-కంచర్ల
నీలాకాశం కన్నా భామ కురులే హాయి అనుకున్నారేమో.. సూర్య
చంద్రులే దిగివచ్చి నడినెత్తికి కాస్త కింద జడపైన అందంగా కూర్చున్నారు. వీరి ప్రక్కనే చేరాయి.. రాగిడీ, కొమ్మలూ. ఆ రెండూ జంట కవుల్లాంటివి. ఒకటి ఉంటే మరొకటి ఉండాల్సిందేనట.
నడుముకు వడ్డాణం పెట్టుకుంటే... ఉదర సంబంధ వ్యాధులు రావట. ముఖ్యంగా బాలింతలకి చాలా మంచిదట.
ముక్కెర పెడితే... సైనస్ వ్యాధులు తగ్గుతాయట.
... ఇలా మగువలు ధరించే ప్రతి ఆభరణం వెనకా ఓ హెల్తు రీజను ఉండనే ఉందన్నది ఆభరణశాస్త్ర ఉవాచ. అందుకే కాబోలు... నాటి రాజులు, రాణులు శిరోవ్యాధులు రాకుండా ఉండేందుకే నెత్తిన కిరీటాలు, ఇతర ఆభరణాలు ధరించేవారు.
నాటి ఆ ఆభరణాలు నేడు ఈ తరం ఫ్యాషన్‌గా మారింది.
మన కవులు చెప్పే... పదహారు సింగారాల్లో.. కేశాలంకరణల్లో... జడ ఒకటి. దాని గొప్పతనం చెప్పడం కష్టం.
సావిత్రి, వాణిశ్రీ, కాంచన... వీళ్ళలో ఎవరు కళ్ళ ముందు కదిలినా గుర్తొచ్చేది ఎక్కువగా వాలు జడ లేదా అప్పుడప్పుడూ ముడి.
ఇవే ఆనాటి హెయిర్ స్టైల్స్. పల్లెటూరి అమ్మాయిలైతే జడలూ, పట్నం అమ్మాయిలైతే రకరకాల ముడులూ అప్పట్లో షరా మామూలే.
నాగరం పాయ, ఈత పాయ వంటి జడలూ, తూర్పు పడమర కొప్పులూ.. ఇలా వీటిల్లో రకాలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి అలంకారాలే అతివలకి అందం, ఆరోగ్యం... ఆనందమూ!
అసలు.. ఈ కేశాలంకారం ఎప్పటిదీ అంటే..? క్రీ.పూ. రెండు వేల సంవత్సరాలనాటినుంచీ ఉండేదని చరిత్రకారుల ప్రవచనం. అంతెందుకు?... వాల్మీకి రామాయణంలోని సుందరకాండ నడిచింది. ‘చూడామణి’ అంటే సిగపిన్ను చుట్టూ కదూ!... సీతమ్మను కలిశాననీ, ఆమె క్షేమంగా ఉన్నదనీ రామయ్యను నమ్మించేందుకు గుర్తుగా హనుమంతుడు మరీ ఆమెను అడిగి తీసుకున్నది ఈ సిగపిన్నునే!
అతివల సింగారం కేశాభరణాలతోనే సంపూర్ణం. సిగ్గుపడుతూ నడిచేటప్పుడు వయ్యారాన్ని ఒలికించే వాలుజడ... కోపమొస్తే తాచుపాములా మెడను చుట్టే ఆ జడ గొప్పతనం అంతా ఇంతా కాదు. మరి అంత గొప్ప జడకి అలంకారం అంటే సామాన్యమా?
నీలాకాశం కన్నా భామ కురులే హాయి అనుకున్నారేమో.. సూర్యచంద్రులే దిగివచ్చి నడినెత్తికి కాస్త కింద జడపైన అందంగా కూర్చున్నారు. వీరి ప్రక్కనే చేరాయి.. రాగిడీ, కొమ్మలూ. ఆ రెండూ జంట కవుల్లాంటివి. ఒకటి ఉంటే మరొకటి ఉండాల్సిందేనట. వీటి సరసనే కాగితాలూ, తమలపాకులూ ఇక పొడవాటి జడమధ్యలో తళుక్కున మెరిసే తిరుగుడు పువ్వూ, చామంతి పువ్వులూ. చివరికొస్తే ఒయ్యారంగా కదిలే బంగారు కుప్పెలూ, మళ్ళీ పైకొస్తే పాపిట నుంచి నుదుటిమీదకి జారినట్లుండే పాపిటబిళ్లే, చెవుల మీదనుంచీ, చెంపలనుంచీ జుట్టులోకి వచ్చే మాటీలు, చెంప సరాలూ.. అబ్బ ఎన్ని అలంకారాలో...!

ఇక జడ మొత్తంగా ఉండే బంగారు తొడుగు అదే ‘నాగరం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఈ జడలో బంగారంతో చేయించిన కెంపులూ, పచ్చలు, వజ్రాలు.. వంటి విలువైన రత్నాలు తెలుగు నాట మహిళలు అలంకరించుకునే ఆభరణాలు. బంగారంతోనే కాదు వెండి, ఇతర లోహాలు, గాజుపూసలు, జర్దోజీ దారాలతో అల్లిన జడలూ అలంకరించుకోవటం మామూలే. ఇక పూలజడ సరేసరి.
మినీ స్కర్టులూ, జీన్సూ, పోనీటెయిళ్లూ, బాబ్డ్ హెయిర్‌ల రాకతో జడ కాస్తా కటింగయిపోయింది. లూజ్ హెయిర్‌గా స్టైల్‌పోతుంది. దాంతో ఆమధ్య కొంత కాలం కుప్పెలూ గట్రా విరామం తీసుకోక తప్పలేదు. అవి ఎంతకాలం..?
‘‘పోతే కొత్త అన్నట్లు పాతవన్నీ మళ్ళీ వచ్చాయి. కారణం ఈనాటి అతివలలో సందర్భానుసారంగా మోజుతో అలంకరించుకుంటున్నారు. డ్రెస్సును బట్టి హెయిర్ స్టైల్. క్యాజువల్ డ్రెసెస్‌లో జుట్టు పొట్టిగా ఉండాలి. ఫంక్షన్లకి మాత్రం వాలుజడే కావాలి.. అందుకే అమ్మాయిలు సవరాలు పెట్టుకొని అయినా సరే చూడముచ్చటగా జడలల్లుతున్నారు.
వాటిని మళ్ళీ బంగారు జడలతోనూ బిగిస్తున్నారు. ఒకప్పుడు ఆర్డరిస్తేనే కానీ చేయని పసిడి జడలు నేడు రకరకాల డిజైన్లలో జ్యువెలరీ షాపుల్లో కొలువుదీరున్నాయి. బంగారం కొనే స్థోమత అందరికీ లేదు కాబట్టీ కృత్రిమ జ్యువెలరీలున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ ఉండనే ఉంది. వీటిని మించి క్రిస్టల్ యాక్సెసరీలూ, మొత్తం జుట్టంతా సింగారమే. దీని సిగతరగ... వేస్తే జడ విప్పితే ముడి కాదు, సిగ సిగే. దీని సొగసు చెప్పనలవి కానిది. ప్రౌఢ అందాన్ని తెలిపేదిదే.
ముఖ్యంగా ముడి సింగారం గురించి చెప్పాలంటే... బాలీవుడ్‌లో షర్మిలా ఠాగూర్, ఆశాపరేఖ్‌లనూ, తెలుగునాట వాణిశ్రీ వంటి వారినీ తలచుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. నడినెత్తిన, చెవిపక్కనా అంతెత్తున వీళ్ళు పెట్టే కొప్పులు అప్పట్లో భారీ ట్రెండ్‌నే సృష్టించాయి. కాస్త పెద్ద వయసొస్తేగానీ ముడి జోలికి పోని మగువలు ముప్ఫయ్యేళ్ళకే ముచ్చటపడి మరీ సిగ చుట్టేసేవారు. అయితే ఆ కొప్పుల్లో నాజూగ్గా ఓ గులాబీ పెట్టడంతోనే అలంకరణను సరిపెట్టేవారు. మరి ఇప్పుడో... ముడి ఫ్యాషన్ మాయలేదు. అలాగే ఉంది. ఈ తరం అతివలు మరీ యిష్టపడి ముడివేస్తున్నారు. పెళ్లికి జడ వేస్తే, రిసెప్షన్లకి ప్రత్యేక హెయిర్ స్టైల్స్‌తో మెరుస్తున్నారు.
మెస్సీరింగ్, బెర్లారినా, కాస్‌కేడ్, క్రిస్‌క్రాస్, సాఫ్ట్, రింగ్‌లెస్.. ఇలా రకరకాల ముడులను క్రిస్టల్స్‌తో తయారైన ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరిస్తున్నారు. మెరిసే ఈ లేటెస్ట్ హెయిర్ జ్యువెలరీలో.. పూలుంటాయి, కొమ్మలుంటాయి, చెట్లుంటాయి. పట్టుకుంటే ముళ్ళూ ఉంటాయి. జాగ్రత్త!
పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన టియెరాలు కొత్తగా మనకీ ఫ్యాషన్‌గా మారాయి. పుట్టిన రోజు వేడుకల్లోనూ, పెళ్ళిళ్ళల్లోనూ నెత్తిన కిరీటాలతో కాంతులీనుతున్నాయి.
ఇక బాబ్డ్ హెయిర్లకీ పోనీటెయిళ్ళకీ, పొట్టి జడలకూ బోలెడు యాక్ససరీలు.. హెయిర్ పిన్నులు, క్లిప్పులు, జడబిళ్ళలు.. వంటివన్నీ రంగు రంగుల రాళ్ళతో సిల్కు రిబ్బన్లతో చిత్రవిచిత్రమైన డిజైన్లలో తళుక్కుమంటున్నాయి. పూసలు, దంతం, చెక్కతో చేసినవీ వస్తున్నాయి. ఇలా సిగలో అలంకరించుకునే ఆభరణాలెన్నో ! సో... కొనాలేగానీ మనసు మెచ్చిన మగువల కోసం నగరీకుల ముంగిట బోలెడు కేశాభరణాలు.. ఎన్నో!... ఎనె్నన్నో!...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి