సేద తీర్చే ఫ్రెండ్స్ కార్నర్
- కంచర్ల
ప్రొద్దునే్న కాలేజి, ఆ తర్వాత కోచింగ్, ఇంటికొచ్చాక పుస్తకాలతో కుస్తీలు, పరీక్షలొచ్చాయంటే, ఎడతెగని టెన్షన్... చదువు ముఖ్యమే కాని ఎప్పుడూ అదే ధ్యాస ఉంటే మాత్రం... నో.. అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. రోజులో ఏదో సమయంలో కాసేపు అలా రిలాక్స్ కాకపోతే థ్రిల్ ఏముంటుందని గడుసుగా అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు, కాలేజీకి మాత్రమే పరిమితమైన అమ్మాయిలు సైతం చదువులోనే కాదు అన్నింటిలోనూ అబ్బాయిలతో పోటీపడి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అబ్బాయిలేకాదు మేమూ బైక్‌లు నడుపుతామంటున్నారు. ఏదైనా సాధిస్తామంటున్నారు. కాలేజి వదలీవదలగానే ఈతరం అమ్మాయిలు స్కూటర్, మోపెడు, బైకయినా కావచ్చు లేదా సైకలయినా.. ఏదో ఒకటి అందుకొని సరదా చేస్తున్నారు. అమ్మాయిలు వారివారి ఫ్రెండ్స్‌తో పదిమంది గుమిగూడే ‘‘ఫ్రెండ్స్ కార్నర్’’ వైపు పరుగులు తీస్తున్నారు. ఆరోజు-ఈరోజు అనుకోకుండా ఎల్లవేళలా.. ఏదో ఒక ‘‘ఫ్రెండ్స్ కార్నర్’’గా ఏర్పరుచుకొని ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నారు ఈతరం అమ్మాయిలు. సరదా కాలక్షేపానికి దోహదపడే ఏ ప్రదేశాన్నయినా ఫ్రెండ్స్ కార్నర్‌గా మార్చేస్తున్నారు. యిప్పుడు అమ్మాయిలకు ‘‘ఫ్రెండ్స్ కార్నర్’’ ఓ స్వర్గం. కవ్వింతలు, తుళ్ళింతలు, కేరింతలు, అందమైన ఊసులు. కాలేజి, క్లాస్‌రూం ముచ్చట్లు మొదలుకొని స్పోర్ట్స్, కల్చరల్, ఫిక్చర్స్, ప్రేమలు, కెరీర్.. ఇలా అన్ని అంశాలూ అక్కడ చర్చనీయాంశాలు అవుతాయి. ఈ ఫ్రెండ్స్ కార్నర్ లేదా కబుర్ల పందిరి ఏదైనా కావచ్చు. ఎక్కడైనా కావచ్చు. బేకరీలు, హాట్ కేఫ్‌లు, మసాలా పూరి, గోబి, టీ, టిఫిన్ సెంటర్లు, ఐస్‌క్రీం పార్లర్లు, క్యాంటీన్లు, పర్యాటక, విజ్ఞాన, వికాస కేంద్రాలు, బీచ్‌లు, రివర్ ఏరియాలు, పార్కులు... ఇలా ఎన్నో ప్రాంతాలు ఫ్రెండ్స్ కార్నర్స్‌గా మారి ఈ యువతరానికి సేద తీరుస్తాయి.
ఫ్రెండ్స్ కార్నర్స్‌కు వెళ్ళి అప్పుడప్పుడు కలుసుకోవాలని అబ్బాయిలను కంటే అమ్మాయిలు మాత్రం రోజూ ఫ్రెండ్స్‌తో వెళ్ళి సరదా కబుర్లు చెప్పుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. అసలు పదిమంది కలుసుకునే చోటుకు వెళ్ళి యువతరం ఏం చేస్తుంది. వారి సరదాలు ఏమిటో చూద్దాం.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పక్కనే ఓ పార్కు ఉంది. పార్కు అనేదానికన్నా గార్డెన్ అంటేనే బాగుంటుంది. ఇది ఉమెన్స్ హాస్టల్ ఎదురుగా ఉండటం ప్రత్యేకం. ఎస్.వి. యూనివర్శిటీ అమ్మాయిలూ, అబ్బాయిలకు ఇదే వేదిక. పేరుకు ఇది చిట్‌చాట్ వేదిక. అయితే అక్కడ కనీసం టీ, బిస్కట్ కూడా దొరకదు. కానీ ఫ్రెండ్స్ కార్నర్ అయ్యింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడికే చేరుతారు. అనేక అంశాలపై మాట్లాడుకుంటారు. ఫ్రెండ్సే కాదు లవ్‌బర్డ్స్ కూడా ఇక్కడే కలుసుకుంటారు. ఏది ఏమైతే నేం అబ్బాయిలూ, అమ్మాయిలూ కబుర్లతో కాలక్షేపం చేస్తారు. వాటితో పాటే భవిష్యత్ ప్రణాళికలనూ రూపొందించుకుంటారు. అలాగే తిరుపతి శ్రీ పద్మావతి యూనివర్శిటీ పార్క్, ఎన్.టి.ఆర్. స్టేడియం, శే్వత భవన్, మహతి థియేటర్, మున్సిపల్ పార్క్, జూ, సైన్స్ సెంటర్, కపిలతీర్థం పార్క్, శిల్పారామం, కోనేరు సెంటర్ లాంటివి ఫ్రెండ్స్ కార్నర్స్‌గా మారి సరదా కబుర్లతో కాలక్షేపం చేస్తుంటాయి.

మీరేమంటారు ?
ఫేవరేట్ ప్లేసెస్‌కు వెళతాం
ఇంటర్మీడియట్ వరకూ తిరుపతి ఎస్వీలో చదివాం. కౌనె్సలింగ్‌లో హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. మా ఫ్రెండ్స్‌లో చాలామందికి అక్కడే సీట్లొచ్చాయి. ఇంకేముంది భాగ్యనగరం మా భాగ్యమే అయ్యింది. సిటీలో హంగవుట్స్ చాలా ఉన్నాయి. నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్, టాంక్ బండ్.. ఇవి కాకుండా చార్మినార్, రవీంద్రభారతి, ఒకటేమిటి? అన్నిచోట్లకు వెళతాం. ఆదివారం, సెలవు దినాలు వస్తే చాలు ఎంజాయ్‌మెంట్. ఎప్పుడూ ఉండే తిరుపతే కదా అని ఊరికి కూడా వెళ్ళం. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ రజని, శ్యామల, వరలక్ష్మి, హేమలత, సుజాత వెళతాం. నెక్లెస్ రోడ్ ప్రాంతాలకొచ్చి లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను కూడా చూస్తుంటాం.
- ప్రవల్లిక

ఆట పాటలతో ఆనందం
నెల్లూరు, బుజబుజ నెల్లూరులోని ఆంధ్రభూమి ఆఫీసుకు అతి దగ్గరలో మా ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. మా ఫ్రెండ్స్ దాదాపు ఇరవై, ఇరవైఐదు మంది రోజూ నెల్లూరు నుండి కాలేజికి వెళతాం. కాలేజిలోనే క్యాంటిన్ ఉంది. ఆటపాటలకు, మంచి వాతావరణంతో సువిశాల ప్రదేశం ఉంది. అందుబాటులో ఛాట్ భండార్లు ఉన్నాయి. ప్రతి పిరిడ్‌కు మా కాలేజి ఆరుబయటకు వచ్చి రిలాక్స్ అవుతాం. కోరింది తింటాం. మాకు రోజూ కాలేజి పరిసరమే ఓ ఫ్రెండ్స్ కార్నర్. మా ఫ్రెండ్స్‌ంతా కలసి పిక్‌నిక్‌లకు వెళ్తాం. జైన్ దేవాలయం, పెంచలకోన, జొన్నవాడ, సోమశిల, కనిగిరి రిజర్వాయర్, మైపాడు బీచ్‌కు వెళతాం. ఫ్రెండ్స్‌తో కమిటీగా ఏర్పడి ప్రత్యే క సందర్భాల్లో ముగ్గుల పోటీలు, స్పోర్ట్స్, గేమ్స్ కాంపిటేషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత.
-- ప్రతిభా చౌదరి

ఫ్రెండ్లీ చాటింగ్
తిరుపతి, బాలాజీ కాలనీ నెట్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఈ కాలనీ యూనివర్శిటీ దగ్గరలో ఉంది. కాలేజి అయిపోగానే కాలేకి చేరుకుంటాం. అందరం కలిసి పానీపూరి, లేదా గోబి, మలజారియా, ఫ్రైడ్ రైస్ ఏదో ఒక ఐటమ్ ఆరగించి ఇంటర్నెట్‌కి వెళ్తాం. అక్కడ ఓ గంట, ఆ తర్వాత ఎవరిళ్ళకు వారు వెళ్తాం. మరుసటి రోజు పార్కులో కలుసుకుంటాం. ఏదో సమయంలో అక్కడ ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. ఇంటర్నెట్ విశేషాలు, చదువు, భవిష్యత్తు ఎన్నో సరదా కబుర్లు చెప్పుకుంటాం.
- ఝాన్సీ

మా కార్నర్ తిరుపతే!
ప్రతి ఏడాది అమ్మాయిలమంతా కలిసి తిరుపతికి వస్తాం. రెండేళ్ళకోసారి కుటుంబ సభ్యులతో వస్తాం. మా ఫ్రెండ్స్‌కంతా తిరుపతే ఓ కార్నర్‌గా మారింది. మా స్వంత ఊరు కరీంనగర్. కాస్త టైమ్ ఉంటే చాలు అక్కడి లోయర్ మానేర్ డ్యాంకు దగ్గరకు వెళతాం. షాపింగ్ చేయడమంటే చాలా యిష్టం. తిరుపతిలో ఉన్న విహార, కాలక్షేప కేంద్రాలు మరెక్కడా లేవనుకుంటా!
- జ్యోతి

పార్టీలంటే ఇష్టం
ఆదివారం వస్తే చాలు మా సరదా అంతా ఇంతా కాదు. బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళతాను. లేదా ఉడా పార్కుకు. శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ప్రస్తుతం విశాఖపట్నంలో మెడిసన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సెలవుల్లో అందరం కలసి మసాలా లేదా ఫోర్ సీజన్స్ రెస్టారెంట్లకు వెళ్ళి సరదా కాలక్షేపం చేస్తాం. పార్టీలంటే నాకు చాలా యిష్టం. అమ్మాయిలతోపాటు వారి బాయ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడూ వస్తారు. కబుర్లు చెప్పుకుంటాం.
- వరలక్ష్మి

ఉల్లాసం... ఉత్తేజం
వరుసగా నాలుగైదు రోజులు సెలవులు వస్తే తప్ప మేం తిరుపతికి రాము. రాజమండ్రిలో మా ఇంజినీరింగ్ కాలేజీలోని ఓ పార్కు ఉద్యానవనంగా ఉంది. సాయంత్రం ఫ్రెండ్స్ అంతా అక్కడే సరదా కబుర్లు చెప్పుకుంటాం. వారంలో రెండుసార్లు కంబాల చెరువు పార్కుకు వెళుతుంటాను. అక్కడ అబ్బాయిలు, జంటలు, వాకింగ్ కోసం వచ్చేవారు వృద్ధులు సైతం ఆ ప్రాంతం ఎంతో కళకళ లాడుతూ ఉంటుంది. సాయం సమయం అక్కడ అంతా అద్భుతం. అంతకుమించి మనోల్లాసం. కొత్త ఉత్తేజం. ఈతరం అమ్మాయిలందరికీ ఫ్రెండ్స్ కార్నర్ మనోవికాసంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపిస్తుందని ఆశిస్తున్నాం.
- జాహ్నవి

ఎస్.వి. క్యాంపస్ వెరైటీ చిట్‌చాట్ సెంటర్
తిరుపతిలో శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీల్లో చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు కాలేజీ క్యాంపస్సే మాకు ఓ వెరైటీ చిట్‌చాట్ సెంటర్. మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే కలుసుకుంటాం. ఎక్కువగా మా కెరీర్‌పైనే చర్చ జరుగుతుంటుంది. ఇక యూనివర్శిటీ సమస్యలు ఎలాగూ ఉండనే ఉంటాయి. అమ్మాయిలంతా రోజుకు కనీసం అరగంటయినా ఇక్కడికి రాకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది.
- సాహితి

ప్రెష్ అయ్యేందుకే బేకరి
శనివారం సాయంత్రం, ఆదివారంతో పాటు తీరిక దొరికినప్పుడల్లా బేకరీకి వెళతాం. వారానికి మూడు రోజులు తప్పనిసరి. ఇంట్లో చదువు, కంప్యూటర్, టీవీతో తలదిమ్మ తిరిగిపోతుంది. ఫ్రెష్ అయ్యేందుకు బేకరి మా హాంగవుట్‌గా మారుతుంది. ఓ గంట బాయ్ ఫ్రెండ్‌తో కబుర్లు. మా అమ్మాయిలంతా వారి బాయ్ ఫ్రెండ్స్‌తో కూడా వస్తారు. ఒట్టి ప్రేమ కబుర్లే కాదు. కెరీర్ గురించి, ఉద్యోగావకాశాల గురించి చర్చించుకుంటాం. ఇవన్నీ పూర్తి అయ్యాక బేకరీలోని ఐటమ్స్ లేదా పానీమసాలా, పూరి ఆరగించి ఇంటిదారి పడతాం.
- హారిక

భవిష్యత్తు ప్రణాళికపై చర్చ
కాలేజి వదలటమే ఆలస్యం. ఫ్రెండ్స్ అందరం ఉమెన్ హాస్టల్ ఎదురుగా ఉన్న పార్కుకు వెళతాం. చుట్టూరా చెట్లు, మెత్తటి గరిక, పూల మొక్కలు, అక్కడ వాతావరణం అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడే కబుర్లతో కొంత కాలక్షేపం చేస్తాం. పోటీ విపరీతంగా పెరిగింది కదా! భవిష్యత్తులో ఏం చేయాలి? అనే వాటిపై చర్చించుకుంటాం. అక్కడికి సీనియర్లు కూడా వస్తారు. గైడెన్స్ కోసం వారి సలహాలు అవసరంగా భావిస్తాం. మంచి సూచనలను పాటిస్తాం కూడా!
- మనోజ్ఞ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి