ఈనాటి నూతన దంపతులలో పెళ్లి అయి ఏడెనిమిది ఏళ్లు అయినా ఇంకా సంతానం కలగకుండా ఉన్న జంటలను మనం తరచుగానే, ముఖ్యంగా నగర ప్రాంతాలలోనే చూస్తూ వుంటాం. వారిలో ఎవ్వరైనా మనకు కొద్దిగా సన్నిహితులు అయితే వారేమైనా ‘్ఫమిలీ ప్లానింగ్’ పాటిస్తున్నారేమో. అందువల్లనే పిల్లలు కలగడం ఆలస్యం అయిందేమోనని భావిస్తూ- అయినా నిజమేమిటో వారి నోటినుండే తెలుసుకోవాలని ఉబలాటపడతాం. అయితే వారు చెప్పే సమాధానం మనకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘అబ్బే! ప్లానింగ్ ఏమీలేదండీ- ఎందుకనో ఇప్పటివరకూ పిల్లలు కలగలేదు, అంతే’ అన్నప్పుడు.
నిజానికి ఈ విస్తృత సమాజంలో వివాహం జరిగాక రెండు లేక మూడు సంవత్సరాలుగా తల్లి కాలేకపోతే అది ఆమెలోగానీ ఆమె భర్తలోగాని ఉన్న శారీరక లోపం ఏమోనని భావిస్తూ, నిర్థారిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనై ఎంతగానో కృంగిపోతూ ఉండడం జరుగుతుంది. అట్టి దంపతులు పొందే ఆవేదన అంతా ఇంతా అని చెప్పడానికి అలవికాకుండా ఉంటుంది.
ఇలా నూతన వివాహితులు మిగతా అందరిలాగా రెండు మూడేళ్లలోగా గర్భం ధరిచలేకపోవడానికి కారణాలు చాలా ఉండవచ్చు. వీటిలో అతి ముఖ్యమైన కారణం- వీరి భర్తలు హెచ్చు జీతాలమీద పెద్ద ఉద్యోగాలమీద తీవ్రమైన ఆశతో విశ్రాంతిని కోల్పోతూ హెచ్చుగంటలు ఉద్యోగ బాధ్యతలూ అదనపు బాధ్యతలూ నిర్వరిస్తూ ఉండడం. ఇంటికి వచ్చేసరికి శారీరకంగానూ మానసికంగానూ అలసిపోతూ ఉండడం. కొన్ని సందర్భాలలో పని ఒత్తిడికి తట్టుకోవడానికై ధూమపానం చేస్తూ ఉండడం, మద్యం సేవిస్తూ ఉండడం. అలాగే ఉద్యోగ బాధ్యతలతో విశ్రాంతి కోల్పోటం, స్ర్తిలకు గర్భాశయంలో లోపాలు ఏర్పడుట ఉండడం కూడా ఇందుకు కారణం అవుతుంది. వైద్య పరీక్షలు చేయించుకుంటే లోపం ఎక్కడ ఉన్నదో, ఎవరిలో ఉన్నదో సరిగా తెలుసుకొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇలా గర్భధారణలో లోపానికీ, జాప్యానికీ గురి అవుతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మేరకు ఉండవచ్చునని ప్రముఖ వైద్య సంస్థలు నిర్వహించిన సర్వేద్వారా తెలియవస్తున్నది.
స్ర్తిలకు 30 ఏళ్ల వయస్సుదాటిన తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ వయసులోగానీ సంతానం పొందే ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం అని ప్రాచీన సంప్రదాయాలవల్ల, వైద్య నిపుణుల సలహాలవల్లా తెలియవస్తున్నది.
ఇలా సంతానాన్ని పొందలేకపోతే మాత్రం ఇకపై ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనేక సాంప్రదాయిక, మానసిక ఒత్తిడుల కారణంగా, క్షీణించక తప్పని పరిస్థితి ఏర్పడి, ఇందుకు కారణం ఎదుటివారిలోని శారీరక, మానసిక లోపాలను భార్యాభర్తలు పరస్పరం నిందించుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనడం జరుగుతూ ఉంటుంది.
ఈ పరిస్థితి రాకుండా నిరోధించేందుకు మార్గాలు మనకు చాలానే కావస్తాయి. మనం, అంటే భార్యాభర్తలు, ఈ గర్భధారణకు, సంతాన ప్రాప్తికి అవరోధం కలిగించే ఏయే పనులు చేస్తున్నారో, వాటిని స్వయంగా పరిశోధించి తెలుసుకుని ఆ లోపాలు సమూలంగా తొలగించివేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం- మొట్టమొదటగా చేయవలసిన పని. ఇక తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో పరిశీలిద్దాం.
-స్ర్తి గర్భధారణ కార్యక్రమం అంతా పురుషుని వీర్యబలం మీదనే అతి హెచ్చుగా ఆధారపడి ఉంటుంది. మద్యపానం, ధూమపానం పురుష వీర్యాన్ని పలచబడేట్టు చేసి శక్తిలేకుండా చేస్తాయి కాబట్టి వాటిని ఎంత త్వరగా మానివేయగలిగితే అంత త్వరగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు.
-్భర్యాభర్తల మధ్య ప్రధానంగా పెరగవలసింది పరస్పర అనురాగం, సాంగత్యం. పిల్లలకోసమే దగ్గర కావడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. పరస్పరం శరీర సంపర్కాన్నిపొంది ఆనందించగల్గడం సహజమైన కార్యక్రమంగా మారాలి.
-్భర్యాభర్తలలో ఏ ఒక్కరూ విశ్రాంతి లేని రకరకాల పనులతో తలమునకలై ఉండిపోవడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రతి రోజులోను ఒకటి రెండు గంటలసేపు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా కాలం గడిపి ఆనందించే ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోవాలి.
-కొత్త దంపతులు మంచి సంతానం పొందడానికి ఉభయులూ మంచి ఆరోగ్యవంతులై ఉండడం తప్పనిసరి. వ్యాయామం, ఆసనాలు, యోగాలాంటి మంచి అలవాట్లు పాటించాలి.
-ఒక్కొక్కప్పుడు జన్యు సంబంధమైన అనే కారణాలవల్ల సంతానం కలగడం కొంత ఆలస్యం కావచ్చు. కాని అట్టి పరిస్థితులలో నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో తగు వైద్య చికిత్సలు పొందితే సత్ఫలితాలుంటాయి.
-్భర్యాభర్తలమధ్య పరస్పర శారీరక ఆకర్షణ, మానసిక అవగాహన లోపిస్తే ఇక వారి మధ్య పరస్పర అనురాగం, అనుబంధం, సుఖవంతమైన సహజీవనం సాధ్యం కావు. ఈ పరిస్థితులు ఎవరికివారు ఏవేవో అనవసర బాధ్యతలు నెత్తిన వేసుకోవడవంల్ల, ఏవేవో అర్థంలేని భయాలకు లోనవుతూ ఉండడంవల్ల ఎదురు అవుతుంటాయి. ఈ స్థితి నుండి బయటపడడానికి మార్గం- కాస్తంత నోటికీ, ముక్కుకూ చురుక్కుమనిపించే రెండు ఔషధ పదార్థాల వినియోగం. ఆ రెండు పదార్థాలూ ఏమిటంటే ఉల్లిపాయలు, అల్లం.
-్భర్యాభర్తలు తమ శరీరాలూ, ప్రవర్తన పరస్పర ఆకర్షణీయాలుగా ఉండేట్లు చేసుకొనడంలో తమ పడకగదిని అందంగా ఉండేట్లు అమర్చుకొనడం, మల్లెపూల సువాసన, గులాబీల ఆకర్షణ, అగరువత్తుల సుగంధం గుబాళింపు సెక్స్‌పట్ల ఆసక్తిని పెంచుతాయి. భార్యాభర్తలమధ్య పరస్పర స్నేహభావం, చనువు ఉండాలి. ఏవిషయంలోనైనా ఒకరికి కోపం వస్తే రెండవ వారు తగ్గిపోయి క్షమాపణ చెప్పుకోగలగాలి. భర్త పట్ల భార్యకు చనువు, సాన్నిహిత్యం ఏర్పడకపోతే సంతానం కలగడం కష్టం. కలిగినా ఆ సంతానం అదనపు బాధ్యతలకు, దుఃఖానికీ దారితీస్తుంది తప్ప సుఖాన్ని కలిగించదు. అందువల్ల పురుషుల అధికార దర్పాన్ని అదుపులో ఉంచుకొనడం అవసరం. అలాగే వీటికితోడు తగినంత విశ్రాంతి, నిద్రకూడా అవసరం.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నవారికి బలమైన, ఆనందకరమైన సంతానం కలుగుతుంది అని చెప్పడంలో సందేహం అక్కరలేదు.
అయితే సంతానం పొందడం, పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేయడం విషయంలో పురుషుని పాత్ర చాలా స్వల్పం. స్ర్తి పాత్ర చాలా అధికం కావడంవల్ల అసలు ఈ మాతృత్వం స్ర్తికి వరమా? శాపమా? అనే సందేహం చాలా మంది స్ర్తిలకే కాక పురుషులకు కూడా రావచ్చు.
నిజమే. గర్భధారణ జరిగిన నాటినుండి స్ర్తి తొమ్మిది నెలలపాటు పడే పాట్లు, ప్రసవకాలంలో పడే బాధ ఆ తర్వాత పిల్లలకు పాల్వివడం, వారి ఆలనా పాలనా- ఇదంతా ఒక మహాతపస్సు అని ఎవరైనా అంగీకరించవచ్చు.
అందువల్లనే ప్రతి వ్యక్తీ ‘అమ్మ’ ముందు తలవంచి ఆమె నుండి శుభాశీస్సులకై ఎదురుచూసే అసామాన్య పరిస్థితి, అనూహ్య గౌరవ స్థితి ఒక స్ర్తికి మాత్రమే లభిస్తున్నది. ‘తల్లి’కి మించిన దైవమే ఎక్కడా లేదని అందరూ విశ్వసించడం జరుగుతున్నది. ఈ అసామాన్య గౌరవ స్థితి వరమో, శాపమో స్ర్తిలే నిర్ణయించుకొనవలసి యున్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి