మనసా తొందరపడకే...
ధనిక కుటుంబంలోనుండి వచ్చిన రజని, మధ్యతరగతికి చెందిన వాణి మంచి స్నేహితురాళ్ళు వారి ఆర్థిక పరిస్థితులకతీతంగా. ఓసారి వాణి ఏదో పనిమీద వెళ్ళాల్సి వచ్చి స్కూటీ అవసరం వచ్చింది. స్నేహితురాలు రజనిని స్కూటీ అడగటం కోసం నిశ్చయించుకొని ఆమె ఇంటికి బయలుదేరింది. కానీ, దారిలో ఆమె పరిపరివిధాల ఆలోచించింది. ‘స్కూటీ అడిగితే ఆమె ఏమనుకొంటుంది? ఒకవేళ నేను ఇవ్వనని నిర్మొహమాటంగా చెబితే? రజని చాలాకాలంగా తెలుసు కనుక అలా అనకపోవచ్చు’- అనుకుంటూ వాణి మనసు కుదుటపడేలోపు ఆమె మనసుకు మరో ఆలోచన వచ్చింది. ‘రజని పైకి కనిపించేంత మంచిదేనా! ఎంతైనా తనూ శ్రీమంతుల బిడ్డే కదా! స్కూటీ పాడైందని, ఏదైనా రిపేరు చేయించాలని చెబితే!? లేక తనకి ఏదో పని ఉందని, తనకీ స్కూటీ అవసరం ఉందని అంటే...?’ ఇలా సాగాయి వాణి ఆలోచనలు. చివరికి ఇవన్నీ జరగబోయే విషయాలని ఆమె భావించే స్థాయికి వెళ్ళింది ఆమె రజని ఇల్లు చేరే సమయానికి. సరిగ్గా రజని ఇంటి కాలింగ్ బెల్ కొట్టి రజని తలుపు తీసేసరికి ఆమెను చూసి కోపంగా ‘మీలాంటి డబ్బున్నవాళ్ళని చాలామందిని చూశాను.. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు.. ఈ రోజుతో మనిద్దరి స్నేహం ముగిసింది’ అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి. షాక్‌తో జరిగింది ఒక్క ముక్క అర్ధంకాక, వెళ్ళిపోతోన్న స్నేహితురాలిని ఏమైందని అడగలేక అయోమయంలో పడింది రజని.
మన మనసు మనమీద ఎంతటి ప్రభావాన్ని కలుగచేయగలదో తెలియచేసే ఓ ఉదాహరణే పైన చెప్పిన సంఘటన. సాధారణంగా మనసు నిరంతరం ఆలోచిస్తుంటుంది. ముఖ్యంగా నెగెటివ్ ఆలోచనలను సృష్టించి మనకు, అయినవాళ్ళకు మధ్యన అగాధం సృష్టించే శక్తి మనసుకుంది. ఉదాహరణకు ఓ విద్యార్థిని పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కనుక బాగా చదువుకోవాలనుకుంటుంది. ఇంతలో ఆమె మనసు టీవీలో వస్తున్న ప్రోగ్రామ్‌ని చూడమని బలవంతం పెడుతుంది. మరో ఉదాహరణలో ఒక పట్నంలో ఉండే మహిళ అక్కడి కాలుష్యం, యాంత్రిక జీవనం ఇత్యాది వాటితో వేగలేక పల్లెటూళ్ళే నయం అనుకుంటుంది. కానీ పల్లెటూళ్ళో ఉండే మహిల అక్కడ సరైన సౌకర్యాలు లేవని, కావాల్సినవన్నీ దొరకవని, పట్నాలే మేలనుకుంటుంది. ఇలాంటి ఎన్ని ఉదాహరణలు చూసినా ఒకటే విషయం అర్థం అవుతుంది. మనసు మన అదుపులో ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం మన మనసు అదుపులోకి వెళ్తామో అప్పుడే అనర్థాలు మొదలవుతాయి.
మన మనసు ఎంతో ఉపయుక్తమైన పరికరం లాంటిది -నియంత్రించగలిగితే. అంటే మన ఆలోచనలని సమర్థవంతంగా ఉంచాలని భావిస్తే మనం మనసుని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆకర్షణలకు లోనవడం, తాడును చూసి పామనుకోవడం, స్నేహాన్ని ప్రేమగా పొరబడటం, బాధ్యతగా ఉండగాల్సిన చోట హక్కుకోసం ఆరాటపడటం ఇలా ఎన్ని చెప్పుకొన్నా మన మనసు మన ఆధీనంలో లేకపోవడానే్న సూచిస్తాయి. నిజానికి పైన చెప్పుకొన్న ఉదాహరణలో రజనితో అన్నాళ్ళు స్నేహం చేసి కూడా ఒక స్నేహితురాలి గురించి అనవసరంగా ఆలోచించి స్నేహబంధాన్ని చేజేతులారా నాశనం చేసుకొంది వాణి. దీనికి కారణం అదుపుతప్పిన ఆమె ఆలోచనలు. అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించాలంటే ఆలోచనలపై పట్టుండాలి. మనసుకు కళ్లెం వేయడం ఎల్లవేళలా సాధ్యం కాకున్నా కనీసం అవసరమైన సందర్భాలలోనన్నా మనసుని నియంత్రిస్తే ఫలితాలు బాగుంటాయ. ఇది నిజం.

-యల్లాప్రగడ సువర్చలాదేవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి