ఆదివారం, మార్చి 27

చిరునవ్వు

చిరునవ్వుకు చిరునామా

-కంచర్ల

ఆనందం- అనేది మానసిక స్థితి. నిర్వచించడం కష్టం. అనుభవంలో పొందేవారి మనస్తత్వం, ఆలోచన్లమీద ఆధారపడి ఉంటుంది. అయితే- ఇప్పుడు పరిస్థితి మారింది. మానసిక శాస్త్రం మీద అవగాహన పెరిగింది. మనిషి మనసు లోతుల్లోని భావనలపై రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని వేళలా ఆనందాన్ని మనకందించే అలాంటి కొన్ని మంత్రాల్లాంటి మాటలు మనం తెలుసుకుందాం.
కొంతమందికి జీవితంలో అన్నీవున్నా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు విషాదంలో మునిగితేలుతుంటారు. వారి ధ్యాసంతా తమకున్న వాటిపైకంటే, అందని వాటిపై వుంటుంది. ఇంకేముంది ఆ అసంతృప్తి చాలు ఆనందానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి
చాలామంది జీవితంలో సాధించిన విజయాలు, ఆస్తులు, అంతస్థులే ఆనందానికి మూలం అనుకుంటారు. పెళ్ళయి కుటుంబం ఏర్పడిపోతే అంతా హ్యాపీనే- పిల్లల చదువులు అయిపోయి సెటిల్ అయిపోతే ఏ బాధా ఉండదు- ఇలాంటివి తరచూ వింటుంటాం. ఆనందం పొందడానికి లక్ష్యాలు పెట్టుకొని వాయిదాలు వేసుకుంటూ పోయినకొద్దీ అది మనకు దొరకదు. ఆనందానికి ఒకటే మార్గం- ఈ క్షణం నుంచీ సంతోషంగా వుండాలని నిర్ణయంచుకోవడం.
మనం నవ్వుతూ ఉండాలి. చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ ఉండాలి. నవ్వుతో సమస్యల్ని తేలిగ్గా అధిగమించవచ్చని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. దాన్ని ఎలాంటి శ్రమా లేకుండా పొందే సంపదతో పోల్చుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎన్నిసార్లు ఆనందంగా నవ్వుకున్నాం అని లెక్కవేసుకోండి. వారం రోజుల్లో తేడా చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అందుకే నవ్వు... నవ్వించు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి