చంద్రబింబంలాంటి ముఖం... తామర తూడుల్లాంటి చేతులు... పద్మాల వంటి పాదాలు... కలువల వంటి కళ్ళు... సంపెంగలాంటి నాసిక... ఇలా ఎన్నో రకాలుగా స్ర్తిలను కవులు వర్ణిస్తూ ఉంటారు.
నేటి ఆధునిక స్ర్తిలు బ్యూటీ పార్లర్లపై ఎక్కువమోజు చూపిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో కేవలం ముఖం, జుట్టు వరకే శ్రద్ధ వహించేవారు. కాని ఇపుడు అంతే ప్రాముఖ్యం చేతులకి, పాదాలకి కూడా ఇస్తున్నారు. చేతులకి వాక్సింగ్ లాంటివి చేయించుకొని క్రీమ్స్ మసాజ్ చేసి, గోళ్ళు శుభ్రం చేసుకొని నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు. అరచేతికి అందంగా గోరింటాకు రకరకాలుగా డిజైన్లు పెట్టుకుంటున్నారు. భగవంతుడు స్ర్తిలకి చేతులు అందాల అలంకరణకు ఇచ్చాడా అన్నంతగా వ్రేళ్ళని, ముంజేతిని బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు.
కానీ, ఈ చేతుల ప్రత్యేకత ఇంతవరకే కాదు.. ఇంకా ఎంతో ప్రతిభాన్వితమైన మహత్తులు గలవి ఈ చేతులచేతలు. అనేక వందల మాటలు కలిగించనటువంటి ఒక మంచిభావాన్ని ఒక్కసారి ఆ బంగారు గాజుల చేతుల్తో తాకితే కలిగించవచ్చు. అంతటి మహత్తరమైన శక్తి గాజుల చేతికుంది.
తల్లి బిడ్డ తలపై చేయి వుంచి కొంతసేపు తలనిమిరితే అది పిల్లలకిచ్చే ఆనందం అనేక మాటలతో ప్రేమ వొలకపోస్తూ చెప్పినా ఇవ్వదు.
భార్యాభర్తలుగాని, స్నేహితులు గాని, ప్రేమికులు గాని ఎవరైనా సరే మాటలతో అభిమానం కురిపించే కన్నా ఒక్కసారి వారి భుజం మీద చేయి వేస్తే చాలు.. మాటలు బయటపెట్టలేని ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. ప్రేమాభిమానములు మానవులకి మానసిక సంతోషాన్ని, శక్తిని ఇస్తుంది.
అమితమైన ప్రేమ ఉన్నంతలో లాభం లేదు. అది ఎవరికి ఉద్దేశించబడిందో వారికి తెలిసేలా చేసినపుడే సార్థకత లభిస్తుంది. అందుకు ఈ బంగారు చేయి ఎంతో సాయపడుతుంది.
మెడిసిన్‌లా చేతి స్పర్శ.. చాలామంది తల్లులు పిల్లల్ని ఊరికే కొడుతూ ఉంటారు. పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి కోపాన్ని ప్రదర్శించటం లేక దండించటం జరిగిన తరువాత వారితో ప్రేమగా మాట్లాడినంతలో సరిపోదు. క్షమించినట్లు వారికి తెలిసేలా.. వారిని మన చేతుల్లోకి తీసుకొన్నపుడు, తలను నిమిరినపుడు దండన సత్ఫలితాలు కనబడతాయి. వారిలోని భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి.
ఒక్క దండన మాత్రమే చూపే పెద్దల యందు భయం తప్ప చిన్నారికి ప్రేమాభిమానాలు ఏ మాత్రం ఉండవు. కాబట్టి దండనతో పాటు ప్రేమగా చేతులతో దగ్గరకు తీసుకోవడం అవసరం. మానవ సంబంధాలకు చేతలను ఉపయోగించుకోవటం తెలుసుకుంటే వాటికున్న శక్తి ఇట్టే అర్థమవుతుంది. సులభంగా పని సార్థకం కావాలంటే చేయి స్పర్శ అద్భుతంగా మెడిసిన్‌లా పనిచేస్తుంది.
‘‘చేతికి గాజులందము, చెంపకు సిగ్గులందము’’ అని స్ర్తిని ఓ కవి వర్ణించాడు. అయితే ఆ గాజుల చేయి పురుషునికి ఆనందం అయితే బిడ్డకి ఆత్మీయత. స్ర్తిలు రకరకాల ఇంటి పన్లు చేతులతోనే చేయాల్సి ఉంటుంది. కనుక ఆ చేతులు వాటి నాజూకుతనాన్ని కోల్పోతాయి. తిరిగి అవి అందాన్ని సంతరించుకొనేందుకు అలంకరణ సామగ్రి ఉపయోగిస్తున్నారు. అలాగే పిల్లల్ని దండించే చేతుల్తోనే వారిని లాలించటం కూడా స్ర్తికి వెన్నతో పెట్టిన విద్య.
పురుషుని చేతి స్పర్శకంటే మృదువైన స్ర్తి చేతి స్పర్శకి స్పందన ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు సైతం తేల్చి చెపుతున్నారు. పిల్లల్ని ఎక్కువగా లాలించేది స్ర్తియే. తల్లి పిల్లల్ని అక్కున చేర్చుకుంటే ఆ పసి హృదయాలు అన్ని మరచిపోతారు. పురుషుడు తన్మయం చెందుతాడు. స్ర్తి చేతికి అంత శక్తి ఉంది మరి. చేతి వేళ్ళనుంచి ప్రకృతి సిద్ధం అయిన దివ్యశక్తి బయటకు ప్రవహిస్తుందని మానసిక శాస్త్ర ఆధారాలు కూడా ఉన్నాయి. కెనెల్‌వర్తు అనే మానసిక శాస్తవ్రేత్త ఇలా వ్రాశాడు. ‘‘మానవుని మించిన దివ్య శక్తి లేదు. ప్రకృతిలో మానవుడే ఒక దివ్యశక్తి పైకి కనబడే మానవుడు కాదు, అతని అంతఃకరణ. ఆ అంతఃకరణ అతని చేతల ద్వారా వ్యక్తం అవుతుంది. ప్రకృతిలో స్ర్తి - పురుషుడి కంటే ప్రేమకి, త్యాగానికి, ఓర్పుకి ప్రతీక. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. అంటే ఆ స్ర్తి చేతి నేర్పుని బట్టి ఇల్లు అలంకరణ, పిల్ల పెంపకం, ఓర్పు, నేర్పు, కుటుంబ గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు... అన్నీ ఇమిడి ఉంటాయి. ఆమె ప్రేమతో పిల్లల్ని చేరదీసి బుజ్జగింపుతో వారిని నేర్పులుగా, విద్యావంతులుగా మలుస్తుంది. మంచి నడవడి నేర్పిస్తుంది. భర్తకు సుఖ సంతోషాల్లో మహిళ పాలుపంచుకుంటోంది. అందరికీ అండగా నిలిచే గాజుల చేతులకి సాధ్యంకానిదంటూ ఏమీ లేదు.

-కంసుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి