ఆడపిల్ల మీద అంత ప్రేమ మక్కువ ఉండటంతో తల్లి స్వార్థం కూడా ఉంది. ఆడపిల్ల ఎప్పటికైనా మరోఇంటికి వెళ్ళాల్సిందే. అంటే తన ఇంటినుంచి మంచిని తీసుకెళ్ళేదే అమ్మాయి. అత్తవారింట్లో ఆ అమ్మాయి ప్రవర్తనను బట్టి తల్లికి మంచి లేదా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తనకు మంచి పేరు తెచ్చేలా అమ్మాయిని పెంచాలనే ప్రయత్నంలో తల్లి కనిపిస్తుంది. పైగా ఆడపిల్లలకు తల్లిఅవసరం చాలా ఎక్కువ. జడ వేసుకోవడం, అలంకరించుకోవడం వంటి వాటికోసం ఆరంభంలో తల్లి మీద ఆధారపడతారు. ఆ తర్వాత తల్లి నుండి నేర్చుకుంటారు. వయస్సుతో శరీరంలో వచ్చే మార్పులు, వాటికి ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటివన్నీ తల్లి మాత్రమే చెప్పగలదు.అందుకే తల్లి ఆడపిల్లతో ఎక్కువ సమయం గడుపుతుంది. తల్లి, తన బిడ్డ ప్రతి కదలికను తెలుసుకుంటుంది.
టీనేజ్‌లోకి వచ్చేంతవరకు తల్లి చూపే ప్రేమ, ఆదరణ అందుకొనే అమ్మాయిలు ఆ తర్వాత తమకు తగినంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని తల్లిమీద ఫిర్యాదు చేయడం మొదలుపెడతారు. అంతకుముందువరకు తల్లి చెప్పిన జాగ్రత్తలు టీనేజ్ అమ్మాయిలకు అర్ధంపర్ధంలేని అంశాలుగా కనిపిస్తాయి. తనను ఇంకా చిన్నపిల్లలా చూడటం చిరాకుకలిగిస్తుంది. అప్పటివరకూ అమ్మ మాట ప్రకారం చిన్నవాడైన తమ్ముడ్ని తోడు తీసుకొని బయటకెళ్ళని అమ్మాయిలు టీనేజ్‌లోకి ప్రవేశించగానే ఇంట్లోవాళ్ళ తోడుతో బయటకు వెళ్ళడం ఏదో చిన్నతనంగా భావిస్తారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, సమయానికి ఇంటికి రావాలని, ఇంటి పనులు నేర్చుకోవాలని తల్లి చెప్పే ప్రతి మాట అర్ధంలేనిదిగా ఉండి చిరాకు తెప్పిస్తుంది. దీనితో అమ్మ చెప్పిన మాట వినకపోవడం, ఎదురు సమాధానం చెప్పడం ప్రారంభిస్తారు. అదుపు తప్పుతుందన్న భావం తల్లిలోనూ, తనమీద అనవసర అనుమానం పెంచుకుంటుందన్న ఆలోచన అమ్మాయిలోనూ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి కుటుంబ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తుంది. ఎంత త్వరగా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా అన్న ఆలోచన అమ్మాయిలో కలుగుతుంది. ఇంటి దగ్గర అందని ప్రేమ, ఆదరణ మరోచోట పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలోనే గాడి తప్పుతారు. ఇలాంటప్పుడు తల్లే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు చెడుమార్గంలో పయనిస్తున్నప్పుడు ప్రేమాభిమానంతో నచ్చచెబుతూ సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంది. అమ్మాయిని ఎప్పుడూ చిన్నపిల్లలానే చూడకూడదు. వారి వయస్సుకు తగ్గట్టు, సమాజం, వాతావరణం అనుగుణంగా నడుచుకోవాలి.
ఆడపిల్లలకే కాదు మగ పిల్లలు కూడా ఇంటి పనులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్న సమయం ఇది. మగవారికి అన్ని పనులు వచ్చినా నేటికీ ఇంటి బాధ్యత స్ర్తిలదే. వంట చేయడం, ఇంటిని చక్కదిద్దుకోవడం అనాదిగా వస్తున్నది. నిజానికి ఈ రెంటిమీది హక్కును వదులుకునేందుకు అమ్మాయిలు సిద్ధంకారు. కూతురుమీద తల్లిప్రేమ అవసరమే. అయితే గుడ్డి ప్రేమ కాకూడదు. తమ నిర్ణయమే నెత్తిన రుద్దే తల్లులకు ఆడపిల్లలు నెమ్మదిగా దూరం అవుతారని గ్రహించాలి. కూతురుకు నేర్పు, ఓర్పు నేర్పాల్సిన బాధ్యత తల్లిదే. వీటిల్లో కూతురు అండగా నిలవటం అవసరమే. అయితే ఆ అండ పరిధిని దాటి ఉండకూడదు.
ఒకసారి అమ్మాయి ప్రవర్తన గాడితప్పితే సరిదిద్దడం కష్టం. ఆడపిల్ల పెంపకంలోని లోపానికి తల్లినే తప్పుపడతారు. కాబట్టి తన బిడ్డ అని నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలంటే అన్నింటిలో పరిమితి అవసరం. నిజానికి ఆడపిల్లకు తల్లికి మించిన స్నేహితురాలు ఉండదు. ప్రతి విషయం మనసు విప్పి తల్లికి చెప్పుకుంటుంది. ఆ మాటలను బట్టి తల్లి ఎదుగుతున్న పిల్లలకు మార్గదర్శకం కావాలే గాని చేయి పట్టుకు నడిపించకూడదు. తల్లీకూతుళ్ళ బంధం ఒక తరహాకి చెందిందని చెప్పలేం. ఎన్నో అంశాలలో ఇద్దరికీ అవసరాలు ఉంటాయి. తల్లి కూడా తన కష్టాలను కూతురితోనే పంచుకోగలుగుతుంది. తల్లిని కుమారులు ఎంత ఆదరిస్తున్నా, కూతురు చూపించే ప్రేమానురాగాలకు ముగ్ధురాలవుతుంది. అటువంటి అద్భుతమైన తల్లీ కూతుళ్ళ బంధం అందంగా వికసించాలి. ‘‘నన్ను పెంచిన తల్లి’’ అని కూతురు, ‘నాకన్న కూతురు’ అని తల్లి సగర్వంగా చెప్పుకునేలా వారి అనుబంధం పెరగాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి