ఆలోచనలకు అనుగుణంగా..
-కంచర్ల
మన స్థితిగతులు మారాలంటే మార్పు రావాల్సింది బయట ప్రపంచంలో కాదు. ముందు మన మనో ప్రపంచంలో. అది బాహ్య ప్రపంచంలోకి విస్తరిస్తుంది. అందుకే జీవితంలో ఏం కోరుకుంటున్నామో గుర్తించి దానికి తగినట్టుగా ఆలోచించాలి.
శ్రీ్ధర్ చిన్న వ్యాపారి. ఆదాయం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోయేది కాదు. వ్యాపారం మానేసి కాంట్రాక్టర్ దగ్గర చేరాడు. అక్కడ మంచి ఆదాయం వచ్చేది. కాని కుటుంబానికి దూరంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కువకాలం ఉండాల్సి వచ్చేది. ఒక్కసారి ఐదారు నెలలపాటు ఇంటికి రావడం వీలు పడేది కాదు. భార్యాపిల్లలకు దూరంగా గడపడం శ్రీ్ధర్‌కు ఇష్టం లేక కాంట్రాక్టర్ దగ్గర పనిచేయడం మానేశాడు.
తర్వాత తనకున్న అనుభవంతో చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే ఊహించనంత సంపాదించగలిగాడు. అనేకమందికి జీవనోపాధి కల్పించాడు.
శ్రీ్ధర్ మొదట్లో ప్రారంభించిన చిన్నపాటి పేపర్‌మార్ట్ వ్యాపారాన్ని మానేయడాన్ని బంధుమిత్రులు అప్పట్లో వ్యతిరేకించారు. ఉన్న కాస్త ఆదాయాన్ని వదులుకోవద్దని హెచ్చరించారు. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో లేనిపోని ఇబ్బందులు ఎందుకని భయపెట్టారు.
అయితే- శ్రీ్ధర్‌తో కలిసి వ్యాపారం చేసినవారు ఇప్పటికీ చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ జీవితానికిది చాలనీ, తమకు పెద్ద కోర్కెలు లేవనీ, వచ్చిన ఆదాయంతో జాగ్రత్తగా గడుపుతున్నామనీ చెబుతుంటారు. అలాగని వారెవరూ శ్రీ్ధర్ కంటే తక్కువ చదువుకున్నవారు మాత్రం కాదు. తెలివితక్కువ వారూ కాదు. ఇంతకుమించిన ఆదాయాన్ని పొందడం తమకు సాధ్యంకాదనీ ఆ తెలివితేటలు, అనుభవం తమకు లేవనీ వారు నమ్ముతున్నారు. అదే శ్రీధర్‌కీ, మిగిలిన వాళ్లకీ తేడా.
ముందు తమ ఆలోచనల్లో మార్పు వస్తే జీవన గమనంలో మార్పు అదే వస్తుంది. ఇది చాలామంది గుర్తించరు. పైగా దయనీయ స్థితిలో ఉండడానికి చుట్టూ ఉన్న పరిస్థితులను నిందిస్తారు. వారు జీవితంలో అలాగే మిగిలిపోవడానికి కారణం చుట్టూ వున్న స్థితగతులు కాదు. పరిస్థితుల కనుగుణమైన ఆలోచనలను ఆదరించడం వల్లే వారలా ఉండిపోతున్నారు. చాలామంది తన జీవితాన్ని, ఆలోచనలను, చుట్టూ ఉన్న పరిస్థితుల కనుగుణంగా మలుచుకుంటారు. అంతే తప్ప కాస్త భిన్నంగా ఆలోచిస్తే తన జీవితాన్ని బాగుచేసుకోవచ్చని స్పష్టంగా గుర్తించడు. పైగా ‘పేదరికంతో బాధపడాలని నేనూ కోరుకోవడం లేదు. కాని నాకు మరో మార్గం లేక ఇలా ఉండిపోవాల్సి వచ్చింది’ అని సమాధానమిస్తాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆలోచనలను ముందుగానే నిర్దేశిస్తుంటాయి. వాటినుంచి బయటపడి స్వేచ్ఛగా ఆలోచిస్తే మంచి జీవితం పొందడం సాధ్యపడుతుంది. అందుకే జీవితంలో ఏం కోరుకుంటున్నామో గుర్తించి దానికి తగినట్టుగా ఆలోచించాలి. మార్పు మన ప్రమేయం లేకుండా రాదు. అది తెలుసుకోలేకపోతే జీవితం యథాతథంగానే ఉండిపోతుంది. అందుకే మనం కోరుకునే మార్పుకు శ్రీకారం చుట్టండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి