పొద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది.
అది పొద్దుతిరుగుడు. పొద్దుతో పాటే రంగులూ మారిపోతే...
- అది పత్తి మందార ఇంతవరకూ మనకు తెలిసిందే.
ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం...
హైడ్రాంజియా
కానీ కొన్ని పూలు ఉన్నాయి. మీకు కావలసిన రంగుల్లో పూయించుకోవచ్చు. కొంత కాలం గులబీ రంగులో పూస్తే మరికొంత కాలం నీలి రంగులో... ఆపైన వంకాయ రంగు... ఇలా సప్తవర్ణాలు విరబూస్తాయి.
ఇదేం మ్యాజిక్ కాదు. ‘‘హైడ్రాంజియా’’ అనే మొక్క విరజిమ్మే రంగుల పూల కథ ఇది.
సృష్టికే అంచదాన్నిచ్చే పూబాలలు పలురకాలు. ఒక్కో పువ్వుదీ ఒక్కో అందం. ఒక్కో వర్ణం. ఒక్కో రూపం. కానీ ఒక్క పువ్వులోనే ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం... హైడ్రాంజియా.
నేలతీరుమారితే ఈ పూలరంగులు మారిపోతాయి. ఇవి ఎక్కువగా గులాబీ, తెలుపు, నీలి రంగుల్లో పూస్తుంటాయి. అయితే రంగు మాత్రం నేలలోని ఆమ్లక్షార గాఢతను బట్టి మారుతుంటుంది. అంటే ఆమ్లగుణం ఎక్కువగా ఉన్న నేలల్లో పెరిగేవి నీలిరంగు పుష్పం. క్షారగుణం కలిగిన నేలల్లో పెరిగేవి గులాబీ రంగు పుష్పాలన్నీ పూస్తాయి. రెండు గుణాలూ కలిగిన నేలల్లో వంకాయరంగులో పూస్తాయి. తెలుపు రంగు హైడ్రాంజియా మాత్రం ఏ నేలలో అయినా ధవళ కాంతుల్నే వెదజల్లుతుంది.

హైడ్రాంజియాల స్వస్థలం తూర్పు ఆసియాగా చెప్పవచ్చు. పెంపకం మాత్రం జపాన్‌లోనే ఎక్కువ. ఎందుకంటే వీటిని అక్కడ 150 సంవత్సరాల నుంచీ ఆర్నమెంటల్ మొక్కలుగా విరివిగా పెంచుతున్నారని పరిశీలనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇటీవల కాలంలో వీటిని బాగా పెంచుతున్నారు.
ఈతరం అమ్మాయిలు వీటిపై మోజుపడి కుండీల్లో చక్కగా పెంచడం మొదలు పెట్టారు. అతివలు ఇష్టపడే హైడ్రాంజియాలు నూరు వరహాలు లేదా గుత్తిపూల మాదిరిగా ఉంటాయి. వీటిల్లో పాకేవి ఉన్నాయి. హైడ్రాంజియాని ఫెన్సింగ్‌ల్లోనూ, గోడల మీద అల్లిస్తే ఆ అందమే వేరు.
ఏ రంగు కావాలి?
నేల తీరునుబట్టి రంగును మార్చే ఈ పూలలో ఉన్న చక్కని సౌలాభ్యం కోరుకున్న రంగులో వీటిని పూయించడమే. సున్నపు తేట లేదా అల్యూమినియం సల్ఫేట్లను నేలలో కలపడం ద్వారా దాని పీహెచ్ అంటే ఆమ్లక్షార గాఢతను పెంచడం, తగ్గించడం చూస్తే రంగును మార్చుకోవచ్చు.
సోడియం బైకార్పొరేట్‌ను తగిన మోతాదులో నేలలో కలిపితే హరివిల్లులోని సప్తవర్ణాన్ని పూలల్లో ఆవిష్కరించవచ్చు. నేలలోని సారం మారడమో లేదా మొక్కలలోనే మార్పులు రావడమో, కారణం ఏమిటన్నది? కచ్చితంగా తెలియదు కానీ ఈ మొక్క తన జీవితకాలం మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఒకటి, రెండేళ్ళపాటు ఆకుపచ్చ రంగులోనూ పుష్పిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే రంగులు దిద్దుకుంటుంది. అయితే ఆ సమయంలో కూడా ఎరుపుల వాడకం ద్వారా పూలరంగును మార్చుకోవచ్చు.
సహజ రంగులు
ఎరువుల ద్వారా మార్చేవి కొన్నయితే వీటిల్లో కొన్ని రకాలు వాటంతటవే రంగుల్ని మార్చుకుంటుంటాయి. ఏడు రంగుల్ని పుష్పించే మొక్కలూ ఉన్నాయి. హైడ్రాంజియాల్లో ఇంద్ర ధనస్సు పూలు కాంతుల్ని వెదజిమ్ముతాయి. కాగా ఏరకమైనా మొక్కను నాటిన ఏడాదికి ఆ వాతావరణానికి తగ్గట్టు హైడ్రాంజియా అలవాటుపడుతుంది. సాధారణంగా ఇవి గులాబీ, నీలిరంగు ఛాయల్లోనే పుష్పిస్తాయి. గులాబీ రంగు పూలు వద్దనుకుంటే నేలలో కాస్త అల్యూమినియం సల్ఫేట్‌ను కలిపితే చాలు నీలిరంగులో పూలు పూస్తాయి.
గులాబీ రంగులోనే పుష్పించాలీ అంటే.. ఆ మొక్క నేలలోని అల్యూమినియంను గ్రహించకూడదు. అందుకోసం చిన్నచిన్న చిట్కాల్ని ఉపయోగిస్తే సరి. తరచూ సున్నపు నీళ్ళను నేలలో కలపడంవల్ల అక్కడి పీహెచ్ శాతం పెరుగుతుంది. దాంతో పీల్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. మొక్కలో ఐరన్ లోపిస్తుంది. ఫలితంగా గులాబీ రంగులోనే పూలను పూస్తుంది.
నేల తీరు మాత్రమేకాక, కొన్ని సందర్భాల్లో వాతావరణం కూడా ఈ పూలరంగుల్ని ప్రభావితం చేస్తుంది. వేడి వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఎర్రని హైడ్రాంజియాల్ని పూయించడం సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ముదురు గులాబీ రంగు వరకూ ప్రయత్నించవచ్చు. దీనికి సంబంధించి మొక్క విత్తుల్ని కొనేటప్పుడు నర్సరీలు ఓ క్యాట్ ల్యాగ్‌ను కూడా ఇస్తున్నాయి. దాన్ని చూసి నేలలో ఎంత సున్నం కలపాలో నిర్ణయించుకోవచ్చు. సున్నం శాతం ఎక్కువయ్యే కొద్దీ ఎరువు శాతం పెరుగుతుంది. విభిన్న వర్ణాలే కాదు. త్వరగా వాడిపోని తాజాదనమూ వీటి సొంతం మొక్క నుంచి కోసిన ఈ రంగుల గుత్తుల్ని ఫ్లవర్ వేజ్‌లో పెడితే చాలాకాలం వాడకుండా ఉంటాయి.
సో... మీ వాకిట్లో ఏ రంగు హైడ్రాంజియాలు విరియాలన్నదీ వాటిని ఏ వర్ణంలోకి మార్చుకునేదీ అంతా మీ చేతుల్లోనే ఉంది మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి