అమ్మ అనిపించుకున్నప్పుడే స్ర్తి జన్మకు సార్థకత. దానికోసం ప్రతి స్ర్తి తపిస్తుంది, తపస్సు చేస్తుంది. కాని అమ్మ పడే ప్రసవ వేదన ఆమెకు మరో జన్మతో సమానం. అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను నిర్ణయించుకున్న ముహూర్తానికే బిడ్డను కనాలని 3సిజేరియన్2కి సైతం సిద్ధపడుతుంది. మంచి ఘడియల్లో పుట్టే బిడ్డ మంచి పేరు తీసుకువస్తాడని ఆరాటపడుతుంది. ప్రస్తుతం 65 శాతం మంది సిజేరియన్‌ల గాటుకి గురికాబడే బిడ్డకు జన్మనిస్తున్నారు. దీనికి కారణం డాక్టర్లు అని కొందరంటే, గర్భం ధరించిన తరువాత జాగ్రత్తలు తీసుకోకపోవడమని మరికొందరంటారు. ఏదేమైనా సిజేరియన్ పడనిదే బిడ్డ బయట ప్రపంచాన్ని చూడడంలేదు. ఈ పరంపరలో తల్లీ బిడ్డలకు లేదా ఎవరికో ఒకరికి ప్రమాదం ఏర్పడే సందర్భాలు లేకపోలేదు. అలాంటప్పుడు హాస్పిటల్‌పై పేషెంట్ బాధితులు దాడి చేయడం కూడా జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అతిగా అభివృద్ధి చెందడంవలన మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుందనడంలో సందేహమే లేదు. పిండదశలోనే ఆడపిల్లలు హత్యకు గురైపోతున్నారంటే (భ్రూణహత్యలు) దానికి కారణం స్కానింగ్ ప్రక్రియ. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా అమలులో మాత్రం అంతంత మాత్రంగానే వున్నాయి. పుట్టే బిడ్డ సంగతి ముందే తెలిసిపోవడంతో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన సిజేరియన్‌ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. స్ర్తి గర్భం ధరించిన నాటినుండి సరైన పోషకాహారంతోపాటు గైనకాలజిస్టు సలహాతో ఎక్సర్‌సైజులు చేస్తే సులభమైన ప్రసవాన్ని పొందవచ్చును. ఇంతకుముందు ప్రసవాలన్నీ మంత్రసాని సహాయంతోనే జరిగేవి. సిజేరియన్ అంటే 3హమ్మో!2 అనేవారు. దానికి కారణం ఆ రోజుల్లో ప్రసవానికి ముందు తరువాత తీసుకునే ఆహారంతోపాటు గర్భం దాల్చినప్పటికీ సాధారణ స్ర్తిలాగే పనిపాటలు చేసుకోవడం జరిగేది. వీటివలన గంపెడు పిల్లలనైనా కత్తిగాటు పడకుండా కనేసేవారు.
ఇప్పుడు ఆహారపు అలవాట్లు, వాడే మందుల ప్రభావం, అతి జాగ్రత్తవలన డాక్టర్ పెట్టిన ముహూర్తానికే ప్రసవం జరుగుతుంది. ప్రసవ తేదీని ముందుగానే నిర్ణయించిన డాక్టర్ ఆ సమయానికి సిజేరియన్ చేసేసి బిడ్డను బయటపడేస్తున్నాడు. స్ర్తిలు కూడా మంచి ఘడియలు, నక్షత్రం, రోజు చూసుకుని మరీ సిజేరియన్‌కి సిద్ధపడుతున్నారు. అంతేకాక సిజేరియన్ మార్క్స్ పడకుండా వుండడానికి స్టిక్కరింగ్‌టైపు సిజేరియన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేటి స్ర్తిలు ప్రసవంవలన తన పొత్తికడుపు సౌందర్యం దెబ్బతినకూడదని భావిస్తున్నారు. ఆరోగ్య పరిశోధనల్లో సిజేరియన్ వలన అటు బిడ్డకు ఇటు తల్లికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని తెలిసినా నేటి తల్లికి ఈ గాటు తప్పడంలేదు. సిజేరియన్‌లు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పాలిట కల్పవృక్షమే.
మరి ఈ రోజుల్లో కూడా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయంటే దానికి కారణం గర్భిణీ స్ర్తిల ఆహారపు అలవాట్లు, దైనందిన కార్యకలాపాల పట్ల చురుకుగా పాల్గొనడమే. సంచార జీవులు, పేదవారిలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు వస్తున్నాయంటే కారణం ఇదే. సుఖ ప్రసవానికి సౌకర్యాలకంటే సాధారణ ప్రవర్తనే ముఖ్యం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి