‘తనయుని వీరునిగా తీర్చే తల్లిగా పుట్టించెను ఆ దేవుడు తనకు మారుగా’ అన్నాడో కవి. కుమారుణ్ణి వీరునిగా తీర్చేందుకు తల్లికి అన్ని విద్యలూ రాకపోయినా వాటిని గురించిన పరిజ్ఞానం అంతో ఇంతో ఉండాలి. ఇప్పుడు మాడ్రన్ మామ్‌లు అందుకే అన్నింటిని గురించి తెలుసుకుంటున్నారు. కాలానుగుణంగా మారుతున్నారు. ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ తరం. అందుకే మాడ్రన్ మామ్‌లు డిజి మామ్‌లవుతున్నారు. రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ తరం తల్లుల జీవనం కూడా పరివర్తన చెందుతోంది. జీవన విధానం మారుతోంది. పిల్లల్ని పెంచే పద్ధతీ మారుతోంది.
దంపతుల మధ్య పిల్లల రాకడ తల్లులను బిజీ చేస్తోంది. అయితే ఆధునిక ఉపకరణాలను, సాధనాలను ఉపయోగించడం వల్ల జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. మనం అట్టలపై ఫోటోలు అతికించే రోజుల నుంచి డిజిటల్ ఫోటోల స్థాయికి ఎదిగాం. పిల్లల పెంపకమైనా, షాపింగ్ కోసమైనా, సోషల్ నెట్‌వర్కింగ్ కోసమైనా ఇప్పుడు భారతీయ మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో చాలామంది ఆధునిక మహిళలను ప్రశ్నించగా ఇంటర్నెట్ ఇప్పుడు తమ జీవితంలో భాగమైందని చెప్పారు. దాదాపు సగం మంది గత నెలరోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేసినట్లు వెల్లడించారు. తమ తీరిక సమయంలో సగంకన్నా ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా పనులు చేసుకోవడానికి గాని, చదవడానికి గాని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు బ్రౌజింగ్ తమ హాబీగా మారిందని చెప్పిన వారూ ఉన్నారు. సింగపూర్, హాంకాంగ్, చైనా, కొరియాలతో పోల్చినప్పుడు భారత్‌లో గృహిణులు ఇంటర్నెట్ వినియోగించడం తక్కువే. అయితే మంచి బ్రాండ్ల గురించి, కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే బ్రౌజింగ్ తప్పనిసరి అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా డిజి మామ్‌లు చేస్తున్న పనే మీరూ చేయవచ్చు. ఇందుకు సరైన ఉపకరణాల వాడకం తప్పనిసరి. మంచి ఫోన్ వాడాలి. ఇప్పుడు సరికొత్త ఫోన్లతో సులభంగా, సత్వరంగా మెయిల్ చెక్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ వాడకమే కాక ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం నేర్చుకుంటే పిల్లలు అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వవచ్చు. ‘అమ్మా.. ఆక్టోపస్ అంటే ఏమిటి?’ ‘స్పేస్ షటిల్ ఎలా ఉంటుంది?’ ‘నువ్వు హిమాలయాలు చూశావా?’ వంటి ప్రశ్నలకు మీరు ఠకీమని బదులివ్వవచ్చు. మీరు ఏదో రైల్వేస్టేషన్‌లో ఉన్నారు. రైలు ఆలస్యమైంది. పిల్లలు సతాయిస్తున్నారు. అప్పుడు మీ ఫోన్‌లో వారికి ఇష్టమైన మంచి వీడియో క్లిప్పింగ్ ప్లే చేయండి. వెంటనే చిరునవ్వులు చిందిస్తారు. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు, ఫ్లిప్ కెమెరాలు రావడంతోప్రతి నెలా వందల సంఖ్యలో ఫోటోలు తీస్తుంటాం. వాటిని ఓ క్రమపద్ధతిలో ఫోల్డర్లుగా అమర్చుకుంటే ఎవరికైనా చూపడానికి, బంధువులకు మెయిల్ చేయడానికి అనువుగా ఉంటాయి. ఫొటోషేరింగ్ సైట్లు ఫ్లిక్కర్, పికాసా, కోడక్ గ్యాలరీలో అప్‌లోడ్ చేయడం ద్వారా బంధువులకు సులభంగా పంపవచ్చు. ఫ్లయ్ లేడీ డాట్ నెట్‌లో ఇచ్చే సూచనలు ఇంట్లో వస్తువులను ఓ క్రమపద్ధతిలో ఉంచుకునేందుకు తోడ్పడుతాయి. ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న డిజిటల్ వీడియో రికార్డర్‌తో పిల్లలు టీవీ చూసే సమయాన్ని తగ్గించవచ్చు. మంచి కార్యక్రమాలను, పిల్లలు ఇష్టపడే ప్రోగ్రామ్‌లను దానితో రికార్డు చేసి చూపవచ్చు. ఇక తల్లులు కాబోయే వారు గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లల పెంపకం గురించి తెలుసుకోవడానికి బోలెడు సైట్లు ఉన్నాయి.
కొనే్నళ్ళలో ఇంటర్నెట్ నిత్యావసర వస్తువుగా మారుతోందనే అభిప్రాయాన్ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి సంస్థ నివేదికలో పేర్కొన్నారు. డిజి మామ్‌లు పెరగడం వల్ల వారికి, వారి కుటుంబానికే కాక వ్యాపారవర్గాలకు కూడా లాభమే. వారు ఆన్‌లైన్ షాపింగ్ చేయడమే కాక తమ ఉత్పత్తులకు ఆన్‌లైన్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా పని చేస్తారని ఓ వాణిజ్య ప్రముఖుడు తెలిపారు. సో త్రీ చీర్స్ టు డిజి మామ్స్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి