ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాల ప్రాంగణంలో బెరుకు బెరుకుగా ప్రవేశించిన జూనియర్లను తొలినాడు ర్యాగింగ్ భయపెడుతుంది. ర్యాగింగ్ పేరిట యుద్ధ ఖైదీలా వారిని చిత్రవిచిత్ర హింసకు గురిచేస్తారనే భయం ముందుగానే ఆవహిస్తుంది. తొలిపరిచయం ఆదరంగా, ఆప్యాయంగా ఉంటే దానిలోని మజాయే వేరుగా ఉంటుంది. అలాకాక కాస్తంత శ్రుతి మించినా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలెందుకీ ర్యాగింగ్? అన్న ప్రశ్న వేస్తే ... పరిచయం పెంచుకోవటానికని ఠక్కున సమాధానం వస్తుంది.
సాధారణంగా మన పక్కింట్లోకి ఎవరైనా కొత్తగా దిగితే పరిచయం చేసుకోవటం కోసం వారిని ఇబ్బందులకు గురిచేయం కదా! పైగా కొత్తకాబట్టి మన సహాయం ఏమైనా అవసరమేమోనని కొంచెం వాకబు చేస్తాం. అలాంటి ఉన్నత సంప్రదాయాలు అనుసరించే కుటుంబ వ్యవస్థ, ఔన్నత్యాన్ని ర్యాగింగ్ భూతం ఆవహించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థినీ విద్యార్థుల ఎందరి జీవితాలనో ఇది బలి తీసుకుంటుంది. తాము చెప్పినట్లు చేయలేదని ఆగ్రహించిన ర్యాగింగ్ రాక్షసులు కిరాతకంగా హత్య చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. సీనియర్లు కొత్తగా వచ్చిన సహ విద్యార్థిని ర్యాగింగ్ పేరిట వేధించటంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలెన్నో. ఇది సహజంగానే కొత్తగా కళాశాలలోకి అడుగుపెట్టే విద్యార్థులందర్నీ భయకంపితులను చేస్తుంది. సీనియర్ల వెకిలి చేష్టలకు, పెడపోకడలకు, అవమానకర వ్యాఖ్యలకు కుంగిపోతూనే వౌనంగా వేదనను అనుభవించే వారెందరో. తల్లిదండ్రులకు చెబుతామంటే వారిని బాధ పెట్టడం ఎందుకన్న ఆలోచనతో వెనక్కు తగ్గుతుంటారు.
కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామంటే, ఆ కక్షతో మరింత వేధిస్తారని జంకుతుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరిగిన సంఘటనలు బహుకొద్ది. ఈ వేధింపులు భరించలేని సున్నిత హృదయాలు లక్షణమైన కోర్సుకు పుల్‌స్టాప్ పెట్టేసి, లక్ష్యంలేని ఏదో ఒక చదువుకు సిద్ధమైపోతున్నారు. మరికొందరైతే కాలేజీ చదువులకే స్వస్తి పలుకుతున్నారు.
ఒకప్పుడు కేవలం కొత్తవారితో మాట కలిపి వారికి కళాశాల వాతావరణాన్ని పరిచయం చాలనే సదుద్దేశంతో ఇది మొదలైంది. అప్పుడు సత్ఫలితాలే లభించాయి. బెరుకు, బిడియం వదిలి ఉజ్వల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకున్నారు. అయితే కాలానుగుణంగా ఆధునికమయి ర్యాగింగ్‌లో అనాగరిక లక్షణాలు కనిపించడం మొదలైంది. ఇది తీవ్రస్థాయిలో రూపుదాల్చి విషాద పరిణామాలు చోటుచేసుకున్న స్థితికి చేరుకుంది.
అలాగే కాలేజీలో కొత్తగా అడుగుపెట్టే అమ్మాయిలూ, అబ్బాయిలూ గుండెనిండా మనసును నిగ్రహించుకోవాలి. ర్యాగింగ్‌కు భయపడడం మొదలైతే మీసాటి అమ్మాయిలూ, అబ్బాయిలూ పరిసరాలు, పాఠాలు అన్ని మనతో ఆడుకుంటాయని గుర్తించి, ధైర్యంగా ముందుకు నడవండి. బెరుకు, బిడియం ఇంట్లోనే వదిలేసి కాలేజీలో హ్యాపీగా అడుగు పెట్టండి. ఆద్ ద బెస్ట్..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి