-కంచర్ల సుబ్బానాయుడు,
అవును కళ్లల్లోనే ఉంది. ఏంటంటారా?...
అందం, ఆకర్షణీయమైన కళ కళ్ళల్లోనే ఉంటుంది. అందుకే అవి మాట్లాడతాయి, ఆడతాయి, పాడతాయి, రెప్పవేసినా, తెరచినా భావాలను కుమ్మరిస్తాయి.
అలాంటి కళ్ళకు మెరుగులు దిద్దుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు ఆ కళ్ళకోసం ‘మేకప్’ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
నయనాల అందానికి మరిన్ని హొయలను అద్దే మేకప్ ప్రియులు మరింత సమాచారం
తెలుసుకోవాల్సిన అవసరం వుంది.
కంటికి మేకప్ ఎలా ఉండాలంటే... బాదంగింజ ఆకారంలో ఉండే కళ్ళకు,
పైరెప్ప భాగానికి నల్లటి షేడ్ లేదా ఇతర రంగులతో మేకప్ చేసుకుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
బయటకు వెళ్ళేటపుడు ముదురుగా ఉండే ఐలైనర్‌ను వాడటంతో పాటు
, సింగిల్ కోడ్ ట్రాన్స్‌పరెంట్ మస్కారాను వాడటం మంచిది. అదే సాయంత్రం సమయాల్లో ముదురు లైనర్‌ను, షాడోను మరికాస్త ఎక్కువ వాడినా హాయిగానే ఉంటుంది.
బాగా చిన్నగా లేదా బాగా పెద్దగా కళ్ళున్న మహిళలు కంటికింది భాగంలో
ముదురు రంగుల లైనర్‌ను వాడితే చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది.
చిన్నగా ఉన్న కళ్ళు విశాలంగా, ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ రంగులు ఉపయోగపడతాయి.
కళ్ళు బాగా విశాలంగా ఉన్నవారు రెప్పల లోపలి భాగంగా ఈ ముదురు రంగు లైనర్‌ను
కొంచెం వాడితే కళ్ళు చూడటానికి ఎంతో అందంగా ప్రత్యేకమైన
ఒక ఆకర్షణను కలిగినట్లుగా కనిపిస్తాయి.
కనుబొమలకు...

కనుబొమలు వుండే ఆకారం తప్పకుండా మీకంటి అందాన్ని,
ఆకర్షణను ప్రభావితం చేస్తుంది. వీటిపై కంటి రెప్పల మేకప్‌కు పెట్టే శ్రద్ధకంటే కాస్త ఎక్కువే పెట్టాలి.
అసలు కంటికి అందాన్ని ఇచ్చేవి కనుబొమలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కనుబొమలు ఎప్పుడూ తడిగా ఉన్నట్లుగా ఉండి చర్మానికి అంటుకుపోయినట్లుగా ఉండాలి.
అలా ఉంటే కచ్చితంగా కంటికి మంచి అందాన్ని ఇస్తాయి.
ముదురుగా ఉండే రంగులను చాలా దట్టంగా కనుబొమలకు మేకప్ చేస్తే
ఆ వెంట్రుకలు ఆరిన తర్వాత పైకి లేచినట్టుండి మొదటికే ముప్పుతెస్తాయి.
ఒత్తుగా ఉండే కనుబొమలకు చక్కని ఆకారాన్నిచ్చి మేకప్ చేసుకుంటే
ఏ సందర్భానికైనా సరిగ్గా సరిపోతాయి. పెళ్ళికూతురుగా ఉన్నప్పుడైనా ఈ మేకప్ బాగుంటుంది.
చూడడానికి ఎంతో హుందాగా కనిపిస్తూ కళ్ళకు అందాన్ని పెంచుతాయి.
సున్నితమైన కళ్ళకు మేకప్ వేసుకునేటప్పుడు అనేక జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం వుంది.

కంటిలోపలి భాగానికి ఏ మాత్రం తాకకుండా మేకప్ వేసుకోవాలి.
కళ్ళు బాగా చిన్నగా ఇరుకుగా ఉన్నవాళ్ళు ముదురు రంగులు మేకప్ వేసుకునేటప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు నేచురల్ ప్రోడక్ట్స్‌ను వాడటానికి
ఇంట్లో అందుబాటులో ఉండే చిట్కాలను పాటించడానికి ఎక్కువ శ్రద్ధ కనబరచాలి.
మేకప్ చేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. కనీసం ఒక అరగంటయినా వేచి వుండాలి.
లేదంటే తడితడిగా ఉన్న మేకప్‌పై సూర్యకిరణాలు పడేసరికి మొహం అంతా జిడ్డుగా మారిపోవటమో, మంటపుట్టడమో జరిగే అవకాశం ఉంటుంది.

నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్ రిమూవ్ చేసుకోవాలి.
లేదంటే సున్నితమైన చర్మం మొద్దుబారుతుంది.
ప్రత్యేక సందర్భాల్లో తప్ప, మిగతా సమయాల్లో ఎంత లైట్‌గా మేకప్ వేసుకుంటే
అంత మంచిది. కళ్ళు చూడటానికే ఉన్నాయి. అలాగని రెప్ప వేయకుండా
అదేపనిగా చూడటం వాటికి అధిక శ్రమను, ఒత్తిడిని కల్గిస్తుంది.
అందుకే రెప్పవేయడం కంటి ఆరోగ్యానికి, వాటి అందానికి ప్రతీక అని గుర్తుంచుకోవాలి.
మీ చర్మం రంగు, మీరు ఎక్కువగా వాడే దుస్తులు వీటిని బట్టి కూడా
మీరు కంటికి అలాగే ముఖానికి వేసుకునే మేకప్ రంగులను ఎంచుకోవటం మంచిది.
ఏదిఏమైనా కంటి అందాన్ని రెప్పలా చూసుకోవాలి సుమా!...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి