గురువారం, మార్చి 31

ఇ - షాపింగ్ డేంజర్స్!

డిస్కౌంట్  డేంజర్స్!



గ్లోబల్ ప్రపంచంలో షాపింగ్ చేయడానికి ఆడా, మగా అన్న తేడా లేదు.
సంపాదన పెరగడం, ప్లాస్టిక్ మనీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో -
వినియోగదారుల వస్తు కొనుగోలు సామర్థ్యం పెరగడం, సులభమవ్వడం కూడా జరిగింది.దీన్ని ఆసరా చేసుకుని - మార్కెట్ మోసాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇటీవలి కాలంలో మార్కెట్‌లో ప్రతి ఒక్కరి నోటా వినే పదం ‘డిస్కౌంట్’. డిస్కౌంట్ సేల్స్, ఒకటికొంటె మరొకటి ఉచితమన్న ప్రకటనలతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇలాంటి ఆఫర్లుతో వినియోగదార్లు ఆకర్షణకు గురౌతారని అమ్మకందార్లకు బాగా తెలుసు. అందుకే ఈ ఆఫర్లు పెట్టిన షాపులు జనాలతో కిటకిటలాడుతుంటాయి చూడండి.
డిస్కౌంట్ సేల్స్‌లో కొనేటప్పుడు బాగానే ఉంటుంది, తరువాతే కొంప ముంచుతుందన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. నాణ్యత గురించి ఆలోచించకుండా వస్తువులు కొనడమే ఇక్కడ చాలామంది చేసే పొరబాటు. తరువాత చూసుకుని బాధ పడుతుంటారు. ఈ మధ్య నెట్ సేల్స్‌కు కూడా బాగా ఆదరణ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని వస్తువులను కొనుగోలు చేసేయడం సుళువే, కానీ వాటి నాణ్యత, పనితీరు అందులో పేర్కొన్నట్టు ఉండొచ్చు, ఉండక పోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి.



డిస్కౌంట్‌లో ‘అప్ టు’ అనే చిన్న పదం వినియోగదారుల సొమ్ముతో ఆటలాడుతోంది. ఆ చిన్న పదమే కొనుగోలుదారుల్ని తప్పుదారి పట్టిస్తుందని గుర్తెరగండి. కనిపించని డామేజ్‌లు, సెకెండ్ సేల్ వస్తువుల్ని ఈ కోవలో అంటగట్టేస్తారన్నది నిజం. ప్రత్యేకంగా అద్దెహాళ్లలో పెట్టే డిస్కౌంట్ అమ్మకాలకు దూరంగా ఉండటమే మంచిది. కొన్న వస్తువులో ఏవైనా లోపాలుంటే అడగడానికి తర్వాత అక్కడ షాపు కూడా ఉండదు. ఒకవేళ అలాంటి చోట్ల కొనాల్సివస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రాండ్‌నేమ్,
ఉత్పత్తిదారుల చిరునామాలు సరిగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి.
 

బిల్లు, క్యాష్‌మెమో లేకుండా కొనడం మంచి పద్ధతి కాదు.
అవిలేకుండా కొనడం అంటే
నాణ్యత మీద ఆశ వదులుకున్నట్టే. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు 
‘డిస్కౌంట్ సేల్’ అని పెట్టి, తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఆ స్టాకు అయిపోయిందని, మరోరకం స్టాకు తీసుకోవచ్చని నేర్పరితనంతో అంటగడతారు.
ఒకవేళ మీరు ఇలాంటి మాయలో చిక్కుకుని మోసపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.
1986 వినియోగదారుల చట్టం కింద పని చేసే ఫోరమ్‌లు దేశవ్యాప్తంగా 588 జిల్లాలో ఉన్నాయి. 34మంది రాష్ట్ర కమిషనర్లు ఉన్నారు. ఇవేకాక నేషనల్ కమిషన్ ఒకటి ఢిల్లీలో పని చేస్తుంటుంది.

వినియోగదారులు మోసపోతే, ఫోరంల ద్వారా నష్టాన్ని
రాబట్టుకునే ప్రయత్నం చేయొచ్చు.
సేల్స్ జిమ్మిక్స్‌లో మరోరకం ఏంటంటే -పాత వస్తువు తెచ్చి కొత్త వస్తువు తీసుకెళ్లమనేది. ఇలా ఇచ్చే వాటిలో ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, కప్‌బోర్డులు, టీవీలు ఉంటుంటాయి. అయితే, పాత వస్తువు ధరను
కొత్త వస్తువు ధరలో ఎంత మినహాయించారో గమనించుకోవాలి.
కొత్తగాకొనే వస్తువు యొక్క నాణ్యత గుర్తించాలి. ఒక్కసారి మీ వస్తువులను కొనేవారు మీరు చెప్పిన ధరకే కొన్నప్పుడు, బదులుగా మరో వస్తువు తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని మినహాయించారో లేదో చూసుకోవాలి. ఇలాంటిచోట్ల మీరు తీసుకున్న వస్తువుకు వారెంటీ ఉందో లేదో చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నింటికైతే కొంతకాలం ఫ్రీ సర్వీసు కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లకు డిమాండ్ పెరగడంతో, కొన్నిరకాల మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పాతవాటినే సర్వీసు చేసి, పైకప్పు కొత్తదివేసి అమ్ముతున్న సందర్భాలూ ఉన్నాయి. కంప్యూటర్ల కొనుగోలులో వాటి శక్తి సామర్థ్యాల, వారెంటీలను ఫ్రీ సర్వీసు ఇతర వివరాలను తెలుసుకుని కంపెనీలకు సంబంధించిన వాటినే కొనుక్కోవాలి. బిల్లులు, క్యాష్‌మెమోలు లేకుండా వస్తువుల్ని కొనొద్దు. అప్పుడే వినియోగదారుడు డిస్కౌంట్ డేంజర్స్ నుంచి బయట పడతారు. చివరిగా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.
మార్కెట్లో వస్తువు ధరకంటే తక్కువకు అమ్మకం దారుడు ఎందుకు ఇస్తాడు.
వ్యాపారం చేసేది నష్టాలు పోగేసుకోడానికి కాదుకదా! అన్న స్పృహతో ఆలోచిస్తే 
మార్కెట్ మర్మం మీకే అర్థమవుతుంది.

ఇ-షాపింగ్‌



ఇ-షాపింగ్‌తో జాగ్రత్త
  కంప్యూటర్ యుగంలో ఈ మధ్య ఇ-షాపింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఇంటర్నెట్‌లో వస్తువులను కొనే పద్ధతి వచ్చాక వినియోగదారులు ఎంత వేగంగా కొంటున్నారో అంతే వేగంతో మోసపోతున్నారు. బాగా చదువుకున్న వారు సైతం జాగ్రత్తలు తీసుకోనందున మోసాలకు గురౌతున్నారు.

వస్తువులు కొనుగోలులో నేరుగా ఎదుర్కొనే మోసాలు ఒకరకమైతే 
ఇ-షాపింగ్‌లో జరిగే మోసాలు మరో రకంగా ఉంటున్నాయి.
ఇ-షాపింగ్ ఘరానా మోసంగా తయారయ్యింది. ఇ-షాపింగ్‌లో జాగ్రత్తలు తుచ తప్పదు.
ఇ-షాపింగ్‌లో వస్తువును బుక్ చేసుకునో, ఆక్షన్ వేసో కొంటారు. 
బిడ్‌లో గెలిచిన తరవాత వినియోగదారుల క్రిడెట్ కార్డు నుంచి వస్తువు ఖరీదు ఆ వస్తువుల ఉత్పత్తిదారులు తీసుకుంటారు. వస్తువును రెండు, మూడు వారాల్లో డెలివరీ చేస్తారు. కాని కొన్ని సార్లు వాళ్ళు చెప్పిన టైంకి వస్తువు డెలివరీ కాదు. మనం మాత్రం ముందుగానే వేల రూపాయలను కట్టి ఉంటాం. 
ఎంత టెన్షన్‌గా ఉంటుందో ఆలోచించాలి.ఎక్కువగా ఇంటర్నెట్ షాపింగ్ ద్వారా
ఎలక్ట్రిక్ వస్తువులను కొంటారు. ఒక వస్తువు కొంటే మరో వస్తువు ఉచితం అనేక ప్రకటనలు ఇంటర్నెట్‌లో కూడా చోటు చేసుకున్నాయి. వీటివల్ల కూడా ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ ఆ తర్వాత మెయిల్‌లో మీరు కొన్న వస్తువు వస్తుంది. ఉచితం అని చెప్పిన వస్తువు మాత్రం ఉండదు. ఇటువంటివి జరిగినప్పుడు ఇ-షాప్ వాళ్ళు కాని, ఇంటర్నెట్ నిర్వాహకులు కాని బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు. ఇలాంటివి ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువుల షాపింగ్‌లోనే జరుగుతుంటాయి.
మరో విషయమేమంటే ఇ-షాపింగ్ నష్టాల్లో వస్తువును బొమ్మలో మాత్రమే చూస్తాం. కాని దగ్గరగా చూడం. దాంతో ఆ వస్తువులో ఏదైనా లోపాలున్నా తెలిసే అవకాశం ఉండదు. నాణ్యత విషయమూ తెలియదు. ఇలాంటి ఇ-షాపింగ్ మోసాలను అరికట్టడానికి యుకెలో వినియోగదారులకు ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడానికి ఏడు రోజుల సమయాన్ని ఇస్తారు. ఏ కారణం లేకుండా కూడా ఏడు రోజుల్లో ఆ వస్తువుని వెనక్కి ఇచ్చే సౌలభ్యం కూడా ఉందక్కడ. 
ఒకసారి ఇ-షాపింగ్‌లో వస్తువు ఆర్డర్ చేసిన తర్వాత వినియోగదారుడికి ఆర్డర్ క్యాన్సిల్ చేసే పద్ధతిని, 
గ్యారంటీ లేదా వారెంటీల వివరాలను డెలివరీ తేదీని, వస్తువులు వెనక్కి వస్తే పోస్టేజి ఎవరు ఇస్తారు అనేటువంటి వివరాలన్నీ తెలియజేస్తారు. ఇలాంటి జాగ్రత్తలే కాకుండా ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా
వేరొక వస్తువు డెలవరీ చేస్తే వస్తువుకు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.
మన దగ్గర ఇలాంటి సౌకర్యాలేవీ లేవు. కాబట్టి వస్తువులను కొనేప్పుడు అన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా
మనమే తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. లేకపోతే డేంజర్‌లో పడక తప్పదు.

‘అబ్సెషన్’

అనావసరపు ఆలోచనలు వద్దు.




మనిషికి ఎప్పుడూ ఏవో ఆలోచనలు వస్తూనే వుంటాయి. 
ఏదో ఒక అంశం గురించి మనం ఆలోచిస్తూనే వుంటాము. అయితే ఎప్పుడూ ఒకే అంశంపై దృష్టిని కేంద్రీకరించి ఆ ఆలోచనలతోనే, ఆ కోరికలతోనో కాలం గడపటం అంత మంచి పద్ధతి కాదు. అటువంటి లక్షణాలు కలిగినవారు చాలామంది ఉంటారు. నిత్యం ఆలోచనలతోనే పొద్దుపుచ్చడం లాంటి లక్షణాన్ని ఆంగ్లంలో ‘అబ్సెషన్’ అంటారు. అబ్సెషన్లలో కూడా అనేక రకాలున్నాయి. కొందరికి పరిశుభ్రత పిచ్చి. మరికొందరికి సోకుపిచ్చి. పరిశుభ్రత, ఆరోగ్యం, వస్తధ్రారణ.. ఇలా ఏదో ఒక అంశంమీద చాలామంది పిచ్చి వ్యామోహంతో ఎక్కువ దృష్టి పెడుతుంటారు.
ఈ శ్రద్ధ, ఆసక్తి మితిమీరకుండా వున్నంతవరకు ఫరవాలేదు. అవధులు దాటి అనుక్షణం వాటి గురించే ఆలోచిస్తూ, ఆ భ్రాంతిలోనే పొద్దుపుచ్చుతుంటే మనసులో చీకాకు ఏర్పడుతుంది.
ఆహారం గురించి, వయసు గురించి, నిద్ర అలవాట్లగురించి, వృత్తి- ఉద్యోగం జీవితం గురించి, వ్యాపారం గురించి, ప్రమోషన్ల గురించి, పై చదువుల గురించి, పై అధికారులు, సహోద్యోగులు.. ఇలా ఎదుటివారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ చింతిస్తూ కాలం గడిపేస్తుంటారు. అవే సర్వస్వం అనుకుంటూ, ఇరవై నాలుగు గంటలు అదే భ్రమతో మానసికంగా వేదనకు గురౌతుంటారు.
ఈ అబ్సెషన్లకు దూరంగా వుండకపోతే అసాధారణమైన అలవాట్లు కూడా వచ్చి మనపై పడతాయి. అబ్సెషన్ల ఫలితంగా జీవితం సాఫీగా సాగకపోగా మనశ్శాంతి, సుఖ సంతోషాలు కరవవుతాయి. తమకి తెలియకుండానే జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించి అనేక అంశాలను అలక్ష్యం చేయడం జరుగుతుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత, ఆనందం దూరం కాకమానదు.
ఇలాంటి ‘అబ్సెషన్’ ఉచ్చు లో ఇరుక్కొనడానికి కచ్చితమైన కారణం ఏమిటో ఇంతవరకు రుజువుకాలేదు. అయితే కొంతమంది మానసిక భ్రాంతులకు కొన్ని కారణాలను గుర్తించి నివారణకోపాయాలు సూచించారు.
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, సాంఘిక సేవ, నటన, నాట్యం, పుస్తక పఠనం, వ్యాయామం, ఆటలు వంటి వాటి పట్ల అత్యంత ఆసక్తి కనబరచడంవల్ల మానసిక ఉల్లాసం, విజ్ఞానం పొందవచ్చు. మనలోని ప్రతిభ కూడా బయటకు వస్తుంది.
ఏది ఏమైనా- ప్రతి నిమిషం ఒకే యావ ఉండే వ్యక్తి, దాని ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకోవాలంటే మనసును ఇతర అంశాల మీదకు మళ్లించడం సరైన వైద్యం.
ఏదో వ్యాపకం పెట్టుకోవడం, శారీరక శ్రమ చేయడం, విహార యాత్రలకు వెళ్లిరావడం, పత్రికలు - పుస్తకాలు చదవడం, రచనలు చేయడం వంటి వాటి ద్వారా మనసును పక్కకు మళ్లించి ‘అబ్సెషన్ల’ నుంచి దూరం కావాలి. క్రమంతప్పక ఇలాంటి నివారణోపాయాలను పాటించడంవల్ల ఆలోచనలను నియంత్రణలో వుంచుకోగలిగి, అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలుగుతారు.
లేదంటే అబ్సెషన్లవల్ల ఎన్నో నష్టాలకు గురికావాల్సి వస్తోంది. ప్రతి నిమిషానికీ ఆందోళన, చింత పెరిగిపోతాయి. నిద్రపట్టకపోవడం, గాభరాగా వుండడం, రక్తపోటు ఎక్కువ కావడం జరుగుతాయి. మానసిక ఒత్తిడివల్ల తలెత్తే తలపోటు, అజీర్తి, ఆర్థరైటిస్, ఎలర్జీలవంటి అనారోగ్యాలూ కలుగుతాయి. ఈ అబ్సెషన్ తారాస్థాయికి చేరుకుంటే మానసిక బలహీనతకు దారితీసి పిచ్చివాళ్లుగా మారవచ్చు.
అలాగే మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం, ధూమపానం వంటివాటికి దగ్గరై లేదా మితిమీరి మానసిక రుగ్మతలకు, అర్థంపర్థంలేని ‘అబ్సెషన్ల’కు గురికావాల్సి వస్తోంది. 
కాబట్టి ప్రతి వ్యక్తి ఈ అబ్సెషన్లకు దూరంగా ఉండాలి. అబ్సెషన్ తీవ్రమైపోతే మానసిక వైద్య నిపుణుల నుంచి
వైద్య సహాయాన్ని తీసుకోవడం తప్పనిసరి.
అబ్సెషన్లవల్ల మనోవ్యాకులత పెరిగి, అనర్థాలు సంభవిస్తాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 
మన పురోగతికి అది ఓ పెద్ద ప్రతిబంధకమని గ్రహించాలి. సాధ్యమైనంతవరకు ఏవేవో భ్రాంతులలో పడి కొట్టుకుపోకుండా ముందుగా జాగ్రత్తపడాలి. ఒకవేళ పొరపాటున ‘అబ్సెషన్’ బారిన పడినా వీలైనంత త్వరగా బయట పడడానికి ఆత్మీయులు, బంధు మిత్రుల మధ్య గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ‘అబ్సెషన్ల’ నివారణోపాయాలను పాటించడం చేయాల్సిందే.

ముద్దొచ్చే ముత్యం

ముద్దొచ్చే ముత్యం
అందాన్నీ, ఆరోగ్యాన్నీ, సౌకుమార్యాన్నీ, స్వచ్ఛతనీ, దర్పాన్ని, నిరాడంబరతనీ ఏకకాలంలో ప్రతిఫలించే శక్తి దీనికి మాత్రమే ఉంది. అందుకే నాటి నుంచి నేటి తరంవరకూ అంతా దీని ప్రేమికులే. సరాలల్లుతూ సరాగాలాలపిస్తూ వనె్నల చినె్నలు వెదజల్లుతూ వెనె్నల వానలు కురిపిస్తూ అతివల్ని అలరిస్తూ అందరినీ మురిపిస్తున్న అందమైన అలంకారం, అజరామర సౌందర్యం ఆణి‘ముత్యం’.
అతివల అందాల్నీ నిర్మలమైన మనసునీ కడిగిన ముత్యం అని పోల్చడం వింటుంటాం. కానీ ముత్యమనేది సముద్ర నీటిలో నివసించే మొలస్కన్ జీవులు విసర్జించే కర్భన పదార్థం. ఎక్కువగా ఆయస్టర్లు, తక్కువగా నత్తలనుంచి ముత్యాలు ఏర్పడతాయి. దృఢమైన కవచం లోపల గుట్టుగా జీవించే ఈ జీవుల శరీరంలోకి ఓ చిన్న అన్య పదార్థం.. అది ఇసుకరేణువు కావచ్చు.. పరాన్నజీవి కావచ్చు ప్రవేశించినపుడు దాన్ని బయటకు పంపిస్తూ దాని చుట్టూ కవచంలా ఆర్గొనైట్, కాంకియోలిన్ అనే కర్బన పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ స్రావానే్న మదర్ ఆఫ్ పెరల్ ‘నాక్రే’ అంటారు. ఈ విధంగా అన్య పదార్థం చేరిపుడు మొదట ఏర్పడినదానిమీదే పొరలుపొరలుగా కర్బన పదార్థం స్రవిస్తుంది. అదే ముత్యంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే ముత్యం ఆకారం, లోపలకు ప్రవేశించిన అన్య పదార్థం యొక్క ఆకారం.. అది ఏర్పడే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. సూదిమొన నుంచి పావురం గుడ్డు సైజువరకూ వివిధ పరిమాణాల్లో ముత్యాలు దొరుకుతాయి. 450 క్యారెట్లు బరువు కలిగిన అతి పెద్ద ముత్యం కూడా లభ్యమయిందంటే ఆశ్చర్యమే.
సామాన్యులకు సైతం నేడు ముత్యాలు సుపరిచితమే. కానీ పంతొమ్మిదో శతాబ్దం వరకూ ముత్యాల హారాలే ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఆభరణాలంటే నమ్ముతారా!
ఎందుకంటే, అప్పట్లో అత్యంత అరుదుగా మాత్రమే దొరికే అపురూపమన రత్నాలివి. మొదట్లో ముత్యాలు సముద్రంలో మాత్రమే దొరికేవి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలనుంచే ఎక్కువగా ముత్యాలు మార్కెట్లోకి వచ్చేవి. ఇప్పటికీ సహజమైన ముత్యాలకు ఇవే ప్రధాన రేవులు. నలుపు రంగు ముత్యాలు ఎర్ర సముద్రంలో మాత్రమే దొరికేవి. కొంతకాలానికి దురదృష్టవశాత్తు వీటి ఉత్పత్తి క్షీణించింది. రాజ కుటుంబీకులు మాత్రమే ధరించే ముత్యాలను ఇప్పుడు సామాన్యులు సైతం ధరిస్తున్నారు. సరిగ్గా వందేళ్ళ క్రితం ముత్యాలను పెంపకం ద్వారా మార్కెట్లోకి తెచ్చారు. కళతప్పిన ముత్యాలు క్రమేణా కళకళలాడుతూ వెలుగులను విరజిమ్మింది. ప్రస్తుతం మనకు దొరికే ముత్యాల్లో 95 శాతం పెంపకం ద్వారా లభించేవే.
ముత్యాల పంటగా మారినప్పటినుంచీ అక్కడ, ఇక్కడ అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ముత్యాల వెల్లువైంది. ఇందుకు మన దేశం, మన రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. పైగా నిజాం పాలనలో ఎక్కడెక్కడినుంచో వచ్చే ముత్యాలకు ఒడుపుగా రంధ్రాలు చేయడంలో హైదరాబాదీలు ప్రావీణ్యం సంపాదించారు. దీంతో భాగ్యనగరం ‘పెరల్ సిటీ’గా చరిత్రలో స్థానాన్ని సంపాదించింది. అయితే మన దేశంలో క్రమంగా రత్నాల స్థానాన్ని బంగారు కైవసం చేసుకోవడంతో మధ్యలో కొంతకాలం ముత్యం కాస్త మసకబారినట్లు కనిపించింది.
కానీ, ఇటీవల మళ్ళీ పుంజుకొంది. ఆభరణాల డిజైనర్లు రంగు రంగుల ముత్యాలు, ఇతర రత్నాల సాయంతో వినూత్నమైన డిజైన్లతో నగల్ని రూపొందించి మంచి ముత్యాలకీ డిజైనర్ లుక్ తీసుకొచ్చారు.
సిల్కు, షిఫాన్ డ్రెస్సుల మీదకు మ్యాచయ్యేలా గులాబీ, ఆకుపచ్చ, నలుపు, బూడిద వర్ణాలముత్యాల్ని నేటి తరం ఎంతో ఇష్టపడి ధరిస్తోంది. సూదిమొననుంచి పావురం గుడ్డు సైజు వరకూ వివిధ పరిణామాల్లో లభించే ముత్యాల్లోని రకాల గురించి, నాణ్యత, భద్రత తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
ముత్యాల్లో ముచ్చటగా మూడు రకాలున్నాయి. మనిషి ప్రమేయం లేకుండా ఏర్పడేవీ, సముద్రంలో దొరికేవీ సహజమైనవి. మొలస్కన్ల శరీరంలోకి అన్య పదార్థాన్ని మనిషి ప్రవేశపెట్టడం ద్వారా ఏర్పడేవి ‘కల్చర్డ్ పెరల్స్’. ఇవి కృత్రిమమైనవి కావు. ఈ విధానంవల్లే ముత్యాల పరిశ్రమ ఇంతింతై వటుడింతై వృద్ధి చెందింది.
మంచినీటిలో నివసించే మొలస్కన్ల నుంచి లభించేవే ‘మంచినీటి ముత్యాలు’. ఇవి సముద్ర నీటిలో లభించే ముత్యాలంత నాణ్యతను కలిగి ఉండవు. అందుకే వీటి ఖరీదు కూడా తక్కువే. ఉడికిన అన్నంలా ఉండే ఈ ముత్యాలకు హైదరాబాద్ కూడా పెట్టింది పేరే.
ముత్యాలన్నీ మంచివేనా?... అంటే కాదనే చెప్పాలి. వీటిల్లో కృత్రిమమైనవీ ఉన్నాయి. ‘‘మాజొర్కా ముత్యాలు’’ ఇలాంటివే. గాజు లేదా ప్లాస్టిక్ పూసలకు కర్బన్ పదార్థంతో పూత పూసి అచ్చు ముత్యాల్లా తయారుచేస్తారు. చూడ్డానికి సహజమైన ముత్యాల్లా ఉండే వీటిని తెలియనివారు ఎక్కువధరపెట్టి కొంటుంటారు. చాలామంది తెలియక నకిలీ ముత్యాలను సహజమైనవిగా భ్రమిస్తుంటారు. పైగా వీటికి ‘సెమీ కల్చర్డ్’ అని స్టైల్‌గా పేరు పెట్టి మనల్ని బాగా నమ్మించి నకిలీ ముత్యాలను అమ్మేసే వ్యాపారులు నేడు కోకొల్లలు. కాబట్టే ముత్యాల కొనుగోలులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ముత్యాలను కొనేటప్పుడు కచ్చితంగా మెరుపు, ఆకారం, పరిణామం, రంగును తప్పకుండా గుర్తుంచుకోవాలి. అసలు సిసలైన ముత్యాలు దృఢంగా, మందంగా వెనె్నల విరిసినట్లుగా మెరుస్తాయి. చూడ్డానికి నున్నగా ఉంటాయి. మచ్చలు, గీతలూ, చిల్లులూ అసలే ఉండకూడదు. పున్నమి చంద్రుడిలా వంకర లేకుండా పూర్తిగా గుండ్రంగా ఉన్నవే ఎక్కువ ఖరీదైనవి. సైజు పెరిగే కొద్దీ ధర కూడా ఎక్కువే. గులాబీ, నలుపు రంగుతోపాటు ధవళ కాంతులతో మెరిసే తెలుపు రంగు ముత్యాలే నాణ్యమైనవీ శ్రేష్ఠమైనవీ. తక్కువ నాణ్యత కలిగిన పసుపు, గోధుమ షేడ్‌లు కొనకపోతే మంచిది. ఏదిఏమైనా నాణ్యతను బట్టి ముత్యాలు ధరలు పలుకుతాయి. ముత్యాల హారం నేడు వెయ్యి రూపాయలు మొదలు పది లక్షల వరకూ అందుబాటులో ఉంటున్నాయి. కాల్షియం కార్బొనేట్‌తో ఏర్పడటంవల్ల వాతావరణ ప్రభావానికి ఇవి రంగు మారతాయి. అయితే వందేళ్లు గ్యారంటి చెప్పవచ్చు. ఆ తర్వాత రంగును కోల్పోయే అవకాశాలున్నాయి.

ధర్మం

ధర్మం - విశ్వ కల్యాణం
‘‘బహుజన హితాయ బహుజన సుఖాయ’’ అన్నది భారతీయుల ఐక్యభావం. 
విశ్వకల్యాణానికై తపస్సు చేసి తపోధనులైన వారున్న పుణ్యభూమి ఈ భారతదేశం.
లోక కల్యాణాన్ని కోరి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని భారతీయుల జీవనాన్ని గడపాలన్నది మన వేద సారాంశం.
శృతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. సమస్త ధర్మాలకు వేదమే మూలం.
ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేది ధర్మశాస్త్రం. జీవితంలో వివిధ దశల్లో ఏ విధంగా వ్యవహరించాలి? సమాజంలోని రకరకాల వ్యక్తులతో ఎలా వ్యవహరించాలన్న ప్రవర్తన నియమావళిని తెలిపేదే స్మృతి. 
ఈ ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనవి.
‘‘బోధనా లక్షణో అర్థో ధర్మః’’ అని జైమిని అన్నాడు. 
ఒక వ్యక్తి చేయవలసిన విధుల్ని బోధించేది ధర్మం. 
సత్యం, అహింస, దయ, శౌచం వంటివి సామాన్య ధర్మాలు.
మానవ సమాజంలోనే విశేష ధర్మాలు రూపొందాయి.



సమాజం స్థాణువు కాదు పరిణామశీలమైనది కాబట్టి ధర్మంలో కాలానుగుణమైన మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ధర్మానికి మూలపదం ‘్ధృ’, ధరించి ఉంచేది ధర్మం. ధర్మమనగా ఆశింపదగిన గమ్యం.
ఇది సౌఖ్యాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. భారతీయుని జీవన సరళికి ప్రధానమైనది ధర్మం. 
సర్వానికి ధర్మమే మూలం.
‘యతో అభ్యుదాయ, నిశ్రేయ ససిద్ధిః సధర్మః’- ఏది అభ్యుదయాన్ని, మోక్షాన్ని సిద్ధింపచేయగలదో అదే ధర్మం. తిండి, నిద్ర, భయం, మైథునం మనుషులకు, పశువులకు సమానమే కాని వ్యత్యాసం ధర్మవర్తనమే!
ధర్మం లేనివాడు పశువుతో సమానమే! ధర్మం చేతనే అర్థకామాలు సంపాదించాలని భారతం చెబుతోంది.
ధర్మమనేది ఒక పెద్ద వటవృక్షం. దాని నీడలో మానవులంతా విశ్రాంతి పొందగలరు.
శాంతి, ఆనందాలతో జీవనం సాగించగలరు. ధర్మమనేది దేశ, కాలాలకు బందీకాదు.
అది యావత్ ప్రపంచానికీ వాస్తవమైన దారి చూపగలదు.
ఈ సృష్టి అంతా ధర్మం మీదనే ఆధారపడి ఉంది. 
ధర్మం మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది తప్ప వారిని వేరు చేయదు.
మానవత్వం, సమానత్వం, సహనతత్వం, అఖండత్వం ధర్మానికి మూలాధారాలు. 
జీవితాన్ని జీవింపజేసే కళే ధర్మం. ఆత్మ, పరమాత్మలను కట్టివేసేది, అనుసంధానం చేసేదే ధర్మం.
ధర్మానికి పరీక్ష మానవత్వమే!
మన బంధువర్గం, మిత్రబృందం, పదవి - అధికారం, సార్వజన సమ్మానం మరింకేదైనా సరే 
మనల్ని ఒంటరిగా వదిలేస్తాయి కాని ధర్మం అలా కాదు. 
మనిషి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నా మనిషితోపాటు వెళ్తుంది ధర్మం. 
అందువలననే అది మనిషికి నిజమైన తోడు-నీడ. నిజమైన మిత్రుడు, సంబంధి, గురువు కూడా. ధర్మాన్ని సర్వకాలాల్లో అనుష్టించి ప్రతిష్ఠించడానికే సీతాదేవిని, లక్ష్మణుణ్ని శ్రీరామచంద్రుడు వదిలిపెట్టవలసి వచ్చింది ఈ ధర్మం పాటించడానికి.శ్రీరామచంద్రుడు స్వ, పర భేదం లేదని అందరికీ ఒకే ధర్మం వర్తిస్తుందని నిరూపించి ధర్మాన్ని నిలబెట్టాడు. లోకంలో ధర్మ ప్రతిష్ఠాపన చేయడానికి శ్రీరాముడు మానవ రూపం దాల్చాడు. 
అందుకే రామావతారం మహత్తరమైంది. ధర్మాచరణకు అవకాశం ఉండటం వలననే 
మానవ జన్మ శ్రేష్ఠమైనదని చెబుతారు. 
ధర్మం మూలతత్వాన్ని అవగాహన చేసుకుని 
జీవితానికి కావలసిన సుఖ, శాంతుల్ని తృప్తిని చేకూర్చకొనగలం.
అందుకే మనిషికి నిరంతరం తోడుగా నిలిచే ఈ ధర్మాన్ని నిత్యమూ అనుసరిస్తూ సేవించాలి. 
ధర్మో రక్షతి రక్షితః.
-కంచర్ల సుబ్బానాయుడు

బుధవారం, మార్చి 30

గాసిప్స్


పని కొచ్చే గాసిప్స్
 

గాసిప్ అంటే అందరూ ఏదో గాలి కబుర్లనీ, అవి ఎందుకూ పనికిరావని, పనికిమాలినవిగా భావిస్తారు. కానీ, గాసిప్‌వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అస్తమానం పని.. పని.. అంటే విసుగే కదా!
బోర్ కొడుతున్న వేళ బంధువులో, స్నేహితులో వచ్చినవేళ చక్కగా ఆరోగ్యకరమైన విషయాలు మాట్లాడుకుంటే అదే గాసిప్! క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్, రిలిటీవ్స్, సినిమాలు, క్రికెట్, ఆఫీసు, బాసు, భార్య, భర్త, పిల్లలు, వంటలు, రైళ్లు, బస్సులు, ప్రయాణాలు వంటి విషయాలతోపాటు మంచి చెడుల గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటే మనం ఫ్రెష్ అయిపోతాం! ఎంతో హాయనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న దిగులు, విసుగూ నీరసం హుష్ కాకీ అయిపోయి ఉత్తేజం కలిగిస్తుంది. దటీజ్ గాసిప్!... మరి గాసిప్ అంటే ఏమనుకుంటున్నారు?..
గాసిప్ అంటే... ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకోవడమంటారు. వాస్తవానికి ‘ఒకరి’ గురించి మాట్లాడుకోకపోతే అసలు ప్రపంచంలో మాటలేముంటాయి? సీరియస్ మొహాలేసుకుని ఐన్‌స్టీన్‌లా, అరిస్టాటిల్లా మేధావి ఫోజులు కొట్టి అస్తమానం సబ్జెక్టే మాట్లాడుకుంటే కొన్నాళ్ళకి పిచ్చిపట్టడం ఖాయం. ఎప్పుడూ సీరియస్సే అయితే లైఫ్‌లో థ్రిల్లేదీ?
కానీ గమనిస్తే అలాంటి సీరియస్ ఫేసు వాళ్ళంతా అసహనంతో, కోపంతో మాట్లాడితే కసిరేసేలా వుంటారు. మెట్టవేదాంతాలు మాట్లాడుతూ తామేదో పెద్ద వేదాంతులమని భ్రమిస్తూ మాట్లాడితే, వేదాంతం చెప్పేవాళ్ళుకూడా ఏడుపుగొట్టు మొహాల జాతికి చెందినవారే! వారు విమర్శలను భరించలేరు. గాసిప్ మాట్లాడలేనివారు జీవితంలో సక్సెస్ కూడా కాలేరు. ఆరోగ్యకరమైన గాసిప్ స్నేహ వర్గాన్ని పెంచుతుంది. గాసిప్ ఎప్పుడూ హాస్యపూరితంగా ఉండాలి. ఇలాంటి గాసిప్‌వల్ల స్నేహాలు బలపడతాయి. మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది. మన పైస్థాయిలోని వ్యక్తుల గురించి విమర్శిస్తూనో, మెచ్చుకుంటూనో కాస్సేపు కబుర్లు చెప్పుకున్నామనుకోండి. మనమూ వాళ్ళను విమర్శించేంత గొప్పవాళ్ళమయ్యామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళకంటే మనమెంత నయమో అర్థం చేసుకోగలుగుతాం. గాసిప్‌వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర, అవినాభావ సంబంధాలు బాగా బలపడతాయి. అయితే ఆ కబుర్లు ఇతరుల గురించో, సినిమాల గురించో, ఇంటింటి రామాయణం గురించో కాకుండా మీరు పంచుకోదగిన మంచి విషయాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే స్నేహబంధం పెనవేసుకుంటుంది. పైగా ఓదార్పు లభిస్తుంది. మంచి సూచనలు, మార్గదర్శకాలు అందిపుచ్చుకోవచ్చు.
చాలామంది ఆడవాళ్ళే గాసిప్ ఎక్కువగా మాట్లాడుతారని అంటారు. నిజానికి మగాళ్ళకి కూడా బోలెడు గాసిప్ కావాలి. రాజకీయాలు, పరస్పర కక్షలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, క్రికెట్, సినిమాల్లాంటి కబుర్లు గంటల తరబడి చెప్పుకుంటారు మన మగరాయుళ్లు. బయటి ప్రపంచం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఆడవాళ్ళు ఇల్లు, భర్త, పిల్లలు, కుటుంబం గురించి మాట్లాడుకుంటారు. కొంతమంది ఆడవాళ్ళయితే అత్తమామల సంగతి పక్కన పెట్టి తన అమ్మ నాన్నలవైపునున్న వాళ్ళగురించే గొప్పలుగా చెప్పుకోవడంతోనే మెహర్భానీ పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు ఇంట్లో జరుగుబాటు, పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, కుటుంబం సంక్షేమం గురించి ఆలోచిస్తూ గాసిప్ మాటలతోనే మంచి సలహాలను పొందుతారు. ఏదిఏమైనా.. ఆడవాళ్ళ ఊహ, కల్పన, దూరాలోచనల ముందు మగాళ్లు దిగదుడుపే!
మీరు గమనించారో లేదోగాని మధ్యాహ్నం పూట సెల్‌ఫోన్స్, లాండ్‌ఫోన్లన్నీ ఎంగేజ్ అయివుంటాయి. ఎందుకనుకుంటున్నారు?.. అప్పుడు ఆడవాళ్ళంతా స్నేహితులతోనో, బంధువులతోనో గంటలకొద్దీ మాట్లాడుతుంటారని ఓ సర్వేలో తేలింది.
ఎప్పుడైనా పొరపాటున క్రాస్ టాక్ వస్తే శ్రద్ధగా వినండి! వాళ్ళ కబుర్లలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, పట్టుచీరలు, వంటలు, కష్టాలు, కన్నీళ్లు వగైరా... వగైరాల్లాంటి ఎన్నో కబుర్లు గంటలకొద్దీ మాట్లాడుతుంటారు. రోజువారి పనుల ఒత్తిడీ, విసుగులనుంచి బయటపడడానికి ఇలా కబుర్లు చెబుతుంటారు.
ఎదుటివారిని అర్థం చేసుకోవడానికీ, వారిని అంచనా కట్టడానికి గాసిప్ పనికొస్తుంది. వాళ్ళెందుకు అలా మాట్లాడారు? అలా చెప్పారు.. వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? వాటి ద్వారా వాళ్ళ వ్యక్తిత్వం, గుణదోషాలు, వారి అలవాట్లు మంచివా? చెడ్డవా? వాటి ఫలితాలు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి గాసిప్ ఎంతో దోహదపడుతుంది.
నెగెటివ్ గాసిప్ ప్రమాదకరం: కులం, మతం, రంగు, మరీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం వల్ల వ్యక్తిగత భేదాభిప్రాయాలవైపు దారితీస్తుంది. ఇలాంటి గాసిప్ ప్రమాదకరం కూడా. మనం మాట్లాడే మాటలు ఎవరికీ ఏవిధంగానూ బాధ, హాని కలిగించరాదు. నెగెటివ్ గాసిప్ మనుషుల మధ్య సంబంధాలను చెడగొడుతుంది.
గాసిప్‌కు కూడా ఒక సేఫ్ జోన్ అంటూ వుండితీరాలి. ఉదాహరణకు మీపై అధికారుల గురించో, స్నేహితులు, బంధువులు, ఇతరుల గురించో మాట్లాడుతుంటే ఆ విషయాలను సంబంధిత వ్యక్తులకు చేరిపోయే అవకాశం వుంటుంది. కాబట్టి మీరు మాట్లాడే విషయాలు సంబంధితులకు చేరవేస్తాయని అనుమానం మీకు రావచ్చు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త సుమా! గాసిప్ కబుర్లుకు పోయి కొరివితో తలగొక్కున్నట్టవుతుంది.
ప్రతివారిలో ఏవో లోపాలనేవి వుంటాయి. అలా అని దగ్గరి వారి గురించి చెడుగా మాట్లాడకండి. స్నేహాలు, బంధుత్వాలు చెడిపోయే అవకాశాలున్నాయి. అసలు ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడమే అత్యుత్తమం. మంచి గాసిప్ అంటే అదే!
గాసిప్‌లో ఎవరికి సంబంధించిన విషయాలు, సాధారణమైన సంగతులు, జోక్స్, మంచి విషయాలు చెప్పుకోవడంవల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మానసిక ఆందోళనలనుంచి బయటపడతాం. ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతంగా ఉంటాం. మంచి గాసిప్‌వల్ల ఓదార్పు, శాంతం, ఆనందం, మానసిక ఉల్లాసం, ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తుంది

వెండి వెన్నెల


వన్నె తెచ్చే  వెండి   వెన్నెల
 


వెండి మాట వినగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది పడుచుల అందాల పాదాలపై మెరిసే పట్టీలే. 
లేత తమలపాకుల్లాంటి అమ్మాయిల అందెల రవళిని బట్టి వారి మనసును అర్థం చేసుకోవచ్చు.
పసితనం నుంచి పెళ్ళయ్యేవరకు పట్టీలుగా, తర్వాత వాటితో పాటు మెట్టెలుగా వెండిని ధరించడం సర్వసాధారణం. సంప్రదాయం కూడా. వెండి ఆభరణాలు ధరించడం, రకరకాల డిజైన్లు తయారీలోనూ భారత్ అగ్రగామి. బంగారం, వెండితో చేసే మీనాకారి ఆభరణాలకు ఆంధ్ర నాట చెప్పలేనంత డిమాండ్. వెండి, బంగారాలను సరిపోల్చవలసి వస్తే... పసిడి ఖరీదైనది, తక్కువగా లభించేది.
బంగారం, ప్లాటినం, ఇర్రీడియం, పెల్లాడియం వంటి విలువైన లోహాల్లో అధికంగా లభ్యమయ్యేది వెండి మాత్రమే. ధరలో ఆదరణలో వెండిది ఎప్పుడూ పుత్తడి తరువాతి స్థానం. అయితే, బంగారానికి లేని ఎన్నో విశేష గుణాలు వెండికి ఉన్నాయి కనుకే ఆంధ్రుల ఆదరణ పొందింది.
అందం, గట్టితనం, కాంతికి స్పందించే గుణం, తేలికగా వివిధ ఆకృతుల్లోకి మారే తీరు వెండికి మాత్రమే ప్రత్యేకం. ఇతర దేశాల్లో కూడా వెండిని రకరకాలు ఉపయోగిస్తున్నారు. మీకో విషయం తెలుసా?... మనం నేడు విరివిగా ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, టెలిఫోన్‌లు, వాషింగ్ మెషీన్లు, కంప్యూటర్లు... అన్నింటిలోనూ వెండిని వినియోగిస్తున్నారు. ఇంకా ఫొటోగ్రఫీ, వైద్యం, ఫార్మసీ, ఎలక్ట్రికల్.. తదితర రంగాల్లోనూ ఇది ఉంది.
పారిశ్రామికంగా కూడా వెండికి మంచి గిరాకీ ఉంది. చాలామంది వెండిని లాకెట్ రూపంలో మెడలో వేసుకుంటారు. చిన్నపిల్లలపై దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండేందుకు నడుముకో, కాలికో, మెడలోనో వెండి ఆభరణాలను ధరిస్తారు. బంగారంలో హాల్ మార్క్‌లాగే వెండి ప్రామాణికతకు గుర్తు స్టెర్లింగ్ సిల్వర్. ఇందులో 92 శాతం వెండి వుంటే మిగిలింది రాగిలాంటి ఇతర లోహమే. స్వచ్ఛమైన వెండి, స్టెర్లింగ్ సిల్వర్‌తో ఆభరణాలు చేయవచ్చు. అయితే మిశ్రమ లోహమైన స్టెర్లింగ్ సిల్వర్‌తో నాజూకైన ఆభరణాలే కాక విగ్రహాలు, టేబుల్‌వేర్, ఫర్నీచర్... తదితర వస్తువులుగా రూపొందించవచ్చు. సంపన్నులకయితే వెండి ఉపయోగం మరింత ఎక్కువ. సంపన్నుల ఇళ్ళలో నాలుగు వైపులా కుర్చీలు వేసిన డైనింగ్ టేబుల్ భోజన గదిలో కనిపిస్తుంది. మధ్యలో ఉన్న అద్దంతో సమానంగా మెరిసే సిల్వర్ డ్రస్సింగ్ మిర్రర్ సోఫా.. లాంటి అందాలతో వెండి పలకరిస్తుంది.
ఇక పూజా మందిరం మొత్తంగా వెండికాంతులతో మెరిసిపోతుంది. వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి.. ఇలా రకరకాల విగ్రహాల నుంచి దీపాలు, పళ్లాలు, పీటలు, పూల సజ్జెలు, కంకుమ బరిణెలు.. అన్నీ వెండివే. బిందెలు, గ్లాసులు, చెంచాలు, స్పూన్లు.. అందానిచ్చే ఇంటి అలంకారాలెన్నో. ఇంటి నిండా వెండివెనె్నలే. వెండిని ఎక్కువగా చూడటంవల్ల పాజిటివ్ శక్తి ప్రసరించి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, ఆరోగ్యకరమని పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో వెండికి మరింత క్రేజ్ పెరిగింది. వెండి కానుకలు లేందే పెళ్ళిళ్ళు జరగడంలేదు. వెండితో చేసిన పూజా సామగ్రి, డిన్నర్ సెట్లు కానుకలుగా మారాయి. అత్తారింటికి వెళ్ళే కూతురికి మురిపెంగా వెండి ఆభరణాలు, వస్తువులు అందిస్తేగానీ తృప్తిపడని ఆడపడుచులు, తల్లిదండ్రులు ఎందరో?!
అయితే, వెండిని ఇంటికి తెచ్చుకోవడమే కాదు, వాటి జిలుగులు తరగకుండా పదికాలాలు
వెలుగులు చిందించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
బూడిద లేదా ముగ్గుతో రుద్దితే వెండి వస్తువులు నిగనిగలాడతాయి. 
రోజూ వాడని వెండి వస్తువులను మఖమల్ లేదా పట్టు వస్త్రంతో చుట్టి గాలి చొరని డబ్బాల్లో భద్రపరచాలి.
ఎలాంటి కవర్ లేకుండా చెక్క డబ్బాల్లో వెండి వస్తువులను పెట్టనే కూడదు.
వెండి పాత్రలను వాడిన వెంటనే కడగాలి. కుంకుడు కాయ రసం లేదా సబ్బు నీటిలో కొద్దిసేపు నానపెట్టి బేబి బ్రష్‌తో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ బట్టతో తుడవాలి. ఎక్కువ డిజైన్ ఉన్న ఆభరణాలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.
స్టీలు పాత్రలను, వెండి గిన్నెలను  నలనూ రెండూ ఒకేచోట పెట్టకూడదు. 
దీనివల్ల వస్తువులు దెబ్బతింటాయి. రంగు మారతాయి. మార్కెట్లలో లభిస్తున్న
‘సిల్వర్ డిష్’, ‘సిల్వర్ పాలిష్’ తదితర సొల్యూషన్ ఉపయోగించి వెండి వస్తువులకు మరింత వన్నె
తీసుకురావచ్చు. రసాయనిక చర్యల కారంగా ఉప్పు, కోడిగుడ్డు వంటివి తగిలితే వెండిగినె్నలు వెంటనే నల్లబడతాయి. విలువైన వెండి ఆభరణాలు, పెద్ద పెద్ద వస్తువులను ఏడాదికోసారి వెండి షాపుల్లో పాలిషింగ్‌కి ఇస్తే ఎప్పటికీ వాటి వనె్నలు తగ్గవు. వెండి విలువలు తరగవు.
కాబట్టే... ‘‘వెండి’’ మన జీవన విధానంలో మమేకమైపోయింది.
ఇది కాదనలేని వాస్తవం.

మంగళవారం, మార్చి 29

సూది - దారం



కని ‘కుట్టుఅందాలు  -  ఎంబ్రాయడరీ





ఏమీలేని విషయాన్నిగురించి  ఎవర్నయనా అడిగితే...
ఏముందీ! ‘సూదిలో దారం’ అంటుంటారు చాలామంది. 
కానీ మేలురకం పట్టువస్తమ్రయినా సూదీ దారానికి లోకువే. దాని కుట్టుబడికి కట్టుబడి ఉండాల్సిందే.
ఆ సూదీదారాలే ఫ్యాషన్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయ్.
అదెలా అంటారా?


చకీల చమక్కులు. అద్దాల వెలుగులు. రాళ్ళ మెరుపులు. 
దారాల అందాలు. పూసల రంగులు. వెరసి సూదీ దారంతో కుట్టే 
సృజనాత్మక భారతీయ ఎంబ్రాయిడరీ -ఖండ ఖండాంతర ఖ్యాతినార్జిస్తోంది. 
అంతర్జాతీయంగా ఆకట్టుకుంటోంది.
పెళ్లి, పండుగ, వేడుక ఏదైనా కానివ్వండి. వర్క్ శారీ లేదా సల్వార్‌లతో కళకళలాడాల్సిందే.
అలాగని -ఎంబ్రాయిడరీ కేవలం మహిళలకే కాదు.
షేర్వాణీ, కుర్తా, లాల్జీ పైజమా -మగవారి డ్రెస్సులయినా కుట్టు అందాలుండాల్సిందే.
పిల్లలకయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అపుడే పుట్టిన పాపాయిని ఉయ్యాల్లో వేయాలన్నా ఎంబ్రాయిడరీ చేసిన పట్టులంగా కావాలి.
అరవయ్యేళ్ళ బామ్మ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా పుల్కారీ లేదా
కాశ్మీరీ వర్క్ చేసిన పట్టు లేదా 
ఫ్యాన్సీ చీర కట్టాల్సిందే.



పెళ్ళికి వచ్చేవాళ్లను వదిలేస్తే,
పీటల మీద కూర్చునే పెళ్లికూతురుకయినా, 
పెళ్ళి కుమారుడికయినా ఎంబ్రాయిడరీ వర్కు వస్త్రాలు ధరించాల్సిందే. 
రిసెప్షన్‌కయితే ఈ ఫ్యాషన్ తప్పనిసరైంది. తరమేదయినా అందరికీ ఒకే తరహా ఫ్యాషన్. 
అదే -ఎంబ్రాయిడరీ.
కుట్టు అందాలు దక్షిణాదిలో సైతం 
వర్క్ వస్త్రాలు తళతళలాడటం విశేషం. అసలెందుకీ క్రేజ్... 
అంతగా ఆకట్టుకునేదేముంది ఇందులో? అని ప్రశ్నిస్తే 
ఒక్కటే సమాధానం - అందం.


అవును. అందమే ఉంది. మనిషిలోని సృజనాత్మకతనీ 
అందంగా కనిపించాలనే కోరికలనీ ప్రతిబింబించేదే ఎంబ్రాయిడరీ. 
బట్ట కట్టడం నేర్చిననాడే మనిషిలోని కళా హృదయమూ ఉప్పొంగింది.
కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలో, ఆటవిక తెగల వస్తధ్రారణగానీ వాళ్ళు వేసుకునే
ఆభరణాలనిగానీ పరిశీలిస్తే అన్నీ అల్లికలే. 
నారలు, పూసలు, గవ్వలు. ప్రకృతిలో దొరికిన వాటినన్నింటినీ 
అందంగా కనిపించేలా అల్లుకుని ధరించేవాళ్ళు.


ఆ అల్లికల్లోంచి పుట్టుకొచ్చిందే ఎంబ్రాయిడరీ. 
ఆదినుంచీ మనిషి కళాపోషకుడేనన్నది తెలిసిందే.
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.పూ.3 వేల సంవత్సరాల నుంచీ 
ఎంబ్రాయిడరీ వాడుకలో ఉంది.
అచ్చం పెయింట్ చేసినట్లుగా కుట్టే ఓ ప్రత్యేక పద్ధతిలో కుట్టుపనిలో 
ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాల్లో భారత్ సైతం ఫ్యాషన్‌కు వేదికగా మారింది.
అందులో సహజ రంగుల అద్దకం మాత్రం ప్రత్యేకంగా మనకే సొంతమైంది.
ప్రపంచ ఎంబ్రాయిడరీలో మన దేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 
పైగా భిన్న ప్రాంతాల్ని ఆయా ప్రాంతాల సంస్కృతుల్నీ మన ఎంబ్రాయిడరీ చక్కగా ప్రతిబింబిస్తోంది. 
ఏ ప్రాంతానికి చెందిన ఎంబ్రాయిడరీ అయినా అన్నింటిలోనూ ఉండేది
ఆయా ప్రాంతాల్లో తిరుగాడే జంతువులు, పక్షులు, అక్కడ విరిసే కుసుమాలు. 
ఆయా ప్రాంతాల సంప్రదాయ నిత్య జీవన రీతులు.
రంగులూ, దారాలు, డిజైన్లూ అన్నీ అక్కడికక్కడే ప్రత్యేకం.
కాలక్రమంలో మెషీన్లు రావడంతో ఎంబ్రాయిడరీ వేగం పెరిగింది. 
మధ్యలో కొంతకాలం హ్యాండ్ ఎంబ్రాయిడరీ నుంచి అంతా మెషీన్ వైపు మళ్లినా దేని క్రేజ్ దానిదే.
రెడీమేడ్స్‌కి మెషీన్ ఎంబ్రాయిడరీ చక్కగా ఫిక్సయిపోయింది.
తక్కువ సమయంలో ఎక్కువ డిజైన్లనీ, దుస్తుల్నీ రూపొందించగలిగే సౌలభ్యం ఇందులోనే ఉంది. 
ఫ్యాబ్రిక్‌నుబట్టి ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైనా రంగు దారాల్ని కలబోసి కుడితే అది అందంగానే ఉంటుంది. 
అయితే కొన్ని కుట్లు కొన్ని రకాల వస్త్రాలమీదే మరింత మెరుస్తూ పనితనంలోనే గొప్పతనాన్ని చాటుతాయి. 
ఈ ఎంబ్రాయిడరీ నాటినుంచి నేటివరకు ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్. 
నిజానికి ఈ ఫ్యాషన్ స్వాతంత్య్రం రాకమునుపే నారీమణుల ఒంటిమీద తళుక్కుమన్నదే. 
నాటి ఫ్యాషన్ నేటి సెలబ్రిటీలతో పాటు 
సామాన్యుల్ని సైతం సందడి చేస్తోంది.


ఎంబ్రాయిడరీ కేవలం దుస్తులకే పరిమితమా?... 
కానే కాదు. బెడ్‌షీట్లు, కర్టెన్లు, నాప్‌కిన్లు, టేబుల్ క్లాత్, కుర్చీలు, 
సోఫా సెట్లు, ఫ్రిజ్, టీవీ క్లాత్‌వంటి ఫర్నీచర్ ఫ్యాబ్రిక్‌తోపాటు
సంచులు, బ్యాగులు, ఆభరణాలు ఇలా రకరకాల యాక్సెసరీలు కూడా
ఎంబ్రాయిడరీ సొగసుల్ని అద్దుకుంటున్నాయి.
దినదిన ప్రవర్థమానమయ్యే ఈ పరిశ్రమలోని నిపుణులు కొందరు 
ఎంబ్రాయిడరీకి కొత్తదనం ఆపాదించే ప్రయత్నంలో వున్నారు. త్రీడీ ఎఫెక్ట్సు, అక్షరాలు రాయడం, బొమ్మలు గీయడం వంటి వాటిలో సాప్ట్‌వేర్ టెక్నిక్స్‌ను జోడించేందుకు కృషి చేస్తున్నారు. 
సో...  మున్ముందు 
సూదీ దారం ఇంకెన్ని అందాల్ని సృష్టించనుందో!?

మీకు తెలుసా?




ఓ స్త్రీ బయటకు రా ?
 
రోజంతా ఇంటిపట్టునే కాలం గడిపే స్ర్తిలకు ఆస్టియోఫోరోసిస్ ముప్పు మరీ ఎక్కువగా ఉంటోంది. 
అందుకే స్ర్తిలను కాస్త ఎండలోకి రమ్మంటున్నారు పరిశోధకులు. 
మన ఇంట్లోనుంచి బయటపడితే చాలు ముప్పు తప్పుతుందంటారు.
శరీరంలో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. 
ఈ విటమిన్‌ను సూర్యరశ్మి సాయంతో మన శరీరమే తయారు చేసుకుంటుంది.
 
 
అయితే చాలామంది స్ర్తిలు ఇంటిపనులకే పరిమితమవుతూ రోజంతా 
నీడ పట్టునే ఉండిపోతున్నారు. దీనివల్ల ఒంటికి సూర్యరశ్మి సోకే అవకాశం లేక 
చాలామందిలో విటమిన్-డి లోపం తలెత్తుతోంది.
సహజంగా స్ర్తిలలో ఎముకలు బోలుగా, పెళుసుగా మారిపోయే ‘ఆస్టియో పోరోసిస్’ సమస్య అధికంగా ఉంటుంది. ఇక దానికి విటమిన్-డి లోపం కూడా తోడై... పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారుచేస్తుంది.
 
కాబట్టి గృహిణులు ఆలోచించాల్సిన విషయం ఇది. 
రోజూ ఎంతోకొంత సమయం ఒంటికి సూర్యరశ్మి సోకేలా ఎండలో గడపడమే దీనికి పరిష్కారం. 
ఈ ఉత్తమ లక్షణం వల్ల దీర్ఘకాలంలో ఆస్టియో పోరోసిస్ ముప్పును నివారించుకోవచ్చు.
ఆస్టియో పోరోసిస్ సమస్య నెలసరి దశ దాటిన స్ర్తిలలో మరీ ఎక్కువట. 
కాబట్టి ముందునుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదూ!

ఆహారం లో ఏది బెస్ట్

 శాహారమా,  మాంసాహామా  ఏది బెస్ట్?


   
ఇది శాకాహార యుగం. నాన్‌వెజ్ మానేసి చాలా కాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి.
అయతే, మాంసాహారం తినేవారు ఎక్కువ బలంగా ఉంటారని, శాకాహారులకు అన్నిరకాల ప్రొటీన్లు లభించవన్న వాదన మాత్రం వినిపిస్తూనే ఉంది. నిజానికి ఏ ఆహారం తీసుకోవాలనేది ముఖ్యం కాదు. దాన్ని మనం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామనేది ప్రధానం. నిజానికి మాంసాహారులైనా శాకాహారం తీసుకోకుంటే అనారోగ్యం పాలవుతారనే విషయం చాలామందికి తెలియదు. ప్రొటీన్లు మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా పుష్కలంగా లభిస్తాయి. కాని శాకాహార పదార్థాల్లో కొన్నింటిలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు మాత్రమే లభిస్తాయి. శాకాహారంలోని ప్రొటీన్ల నాణ్యత పెంచడం మన చేతుల్లోనే ఉంది. మన శరీరం తయారు చేసుకోలేని అమైనో ఆమ్లాలన్నీ అందేవిధంగా అన్ని రకాల పదార్థాలు కలిపి సమంగా తీసుకుంటే మాంసాహారానికి ధీటుగా శాకాహారంనుంచీ నాణ్యతగల ప్రొటీన్లను పొందవచ్చు.
ఇడ్లీ, దోశె, పెసరట్టు లాంటివాటిలో పప్పులను కూడా కలుపుతాం. కాబట్టి మామూలు అన్నం కంటే ఇవి మంచి ప్రొటీన్లు అందిస్తాయ. నూనె గింజలతో చేసిన పల్లీ చట్నీ, నువ్వుల కారం వంటి వాటితో కలిపి తింటే వీటిలోని ప్రొటీన్ల నాణ్యత మరింత పెరుగుతోంది. ఇలా సక్రమ పద్ధతిలో తీసుకుంటే శాకాహారం తీసుకునేవారు అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలనూ పొందగలుగుతారు.
పప్పుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ పప్పుల్లో లేని మిథియొనైన్ అనే అమైనో ఆమ్లం బియ్యంలో ఉంటుంది. పప్పు్ధన్యాల్లో ఉండే లైసిన్ బియ్యంలో ఉండదు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల నాణ్యత పెంచడానికి తప్పనిసరిగా రోజూ పప్పన్నం తినాలి. సాధారణంగా వయసు పెరిగిన వారు పప్పుతింటే గ్యాస్ సమస్యతో బాధపడాల్సి వస్తుందని పప్పులకు దూరంగా ఉంటారు. కాని చాలా సమయం వరకూ ఏమీ తినకుండా ఉంటేనే కడుపులో బాగా ఆమ్లం తయారై గ్యాస్ సమస్యకు దారి తీస్తుంది. అంతేగాని దీనికి పప్పు తినడమే కారణమనుకోవడం సబబు కాదు. వృద్ధాప్యంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఎక్కువగా ఎముకలకు బలం చేకూరడానికి కాల్షియంతోపాటు ప్రొటీన్లు కూడా కావాలి. పప్పులు తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా గాయం అయినప్పుడు పప్పులు మానేయాలని లేకపోతే చీము పడుతుందని చాలామంది భావిస్తారు. కాని పప్పు తినడం వల్లనే గాయం త్వరగా మానే అవకాశం ఉంది. గాయం మానాలంటే ఆ భాగంలో కొత్త కణజాలం ఏర్పడాలి. ఇందుకోసం ప్రొటీన్లు కావాలి. కాబట్టి ప్రొటీన్లనిచ్చే పప్పు అధికంగా తీసుకోవడం గాయాన్ని మాన్పడంలో తోడ్పడుతుంది.
అలాగే గింజలతో అధిక ప్రొటీన్లను పొందవచ్చు. ముఖ్యంగా తెల్ల నువ్వుల్లో యాంటి ఆక్సిడెంట్లు, మిథయొనైన్ అనే అమైనో ఆమ్లం అధిక మోతాదులో ఉంటాయి. అందుకే ఆయిల్ టెక్నాలజీ నిపుణులు రోజూ ఒక చెంచాడు తెల్ల నువ్వులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చిక్కుళ్ళు, శెనగ, బఠాని వంటి లెగ్యూమ్స్‌లో అధిక మోతాదులో ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటి గింజలను మొలకెత్తించినపుడు ఎంజైములు చైతన్యవంతవౌతాయి. కాబట్టి వీటిని తీసుకుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే గోధుమ రంగు సోయా చిక్కుళ్ళలో అత్యధిక శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటిని పది నిమిషాలు వేయించిగాని, కొద్దిసేపు నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి గాని తింటే ఆరోగ్యకరం.
మసాలా దినుసులు వాడే గసగసాల్లో 27 శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటి ద్వారా అన్నింటికన్నా ఎక్కువ కాల్షియం లభిస్తుంది. వీటిని మసాలాగానే కాక పాయసం రూపంలో కూడా తీసుకోవచ్చు. రాత్రి పూట పాలలో కలుపుకుని తాగితే వాటిలో ఉంటే ఓపియం ప్రభావం వల్ల నిద్ర బాగా పడుతుంది.
శరీర పెరుగుదలకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు మాత్రమే కాదు, కేలరీలు కూడా కావాలి. అందుకే మాంసాహారం తీసుకోవడం వల్లనే శరీరానికి బలం చేకూరుతుందనుకోవడం నిజం కాదు. కేలరీలను తగిన మోతాదులో అందించే శాకాహారం కూడా తీసుకుంటూ క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మనం తీసుకున్న ప్రొటీన్లు జీర్ణం కావాలంటే శక్తి కావాలి. ఈ శక్తికోసం కార్బోహైడ్రేట్ల మీద ఆధారపడక తప్పదు.
అందుకే అన్నం, కూరగాయల వంటి శాకాహారం జోలికి పోకుండా కేవలం చికెన్లు, మటన్లు తీసుకుంటే ఏమాత్రం లాభం ఉండదు. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు జీర్ణం కావడానికి కావలసిన కొన్ని రకాల ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ తయారు కావడానికి ఈ ఖనిజాలు అవసరం. మాంసాహారంలో లభించని ఖనిజాలు శాకాహారంలో ఉంటాయి.
మాంసాహారులు సైతం పండ్లు, కూరగాయలను తీసుకోక తప్పదు.
మాంసాహారంలో పీచు పదార్థాలు అసలే వుండవు. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడానికి, పేగుల కదలికలకు ఈ పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందువల్ల ఫైబర్ కోసం శాకాహారంపైన ఆధారపడక తప్పదు.

యువతరం వెర్రికేక

ఫ్యాషన్ ఓషన్


  

ఫ్యాషన్ నేటి యువతరం జీవితంలో ఒక భాగం. 
ఫ్యాషన్ లేకపోతే, యువత మనుగడ ఎలా ఉంటుందో ఊహించలేం.
దినచర్య ఫ్యాషన్‌తోనే ప్రారంభమవుతోందంటే ఫ్యాషన్ స్థానం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. 
ఫ్యాషన్ నేటి ప్రపంచాన్ని ఒక కోణంలో శాసిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
కాలంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫ్యాషన్స్ మారడం సహజమే.
అయినా, వాటిని అనుకరించడమే జీవితంగా మార్చుకోకూడదు.
చిన్నతనంలో నిబంధనలనుంచి స్వేచ్ఛా జీవితంలోకి..
తిరిగిరాని, మరవలేని టీనేజీలోకి అడుగుపెట్టే యువతరం తమ జీవితంలో ఏదో ఆస్వాదించాలని 
ఫ్యాషన్ వైపు పరుగులు తీస్తున్నారు. నేడు కానె్వంట్‌కు వెళ్ళే పిల్లలు కూడా స్టైల్‌గా వుండాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి బాల్య జీవితాన్ని వదిలి కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టే యువతరం
జీవితంలో ఫ్యాషన్ ఒక భాగంగా మారిపోయింది. ఫ్యాషన్లకు ప్రతిపాదనలుగా
మన కాలేజీ పరిసరాలను పేర్కొనవచ్చు.

అందరిలో భిన్నంగా వుండాలని కొందరనుకుంటే, 
మరికొంతమంది రొటీన్లకు భిన్నంగా వుండటమేనని అంటున్నారు. 
ఏ రకంగానైనా ఒక కొత్తదనాన్ని అందిస్తూ రొటీన్‌కు భిన్నంగా వుంటే చాలు అని అనుకరిస్తున్నారు. 
ఫ్యాషన్లను రెండు రకాలుగా అభివర్ణించవచ్చు. పాశ్చాత్య ప్రభావానికి గురయ్యే ఫ్యాషన్లు 
ఒక రకం కాగా మరొకటి స్వదేశీ సంప్రదాయాలను అనుకరించేవి.
నేడు ఫ్యాషన్లో మెళకువలు నేర్పించేందుకు కళాశాలలు కూడా 
ప్రత్యేకంగా కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

ఫ్యాషన్ పారిస్‌లో పుట్టిందని భావిస్తున్న ఈ పదం 
నేడు ప్రపంచంలో అందరికీ కడు ప్రీతిపాత్రమైంది. 
మారుతోన్న అవసరమే అయినా అదే జీవితంగా కాకూడదు. 
కానీ నేడు అలా జరగడం లేదు.
ఫ్యాషన్ లేనిదే నిద్ర కూడా పట్టని స్థితికి నేటి యువత చేరుకుంది. 
కాలానికి తగ్గట్టుగా హుందాతనాన్ని జోడించే ఫ్యాషన్లు కూడా మార్కెట్లోకి మరిన్ని ప్రవేశించాయి. 
ఒక ఉత్పత్తిని అమ్మడం కోసం ప్రకటనలలో వైవిధ్యం చూపుతుండడంతో
ఫ్యాషన్లు మరీ విపరీతంగా పెరిగిపోయాయి. క్షణక్షణానికి ఫ్యాషన్లు 
అన్ని అంచుల్లోనూ మారిపోతున్నాయి.


ఫ్యాషన్‌గా వుండడం తప్పులేదు కానీ, 
అదే పనిగా కాలాన్ని వృధా చేసుకుంటూ దాని గురించే ఆలోచించడం చాలా తప్పు. 
కొంతమందికి వృత్తిరీత్యా ఫ్యాషన్‌గా వుండడం తప్పనిసరి.
మోడల్స్, సినీతారలు ఫ్యాషన్‌గా వుండకపోతే వెనకబడిపోతారన్నది వాళ్ళ అభిప్రాయం.
ఆ రంగం కూడా అటువంటిదే.
అయితే మనం మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో వుంది.
పెడదారి పట్టించే పాశ్చాత్య సంస్కృతిని 
మనం అనుకరిస్తే ఎలా?

మోడల్స్, తారలతో పాటు 
ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా కొత్త ఫ్యాషన్లను 
ముందుగా తామే అనుకరించాలని మరీ తపన పడిపోవడం, 
అందరూ తమనే గుర్తించాలని విచిత్రంగా ప్రవర్తించడం విడ్డూరం.
అవసరానికి మించి ఎవరు అనుకరించినా అది ఎబ్బెట్టుగానే వుంటుంది.
 సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి స్థాయిని మించి ప్రవర్తించినట్టుగా 
సమాజంలో హేళన భావన కూడా ఏర్పడుతోంది. ఫ్యాషన్‌గా వుండాలని
అందరూ అనుకుంటే అది ఎంతమందికి సాధ్యపడుతోంది.

‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్న’ చందంగా 
పాశ్చాత్య ఫ్యాషన్లకు లోనై మన సంస్కృతిని మంటకలపడం ఎందుకు?
కొత్త కొత్త ఫ్యాషన్లను అనుకరించడం డబ్బు ఖర్చు చేయడం కాక యువత పెడదారి పట్టే
అవకాశాలు ఏర్పడ్డాయి. గతంలో ఈ ఫ్యాషన్లను ధనిక వర్గాలే ఎక్కువగా అనుకరించేవి. 
అయితే ఈమధ్య సాదా సీదా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత కూడా అనుకరిస్తోంది.
ఇటీవలకాలంలో వీరితో పాటు పెద్దవాళ్ళు కూడా పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారు. 
ఈ ఫ్యాషన్లు ఎలా ఉండాలనేది మనం శాసించాలేగానీ, మనల్ని ఫ్యాషన్లు ఆడించే స్థితికి చేరుకోకూడదు.
-కంచర్ల

బ్లాగు సంకలిని - జ్యోతి వలబోజు



బ్లాగు సంకలిని


 జ్యోతి వలబోజు


భావవ్యక్తీకరణకు అద్భుతమైన వేదిక బ్లాగు. ఆలోచనలకు అక్షరరూపమిచ్చి వాటిని తమ బ్లాగులో పొందుపరుచుకుని పదిమందితో పంచుకుంటున్నారు. ఇప్పుడు రెండువేలకు పైగా తెలుగు బ్లాగులు ఉన్నాయి. అందులో సుమారు యాభైకి పైగా బ్లాగుల్లో నిత్యం హడావిడిగానే ఉంటుంది. ఏదో ఒక బ్లాగులో కొత్త టపా లేదా పోస్టు ఉంటుంది. వాటిల్లో కవితలు, రాజకీయాలు, వంటలు, క్రికెట్ లేదా ఏదైనా విషయంపై సీరియస్ చర్చలు కూడా జరుగుతుంటా యి. మరి ఇన్ని బ్లాగులను ఎలా చూసేది? అన్ని అడ్రస్సులు లేదా యు.ఆర్.ఎల్. (బ్లాగు చిరునామా) ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఈ సమస్యకు పరిష్కారమే ఆ గ్రిగేటర్ లేదా సంకలిని, బ్లాగులన్నింటిని ఒకే చోట చూడగలిగే మార్కెట్ అని చెప్పవచ్చు. ఈ రోజు ప్రాచుర్యం పొందిన సంకలినులు నాలుగు ఉన్నాయి. అవి. కొత్తగా బ్లాగు మొదలెట్టగానే ఈ సంకలినులకు వెళ్లి బ్లాగు చిరునామా తదితర వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు బ్లాగులో కొత్త టపా రాసిన కొద్ది నిమిషాల్లోనే బ్లాగు పేరు, టపా శీర్షికతో సహా సంకలినుల్లో ప్రత్యక్షమవుతుంది. కొత్త టపాలు ఏమేమి వచ్చాయో తెలుసుకోవడానికి సంకలినికి వచ్చినవాళ్ళు ఆ లంకె (లింకు) పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి, చదివి తమ స్పందన తెలియజేస్తారు. వీటన్నింటికి మనకు ఎటువంటి ఖర్చూ ఉండదు. కాని సంకలినులు నిర్వహించడానికి మాత్రం ఖర్చు తప్పదు. ఈ సంకలినులు లేదా ఆగ్రిగేటర్లు నిర్వహించేవారు తమతమ వృత్తులలో తీరికలేకుండా ఉన్నా, తెలుగు భాషమీది అభిమానం, బ్లాగులన్నింటినీ ఒక్కచోట చేర్చి చూపించాలనే సదుద్దేశంతో ఖర్చుకు వెనుకాడడం లేదు. బ్లాగులను చూపించడమే కాక ప్రతీ సంకలినిలో విభిన్నమైన ప్రత్యేకతలు, విభాగాలతో అందరికీ సులువుగా ఉండేలా నిత్యం కృషి చేస్తున్నారు. ఇలా చెయ్యడంవల్ల వాళ్ళకు ఎటువంటి ఆదాయమంటూ లేదు. కాని మాతృభాషకోసం పని చేస్తున్నామన్న సంతృప్తి కనిపిస్తుంది.
కూడలిలో వివిధ విభాగాలు ఇలా ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, వార్తా పత్రికలూ, ఫొటో బ్లాగులు, సేకరణలు రాసే బ్లాగులు, చివరిలో తెలుగు బ్లాగర్ల ఇంగ్లీషు బ్లాగులు. అదే విధంగా అన్ని బ్లాగులలో మరిన్ని విభాగాలు మనకు లభ్యమవుతాయి. సినిమా విశేషాల బ్లాగులు, సాహిత్యానికి సంబంధించిన బ్లాగులు, హాస్యం, సాంకేతికం, రాజకీయాల గురించి తరచూ రాసే బ్లాగులు. మనకు నచ్చిన విభాగంలోని బ్లాగులను చాలా సులువుగా చదవవచ్చు. కూడలిలో ఉన్న మరో ప్రత్యేకత. ఫొటో బ్లాగులు. తెలుగువారి ఫొటో బ్లాగులు పొందుపరచబడ్డాయి. కూడలి మొదటి పేజీలో ఈ ఫొటో బ్లాగులలోని ఏదో ఒక యాదృచ్ఛిక చిత్రం కనిపిస్తుంది. దానంతట అదే మారుతుంది కూడా. ఈ జల్లెడలో బ్లాగులు విభాగాల వారీగా జల్లించబడి సులువైన క్యాటగిరీలలో మనకు అందించబడతాయి. మనం బ్లాగు టపా రాయగానే ఇచ్చే లేబుల్స్ ఆధారంగా సదరు టపాలు ఇక్కడి వివిధ విభాగాలలో చేరిపోతాయి. ఇందులో ఉన్న విభాగాలు చూద్దాం. అన్నీ కబుర్లు, హాస్యం, రాజకీయం, కవితలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, కొత్తబాబులు (కొత్త బ్లాగులు), స్ర్తి (మహిళా బ్లాగులు మాత్రమే), సాంకేతికం, సినిమా పత్రికలూ (అంతర్జాల పత్రికలు).. ఇందులో తాజా వ్యాఖ్యలు, తాజా టపాలు విడివిడిగా చూడవచ్చు. అంతేకాదు తెలుగు బ్లాగుల జాబితా కూడా లింకులతో సహా ఇందులో చూడవచ్చు. జల్లెడలో ఉన్న మరో విశేషం.. ఇందులో మనం బ్లాగు రచయిత పేరు ఆధారంగా, మనం రాసిన కామెంట్ల ఆధారంగా కూడా టపాలు, బ్లాగులను జల్లించవచ్చు (చూడవచ్చు). దీనికి ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉంది. భారతీయుల ఇంగ్లీషు బ్లాగులు ఇక్కడ చేర్చబడ్డాయి. జల్లెడను తెలుగులోనే కాక RTSలో కూడా చదవగలిగే అవకాశం ఉంది.
హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజీలో ఎడమవైపు భాగంలో రచయితల పేర్లు, వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపబడతాయి. కుడి భాగంలో హారం చేసే రకరకాల విశే్లషణలు చూపబడతాయి. గతవారం రోజుల్లో ఎక్కువగా ఏ బ్లాగులు చదివారో చూపిస్తుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొకసారి మాత్రమే మారుతుంది. అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇది కూడా రోజుకొక్కసారే మారుతుంది. అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజులపాటు హోమ్ పేజీలో చూడొచ్చు. అంటే చందమామ, జ్యోతి, స్వాతి, భూమి లాంటి పత్రికలు కూడా ఉంటాయి. పద్య, సాహిత్య, వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది. కుడివైపు ఇచ్చిన ఆప్షన్‌లో మీకు కావలసిన విభాగంలోని బ్లాగులు చూడవచ్చు. అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు. హారంలో బ్లాగు టపాలే కాక ప్రతి బ్లాగులోని వ్యాఖ్యలు కూడా వేరే పేజీలో తెరిచి చదువుకోవచ్చు. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్లపైన క్లిక్‌చేసి సులభంగా వారివారి వ్యాసాలను, వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
మాలికకు ప్రత్యేక ఆకర్షణ... టపా రాసిన ఐదు నిమిషాలలోపల మాలికలో కనిపిస్తుంది. ఓపెన్ చేయగానే ముందుగా ఆకర్షించేది అందమైన ఫొటో పక్కనే వెబ్ పత్రిక వివరాలు. ఫొటోలు, వాటిని తీసిన బ్లాగర్ వివరాలు అన్ని పేజీలలో కనబడతాయి. ఈ ఫొటోలతో పాటు వెబ్ పత్రికలు కూడా అన్ని పేజీల్లో వస్తాయి. మాలికలో కనబడే వెబ్ పత్రికల టపాలు ‘రియల్ టైమ్’లో వస్తాయి. అంటే, అక్కడ వాళ్ళు ప్రచురించిన వెంటనే ఆలస్యం లేకుండా ఇక్కడ కనబడతాయి. మరి మీరు బ్లాగు మొదలెట్టగానే ముందుగా ఈ ఆగ్రిగేటర్లలో చేర్చడం మరచిపోవద్దు.
కూడలి... http://koodali.org/
మాలిక... http://maalika.org/
హారం... http://haaram.com/
జల్లెఢ... http://www.jalleda.com/

సోమవారం, మార్చి 28

ఇల్లే... ఓ ఔషధ శాల





ఇల్లే... ఓ ఔషధ శాల

 



హోం  ట్రీట్మెంట్ 


ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగుపెట్టడం ఆ రోజుల్లో
మనకు అలవాటై పోయిందిగానీ చిన్న చిన్న అనారోగ్యాలకు
మన వంటిల్లే ఔషధశాలగా పనిచేస్తుంది.
మనం వంటల్లో ఉపయోగించే చాలా వాటిల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
అంతకుమించి ఇవి శరీరానికి ఎలాంటి హాని కూడా చేయవు.
కాబట్టి తరచుగా వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు, దెబ్బలు, గాయాలకు వంటిల్లే క్లినిక్ సెంటర్.
మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతుక్కునే ముందు
ఒకసారి వంటింట్లోకి వెళితే బాధితుల బాధకు దివ్యౌషధాలు దొరుకుతాయి.

నోటిపూతకు: చాలామందికి నోటిపూత చాలా బాధిస్తుంది. 
అంతేకాదు మందులు వేసుకున్నా అంత త్వరగా తగ్గదు. 
ఒక్కోసారి నోట్లో పుళ్లు మానేసరికి వారాలు, నెలలు కూడా పట్టవచ్చు. 
నోటిపూతకి టీ బ్యాగులతో మంచి చికిత్స చేయవచ్చు. టీలో ఉన్న టానియన్స్ నోటిపూత బాధనుంచి వెంటనే ఉపశమనం కల్గిస్తుంది. ఇది పొక్కులపై పూతగా ఏర్పడి బాధను తగ్గిస్తుంది.
టీ బ్యాగుని గోరువెచ్చని నీటిలో ముంచి తర్వాత దానిని నాల్కమీద ఉంచుకోవాలి. 
కొన్ని నిమిషాలు అలాగే ఉంచితే బాధ తగ్గుముఖం పడుతుంది.

చక్కని శ్వాసకు:
  శ్వాస సమస్యతో బాధపడే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు 
హఠాత్తుగా తమ ఇన్‌హేలర్ అయిపోతే వెంటనే ఒక కప్పు కాఫీ తాగమంటున్నారు పరిశోధకులు.
శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను తొలగించే మందులు 
ఎలా పనిచేస్తాయో కెఫిన్ రసాయనిక చర్య కూడా అంత బాగా పనిచేస్తుంది. 
అయితే ఇన్‌హేలర్‌కి బదులు పూర్తి ప్రత్యామ్నయంగా కాఫీనే వాడమని చెప్పడంలేదు. 
ఇన్‌హేలర్ అందుబాటులో లేనపుడు, అత్యవసర సమయాల్లో 
రెండు కప్పులు బ్లాక్ కాఫీ తాగితే సరిపోతుంది.

పొట్ట సమస్యలకు: 
 అల్లం టీని చాలామంది వాడుతుంటారు.
అది రుచికే కాదు వైద్యానికీ భేషైనది. అజీర్తి, కడుపులో తిప్పడం లాంటి 
బాధలు అల్లం టీతో వెంటనే సర్దుకుంటాయి. అలాగే వాంతులు వచ్చినట్లుండటం, 
తల తిప్పటం మొదలైన వాటిని కూడా తగ్గించగలుతుంది.

కాలిన గాయాలకు: 
 కాలిన గాయాలకు ‘తేనె’ బాగా పనిచేస్తుంది. 
చర్మం కాలినపుడు జరిగే హాని చాలావరకు గాయాలమీద కింద బొబ్బలవల్లే జరుగుతుంది.
చర్మం కాలినపుడు బొబ్బలు, వాపు రాకుండా నివారించే చర్యలో తేనె బాగా పనిచేస్తుందని
వైద్యులు పరిశోధనలు చేసి చెబుతూనే ఉన్నారు. చిన్నపాటి కాలిన గాయాలకు తేనెని వాడవచ్చు. 
ముందు చర్మంపై కాలిన ప్రదేశాన్ని నీటి ధారకింద ఒక నిమిషంపాటు ఉంచాలి.
దీనివల్ల చర్మం ఇంకా లోపల ఉడికిపోవటం తగ్గుతుంది. తరువాత ఆ ప్రదేశంలో 
సున్నితంగా తేనెని రాసి, బాండేజ్ వేయాలి. అయితే దీనిని 
చిన్న గాయాలకు మాత్రమే వాడటం మంచిది.

తెగిన గాయాలకు: 
చర్మం తెగి గాయమైతే అది మరింత హాని చేయకుండా 
తెగిన చోట వెంటనే చిటికెడు నల్ల మిరియాల పొడిని చల్లాలి. 
దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి.
ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్ ఎలాగైతే మంటపుడుతుందో
అలాగే నల్ల మిరియాల పొడి కొన్ని సెకన్లపాటు మంటపుడుతుంది. 
ఇది చర్మ కణాలకు ఎలాంటి హాని చేయదు.

వెక్కిళ్ళకు:
వెక్కిళ్ళు ఒక్కోసారి చిరాకు, అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. 
వీటిని ఆపడం అసాధ్యమవుతుంది. అప్పుడు ఒక చెంచా ‘పంచదార’ను తింటే చాలు. 
వాటంతట అవే తగ్గిపోతాయి.

దోమలు, తేనెటీగలు కుడితే:
తేనెటీగ కుట్టి బాధపడుతున్నపుడు, దోమలు కుట్టినపుడు వచ్చే దురదలకు 
‘బేకింగ్ సోడా’ చక్కగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించటమే కాకుండా వాపుని రాకుండా ఆపుతుంది. 
అలాగే మచ్చలు కూడా ఏర్పడవు.

జలుబుకు: 
 తగిన శాస్ర్తియాధారాలు లభించినప్పటికీ జలుబుకి 
మసాలాలు దట్టించిన ఆహారం, కోడి మాంసం వంటివి తీసుకుంటే 
ఉపశమనంగా ఉండటం గమనించవచ్చు. జలుబుకు చేపల కూర పులుసు మరీ బెస్ట్.
మురికిని వదిలించేందుకు: స్నానానికి ఉప్పు వాడకం వింటున్నాం కాని 
ఇదో కొత్త పద్ధతి. ఒక కప్పు పంచదార తీసుకుని పేస్టులా కలపాలి.
దీనిని ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేయడం ద్వారా మురికి బాగా వదులుతుంది. 
మీకిష్టమైన క్లెన్సర్‌ను కూడా దీనితోపాటు వాడవచ్చు.
  పాలిచ్చే తల్లుల కోసం:
  తల్లికి పాలు గడ్డకట్టడంవల్ల రొమ్ముల్లో వచ్చే వాపు, నొప్పులకు క్యాబేజి ఆకులు ఉపశమనం ఇస్తాయి.
చెస్ట్‌పై క్యాబేజి ఆకులను పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా 
వాపూ తగ్గుతుంది. అలాగే బహిష్టుకి ముందు వచ్చే రొమ్మునొప్పికి క్యాబేజి ఆకులు
ఉడికించి కట్టడంవల్ల మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజీకి ఆకులు (పైపొరలు) పెద్దవి చేసి 
వాటిని మెత్తబడేవరకు ఉడికించి, వీటిని గోరువెచ్చగా అయ్యాక నొప్పిగా ఉన్న రొమ్ముల మీద 
బాగా చల్లారేదాకా ఉంచితే ఉపశమనం తప్పక ఇస్తుంది.
గొంతు నొప్పులకు: 
గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటితో ఒక స్పూను ఉప్పు కలుపుకుని బాగా పుక్కిలించాలి.
ఇలా రోజుకు మూడునుంచి నాలుగుసార్లు చేయవచ్చు. అలాగే బాగావేడి చేసి
నోరు పూసిన వారు కూడా ఇలానే చేస్తే ఉపశమనం ఇస్తుంది.

శిరోజాలకు:
నూనె, గుడ్డు, పాలు కలుపుకుని 
ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని స్నానం చేయడంవల్ల జుట్టు
పొడిబారడం తగ్గుతుంది.
అందంగా, శిరోజాలకు మెరుపును సంతరించుకుంటుంది.
వెంట్రుకలు వూడిపోకుండా
మిశ్రమం బాగా పనిచేస్తుంది.

కళ్ళకు:
బంగాళా దుంపలను చక్రాలుగా కోసుకుని కళ్ళపై ఐదారు నిమిషాలు ఉంచుకుంటే
కళ్ళ కింద చర్మం జారడం, కళ్ళకు కలిగిన శ్రమ తగ్గుతాయి.
ఇలాగే దోసకాయ కూడా పనిచేస్తుంది. కళ్ళు మంటలు తగ్గుతాయి.
అందానికి, ఆరోగ్యానికి ఇవన్నీ దివ్యౌషధాలే!
-  కంచర్ల

తల్లి బిడ్డల బంధం

  



 ఇరువురికి మధురిమే


అమ్మ తన బిడ్డకు ఏం చేస్తుంది. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు
సమాధానం ఎక్కడనుంచి మొదలుపెట్టి ఎక్కడ అంతం చేయాలో తెలియని స్థితి ఏర్పడుతుంది. 
ఒక వ్యక్తి పుట్టి, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పెరగటంలో ‘అమ్మ’ పాత్ర ఎంతో ఉంటుంది. 
దీనిని ఎవరూ విడమరిచి మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. 
వైద్య పరిశోధనా నిపుణులూ అదేమాట అంటున్నారు.

అలాగే తల్లి కావటంవల్ల స్ర్తిలు పొందే ఆరోగ్య ప్రయోజనాలూ చాలా ఉన్నాయి. 
దీనిని బట్టి ‘‘మాతృత్వం’’ అనేది తల్లీ బిడ్డలు ఇరువురికీ మధురిమే అని చెప్పాలి.

పిల్లల మనస్తత్వం వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలమీద, 
పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఇక్కడ పెరిగిన వాతావరణం అనే అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని 
జతచేయాలంటున్నది ‘సైన్స్’.
‘పెరిగిన వాతావరణం’ అనే మాటను తల్లి సృష్టించిన వాతావరణంగా 
మార్చాలని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. మొదటి మూడు సంవత్సరాలు పిల్లల పెరుగుదలలో
చాలా ముఖ్యమైన దశ అని, ఆ సమయంలో వారిపై తల్లి ప్రభావం మరింతగా ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. పిల్లల్లో స్పర్శ, చూడటం, వినటం మొదలైన కార్యకలాపాల ద్వారా తెలివితేటలు పెరుగుతాయి.
వారు తల్లిదండ్రులను అనుసరిస్తూ మాట్లాడటం నేర్చుకుంటారు. వారు చేయాలనుకుంటున్నవి ఎదురుగా కనిపిస్తుంటే మరింత త్వరగా నేర్చుకుంటారు.
చిన్నపిల్లలు... వారికేం తెలుసు... అనుకుంటాం కానీ,
వారి మెదడు ఎప్పుడూ తమకు తెలిసిన వారితో అనుసంధానం అయివుంటుందని, 
గమనింపు ఎక్కువ ఉంటుందని మరీ ముఖ్యంగా తల్లిమీద పూర్తి ధ్యాసని పెట్టి ఉంటారని అందుకే
తల్లి ప్రభావం పిల్లలకు సంక్రమిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.
పిల్లలు తల్లి నుంచి పొందే ప్రయోజనలను పక్కనుంచితే మాతృత్వం కారణంగా
తల్లి పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తల్లి అయిన మహిళ 
తన వృద్ధాప్యంలో మతిమరుపుకి సంబంధించిన అల్జీమర్స్, డిమోన్షియా 
వ్యాధులకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే తల్లికావటంవల్ల ఉత్పత్తి అయ్యే
కొన్ని హార్మోన్లు ఆమెను ఆ వ్యాధులకు గురికాకుండా రక్షణ ఇస్తాయి.


చిన్న వయసులో తల్లి అయిన స్ర్తిలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
మొదటిసారి తల్లి అయ్యే వయసుకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలకు సంబంధం ఉంది.
గర్భిణీ సమయంలో విడుదల అయ్యే హార్మోన్లు ట్యూమర్‌ని అణచివేసే ప్రొటీన్ల మీద ప్రభావం చూపుతుంది

.
చిన్నవయసులో అంటే శారీరక పెరుగుదల, మార్పులు ఇంకా పూర్తికాని తరుణంలో
తల్లికావటంవల్ల ఈ ప్రభావం జీవితాంతం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 
తమ ఇరవై ఏళ్ళ వయసులో తల్లి అయిన మహిళలకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది. ఏదిఏమైనా...
తల్లి కావటం ఆమెకే కాదు... పిల్లలకూ.. ఇంటిల్లిపాదికీ మధురిమే.

-కంచర్ల