అంతర్జాతీయ తెలుగు అంతర్జాల తొలి సదస్సు సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో మూడు రోజుల పాటు జరగనున్నది. అంతర్జాల యుగంలో తెలుగు అనే మకుటంతో జరుగనున్న ఈ సదస్సులో ఈ రంగంలో ఇప్పటికే విశేష కృషి చేస్తున్న తెలుగు భాషా నిపుణులు, కంప్యూటర్ సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
అంతర్జాలంలో తెలుగును మరింత తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉండేటట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే దిశగా ఈ సదస్సు జరగనున్నది. సెప్టెంబర్ 28 వ తేదీన ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల సదస్సులో తెలుగు భాషలో అంతర్జాల వినియోగాన్ని భవిష్యత్తులో మరింతగా పెంపొందించుకోవడానికి ఏమి చేయాలన్న అంశాన్ని లోతుగా చర్చిస్తారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఈ సదస్సులో పత్రాలు సమర్పిస్తారు.
రానున్న దశాబ్ద కాలంలో అంతర్జాలంలో తెలుగు భాషకు ప్రాధాన్యం పెరుగనున్న దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరికరాలలో రేపటి తెలుగు భాష వినియోగానికి ఇప్పటినుంచే సోపానాలు వేయడం ఎలా, సాధనాలు రూపొందించడం ఎలా అన్న అంశాన్ని వివిధ కోణాలలో పరిశీలించి నిపుణులు ఈ సదస్సులో సూచనలు ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి. మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ దిశగా సదస్సుకు అంకురార్పణ చేసినట్టు సదస్సు నిర్వాహకులు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల తెలియజేశారు. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన విదే శీ భాషల విభాగంలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ పేరి భాస్కర రావు ఈ సదస్సు అధ్యక్షునిగా ఉంటారని ఆయన వె ల్లడించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి