ముత్యమంతా పసుపు
-కె.ఎస్.
శరీరకాంతికి కాదు ఆరోగ్య రక్షణకు కూడా పసుపు దివ్యగుణం కలిగిన వస్తువు. పసుపును లక్ష్మిగా భావిస్తారు. అలాంటప్పుడు పాదాలకు పసుపు రాసుకోవడం తప్పని చాలామంది అనుకుంటారు. కాని భారతీయ సంప్రదాయాలను పాటించే స్ర్తిలు ఎవరైనా సరే నఖనుండి శిఖవరకు పర్యంతం పసుపు పూసుకుంటారు. అంటే లక్ష్మీదేవి శరీరమంతా కొలువుంటుందన్నమాట.
ముత్యమంత పసుపు ముఖానికి కాంతినిస్తే చిటికెడంత పసుపుకూరల్లో కలిసి ఆరోగ్యాన్నిస్తుంది. తెగిన గాయాలకు పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేసి వాటిని మాన్పుతుంది. అకస్మాత్తుగా శరీరంలో కలిగే శారీరక రుగ్మతవలన వచ్చే వణుకు పసుపు నీళ్లతో చల్లారుతుంది. గుమ్మాలకు పసుపురాసి బొట్టు పెడితే కళ వస్తుంది. క్రిములను సైతం పారద్రోలి కుటుంబానికి రక్షణనిస్తుంది.
పసుపు శుభానికి సూచిక. శుభకార్యాలను మొదలు పెట్టాలంటే మొదట పసుపును కొంటారు. పూజ ప్రారంభించాలంటే పసుపుతో వినాయక ప్రతిమచేసి మొదలెడతారు. పసుపు కొట్టి శుభలగ్నం నిర్ణయిస్తారు. పెళ్లికూతురికి ఒంటినిండా పసుపురాసి మంగళస్నానం చేయిస్తారు. పండుగ సమయాల్లో వేప మండలతో పసుపు నీళ్ళు ఊరంతా చల్లి ఆయా కాలాల్లో వ్యాపించే పొంగువంటి చర్మవ్యాధులను అరికట్టడానికి ప్రయత్నిస్తారు.
శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన రోజు. అందుకే స్ర్తిలు తలంటుస్నానమాచరించి ముఖానికి పాదాలకు నిండా పసుపు పులిమి ఆ దేవిని పూజిస్తారు. శుభప్రదమైన రోజుల్లో పసుపును పూసుకోవడం స్ర్తిలకు ఆనంద దాయకం. పాదాల వెంబడి శరీరంలోకి ప్రవేశించి బాక్టీరియా అరికట్టి నఖనుండి శిఖవరకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
పసుపులో అపారమైన వేడిచేసే గుణం వుందని భావించి కొంతమంది స్ర్తిలు ముఖాన బొట్టు స్థానంలోనూ పాదాన బొటన వ్రేలికి పసుపు పూసుకుంటారు. మేనిచ్ఛాయ మెరుగుకు పసుపు అద్భుతమైన కాస్మొటిక్, అందుకే స్ర్తిలరంగు ఏదైనప్పటికీ పసుపు రాసిన ముఖం కళగానూ కాంతిగానూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఒకప్పటి తరం మాట ఎలా ఉన్న నేటి జనరేషన్ దివ్యౌషధంగా పనిచేసే సంప్రదాయ పసుపును వదిలి మార్కెట్‌లో దొరికే ఖరీదైన ముఖ సౌందర్య కాస్మొటిక్స్ కోసం పరుగులు తీస్తుంది.
కాస్మొటిక్ ఎక్కువగా వాడేవారి ముఖంలో చర్మరంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువుగా కనిపిస్తుంటాయి. అదే పసుపురాసుకుంటే చర్మం కాంతితోపాటు ఆరోగ్యంగాకూడా ఉంటుంది. అందుకే నేటి తరం ఎక్కువ పసుపు(టెర్మరిక్) కలిసిన కాస్మొటిక్ ప్రిపేర్ చేయడం మేలు. అయినా టెర్మరిక్ ప్రభావం స్వచ్ఛమైన పసుపు రాసినంతగా పనిచేయదు.
పసుపు గుణాలు తెలిసినప్పటికీ ఫాస్ట్‌యుగంలో సంప్రదాయాలను పాటిస్తే హేళన చేస్తారనే భావన నేటి యువతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు సెలవురోజుల్లోనైనా నిండా పసుపు రాసుకుంటే ముత్యమంత పసుపు విలువేమిటో మీకే తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి