అడ్డంకులు తొలగించే ‘అమ్మ’ కొడుకు
అగ్రపూజలందుకునే ఆదిదేవుడు వినాయకుడు. తొలి పూజలందుకునే గణేశుడిని గణానంత్వా గణపతిగ్‌ంహవామహే అని ఋగ్వేదం చెప్తోంది. ‘గ’ అనే అక్షరం జ్ఞానాన్ని తెలియచేస్తే ‘ణ’ నిర్వాణం చెప్తుంది. అందుకే గణ నాయకుడైన గణపతి జ్ఞాన నిర్వాణ శాసకుడయ్యాడు. వినాయకుడిని ఇంద్రుడు పూజించి గౌతమమహార్షిశాపాన్నుంచి విముక్తుడయ్యాడు. గణపతి అర్చన తర్వాత క్షీరసాగరమధనం నిర్వర్నిఘ్నంగా సాగిందంటారు. గాయత్రి మంత్రంలాగే ముప్పైరెండు అక్షరాలున్న శుక్లాంబరధరం మహామంత్రం. ‘గం’ ‘గ్లౌం’ అనే బీజాక్షరాలు విఘ్ననాయకునివి. విగతో నాయకః వినాయక సర్వస్వతంత్రుడైన వినాయకుడు ప్రధమ గణాలకే కాక మానవదేహంలోని మూలాధార స్థానానికి కూడా అధిపతే. గణపతిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. జీవితంలో వక్రాలను తొలగించేవాడుకనక వక్రతుండాయ అని, దీనపాలకుడు గనుక హేరంబాయా అని స్తుతిస్తారు.
పార్వతీదేవి ముద్దులు మూటలుగట్టే కుమారుణ్ణి చూసి మురిసిపోయింది. ఆ కుమారుణ్ణే ప్రధమగణాలకు అధిపతిచేయమని అంటే భూలోకప్రదక్షిణలు చేయాలని షరతు పెట్టాడు పరమశివుడు. కుమారస్వామి పుణ్యనదీస్థానానికి బయలుదేరితే లంబోదరుడు తల్లితండ్రుల చుట్టు ప్రదక్షణ చేసాడు. కుమారస్వామికి తనకన్నా ముందుగానే స్నానమాచరించే వక్రతుండుడు కనిపించేవాడు. ఆశ్చర్యానందాలకు లోనైన కుమారుడు విషయాన్ని తెలుసుకోవడానికి వస్తే తల్లి తండ్రుల ఎదుట తన కన్నా ముందే ఉన్న వెనకయ్య చిరునవ్వుతో స్వాగతం చెప్పాడు. సుబ్రమణ్యేశ్వరుడు శూర్పకర్ణుని సంగతిని తెలుసుకొని నమస్కరించాడు. ప్రథమగణాలకు అధిపతిని చేసి విశ్వనాయకుణ్ణి చేసారు. భక్తుల సకలకార్యసిద్ధిని చేసి వరసిద్ధివినాయకుడు అయ్యాడు. షోడశోపచారాలు చేస్తున్నవినాయకుడు భక్తుల కోరిక మేరకు ద్వాదశరూపాల్లో కనిపించి కరుణచూపిస్తాడు. అలాంటి వినాయకుణ్ణి భక్తులు దీక్షవహించి పూజించి తరిస్తారు.
కాజీపేటలో స్వయంభూగా అవతరించిన శే్వతార్కగణపతిని మండలదీక్షతో ఆరాధిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు గణపతి దీక్షను తీసుకొని భక్తులు హైద్రాబాదుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్లు జిల్లాలోని విష్ణుపురిలో కొలువైన వినాయకుణ్ణి పూజిస్తారు.
భాద్రపద శుద్దచవితినాడు వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములను పెట్టి 21రకాల పత్ర పుష్పాలతో పూజిస్తారు. ఆరోజే శే్వతార్కగణపతి ముందు మండల దీక్ష తీసుకుని మాలధారణ చేస్తారు. ఇలా మాలధారణ చేసే స్వాములు గణపుతి ప్రతిరూపాలుగా సంభావిస్తారు. మాలధారణ చేసినవారు సంకల్పసిద్ధికోసం పదకొండుమార్లు ఓ గం గణపతయే నమః అంటూ జపిస్తారు. ఈ మాలధారణ చేసినవారు శే్వత వస్త్రాలను ధరిస్తారు. పూజామందిరంలో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని అలంకరించి దానిముందు పసుపు గణపతిని చేసి విఘ్ననాశనాన్ని చేయుమని వేడుకొంటారు. త్రికాలాలలోనూ గణపతి ఆరాధిస్తూ ఎవరినీ నొప్పించకుండా వారు నొవ్వకుండా ఉంటారు. ఆ మృణ్మయ వినాయకుణ్ణినియమనిష్ఠలతో పూజిస్తూ మండలంరోజులు ఎదుటి వారిని విశ్వనాయకుడి నామాలతో పిలుస్తూ. దీక్షనుపూర్తిచేస్తారు. మండలం చివరిరోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. మరికొందరు శ్రావణ శుద్ద చవితి నుంచి మండలదీక్షలు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి నాడు దీక్షను విరమిస్తారు. విరమణానంతరం జపహోమాదులతో పాటుగా అన్నదానాన్ని కూడా చేసి వినాయకుడిని సంతృప్తి పరుస్తారు. దీక్షాకాలంలో సాయంసంధ్యలలో గణేశభజన చేస్తారు. ఇలా చేసిన వారిని అఖండ ఐశ్వర్యాదులతో అనుకొన్న పనులు విఘ్నాలు లేకుండా జరిగేలా వినాయకుడు అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.
వినాయకుణ్ణి పూజించే పత్రిలో ఓషధీగుణాలున్నాయ. అవి ఈ మాసంలో ఉపయోగించడంతో మానవుల ఆరోగ్యానికి విశేష ఫలం దొరుకుతుంది. అందుకే ఈ ప్రతాలన్నింటిచేత పూజించిన వారిని పార్వతి పుత్రుడు పూర్ణాయువుకమ్మని దీవిస్తాడు. లంబోదరా లకుమికరా అని సంగీత ప్రియుడైన లకుమివీణాధారుడిని పూజిస్తారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి