నడకే సింగారమా?
- సుబ్బానాయుడు
మీకు ఏమీ తోచడంలేదా? అయితే రోడ్డు ప్రక్కన నిలబడి రోడ్డుమీద నడుచుకుంటూ పోయేవారిని గమనించండి. రకరకాల మనుషులు, రకరకాల నడకలు మనకి కనిపిస్తాయి. మనిషెవరో తెలియకపోయినా అతని శరీర నిర్మాణం, నడకలో వేగం, నిటారుదనం, నడిచే భంగిమ వారి మనసుకు, భావావేశానికి అద్దం పడతాడు లేదా ఆమె నడక ఆధారంగా వారి మూడ్‌ను ఇట్టే అంచనా వేయవచ్చు. సంతోషంగా ఉల్లాసంగా ఉన్న కుర్రవయస్సోళ్ళు గాలిలో తేలిపోతున్నట్లుగా చలాకీగా అడుగులు వేస్తూ నడుస్తారు. కోపంగా ఉండి నేలను బాదుతున్నట్లు తప్పాతపా అడుగులు వేస్తూ నడుస్తారు.
అనుకున్నవన్నీ సాధిస్తున్న వ్యక్తి ఆత్మవిశ్వాసంతో తలను పైకెత్తి రిథమిక్‌గా చేతులు ఊపుతూ ఠీవిగా నడుస్తారు. నడుస్తున్నప్పుడు వారి కాళ్ళు నిటారుగా ఉండి, అడుగులు ఆచితూచి పడుతుంటాయి. సమస్యలతో సతమతమమవుతూ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న వ్యక్తి తలను కిందకి వంచి, చేతుల్ని వెనక్కు కట్టుకుని నిదానంగా నడుస్తుంటారు.
మూడ్ మీటర్.. మనం నడిచే నడక ఆ క్షణాన మనం ఉన్న మూడ్‌ని ప్రతిఫలిస్తుంది. ఇంగ్లీషు సినిమాలతో బాడీ లాంగ్వేజ్‌ని పర్‌ఫెక్ట్‌గా చూపిస్తుంటారు. నడకను బట్టి మనంకూడా రెండు ఎమోషన్స్‌ను తేలికగా కనిపెట్టవచ్చు. విషాదం, ఉల్లాసం రెండూ ఆ కదలికలకు సంబంధించినవే. విషాదం లేక నిరాశలో ఉన్న వ్యక్తి భూమిలోకి కుంగిపోతున్నట్లుగా భుజాల్ని కుదించి వేటినీ పట్టించుకోకుండా పరధ్యానంగా శరీరాన్ని ఈడుస్తున్నట్టుగా అడుగులు వేస్తారు.
ఒక వ్యక్తి జేబుల్లో చేతులుంచుకుని తలను వంచుకుని నెమ్మదిగా, అడ్డదిడ్డంగా నడుస్తుంటే అతను డిప్రెషన్‌లో ఉన్నాడనుకోవచ్చు. ఎవరిమీదైనా కోపంతో ఉండి ఆ కోపాన్ని వ్యక్తం చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటే అడ్డదిడ్డంగా నడుస్తూ మధ్యమధ్యలో దేనినో తన్నుతున్నట్లుగా గాలిలోకి కాలిని విసురుతుండవచ్చు. అది తనకు కోపంగా ఉన్న మనిషిని ఊహల్లో తన్నడం అన్నమాట. తాను ఎదుర్కొంటున్న సమస్యను సింబాలిక్‌గా తన్నడమూ కావచ్చు. ఈ రకమైన కోపంతో మహిళలూ ప్రదర్శిస్తుంటారు.
పచార్లతో నడక
పచార్లు చేయడం సామాన్యంగా ఆలోచనల్లో ఉన్నప్పుడు చేసే చర్య. పచార్లు చేసేటప్పుడు సాధారణంగా వీపు వెనుక చేతులు కట్టుకోవడం కూడా ఉంటుంది. పచార్లుచేస్తూ ఆలోచించడం మేధావుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సమస్య ఎంతకు తెగకపోతున్నప్పుడు నిర్ణయంకోసం లేక ముగింపుకోసం చేసే పరిష్కార యత్నమిది.
ఆ సమయంలో ఆలోచనలు పాజిటివ్‌గా వుంటాయి. ఇలాంటి సమయాల్లో మధ్యలో పలకరించి డిస్ట్రబ్ చేయకూడదు. అలా పలకరిస్తే వారి ఆలోచనలు ఒక కొలిక్కి రాకుండా మధ్యలోనే తెగిపోవచ్చు. ఒక్కోసారి ఎవరి కోసమన్నా నిరీక్షిస్తూ పచార్లు చేయడంకూడా ఉంటుంది.
ఠీవి నడక.. పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఠీవిగా నడిచే వ్యక్తిలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుంటుంది. మిలటరీ పనిచేసిన, చేస్తున్న వారిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నడకలో అడుగులు దూరంగా పడుతుంటాయి. చేతుల్లో ఊపు, శరీరంలో కుదుపు ఉంటాయి.
పిల్లి నడక.. ఈ నడకలో అతి జాగ్రత్త కనిపిస్తుంది. అడుగులు మరీ దగ్గరగా పడుతుంటాయి. ఒంటరితనాన్ని కోరుకోవడం, నిస్పృహ, అణుకువ ప్రతిఫలిస్తుంటాయి.
ఊసురోమనే నడక.. భుజాలు వేలాడి పోయి, తల కుంగిపోయి అడుగుల్ని ఈడ్చడం ఉంటుందీ నడకలో. బద్ధకం, భయం, నిరాశ, నిస్సహాయత, మానిసిక ఒత్తిడిలో ఉండటం ఈ నడకలో కనిపిస్తుంది.
హామీ మూడ్ నడక.. అడుగులు దగ్గరగా స్పీడుగా చేతిలో హ్యాండ్‌బాగో, పుస్తకమో ఉంటే ఊపుకుంటూ లేదా కూని రాగాలతో హుషారుగా సాగే ఈ నడకలో సంతోషం, ఉత్సాహం ప్రసపుటంగా కనిఫిస్తుంది. వారి వారి మనస్తత్వాన్ని పసికట్టే నడకలు కొన్నయితే స్టయిల్‌గా నడవడం మరెన్నో ఉన్నాయి. వయ్యారి భామలు నడిచే నడకలు, హంస నడకలూ అందులోవే. అందుకే... వారి వారి అవసరాలను బట్టి నడకలోనే నడవడికలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి