బ్లాక్ బ్యూటీ
-కంచర్ల
తరం తరం.. నిరంతరం మారే ఫ్యాషన్. కలర్స్.. డిజైన్స్.. ఫ్యాబ్రిక్స్.. అన్నీ మారిపోతుంటాయి.. పాతబడిపోతుంటాయి.. మళ్ళీ మళ్ళీ కొత్తగా అవతరిస్తుంటాయి.
కానీ ఎన్ని మారినా ఫ్యాషన్ ప్రపంచంలో నలుపు రంగుకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కొత్త కొత్తగా ఎన్ని రంగులు పుట్టుకొచ్చినా ఫ్యాషన్ వేదిక మీద తన ఉనికిని ఎప్పుడూ చాటుకుంటూనే ఉందిది. బహుశా దీనికెప్పుడూ దిష్టికొట్టదేమో!
తెలుపు తరవాత నైట్ పార్టీవేర్‌గా అత్యంత ఆదరణ పొందిన రంగు ఒక్క నలుపే. ఇప్పటికీ అత్యధిక శాతం మహిళలు రాత్రి పార్టీల్లో నలుపు రంగు దుస్తులు ధరించడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే- ఎంతమందిలో ఉన్నా ‘ఎవరా?’ అని ఒక్కసారైనా తలతిప్పి చూసేలా చేస్తుందీ రంగు.
రెడ్ కార్పెట్ మీద డ్యాన్స్ ఫ్లోర్‌మీద అడుగుపెట్టే సెలబ్రిటీలు నలుపు రంగులోనే తళతళలాడుతున్నారు. పలు ఫంక్షన్లలో అందాలరాశి ఐశ్వర్య కూడా బ్లాక్‌లోనే మెరుస్తుంది. నియాన్ కాంతుల్లోనే బ్లాక్ ధరించాల్సిన అవసరం లేదని మహిళామణులిప్పుడు నిరూపిస్తున్నారు. ‘పగటివేళల్లోనూ దీన్ని మించిన రంగు లేదు’ అంటూ మహిళలు, ఇటు మగవారు మోజుపడి రకరకాల డిజైన్లతో నల్లటి దుస్తులు ధరించి దర్శనమిస్తున్నారు.
నేడు ఫ్యాషన్ ప్రపంచంలో నలుపు రంగుకు చెదరని స్థానం దక్కింది. అది ట్రెండ్‌కు అతీతమైంది. అందాన్నీ, ఆనందాన్నీ, ఆకర్షణనీ సొంతం చేసుకోవాలంటే బ్లాక్‌ను మించింది లేదు. స్లిమ్‌గా అందంగా కనిపించాలన్న బ్లాక్ తరవాతే ఏదైనా. అందుకే బొటిక్స్‌లోని డిజైనర్ వేర్‌లోనే కాకుండా సంప్రదాయ మహిళలు ఎక్కువగా ధరించే నేత చీరల్లోనూ నలుపు రంగుకు పెద్దపీట వేస్తున్నారు.
వయసు తారతమ్యం లేకుండా చిన్నపిల్లల డ్రెస్సులు మొదలుకుని చీరలు సల్వార్‌లు, స్కర్టులు, ఫ్రాకులు, షర్టులు, ఫ్యాంట్లు, టీషర్టులు, కోట్లు, టైలు, జీన్స్... ఇలా అన్ని రకాల వస్త్రాల్లోనూ నలుపురంగు కలగలిసే ఉంటుంది.
ముఖ్యంగా బ్లాక్ జీన్స్, బ్లాక్ టీషర్టు, స్కర్ట్... లాంటివి క్యాజువల్స్‌గా ఎంతో బాగుంటున్నాయి. బ్లాక్ అందమైనదే కాదు, విజయవంతమైనదీ, శక్తివంతమైనదీ కూడా.
కొన్ని సందర్భాల్లో అధికారాన్నీ, ధర్మాన్నీ ఒలికించే రంగు నలుపే. ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్లలో జరిగే పార్టీల్లోనూ, సమావేశాల్లోనూ హుందాగా, అందంగా కనిపించేందుకు పెద్ద మనుషులంతా ధరించే సూటు బూటులన్నీ నలుపే.
స్ర్తిలు పురుషులపట్ల తమ వినయ విధేయతల్ని చాటుకునేందుకు ఈ రంగును వాడుతారు. మనిషిలోని చెడును నలుపుగా అభివర్ణిస్తూ కొన్ని పాశ్చాత్య దేశాల్లో డ్రాకులాలు, విలన్లకు ఆ రంగును ఎక్కువగా ఆపాదించడం బ్లాక్‌కు కొంత డ్రాబ్యాకయినా, చిన్న చిన్న లోపాలున్నా.. ఫ్యాషన్ ప్రపంచంలో బ్లాక్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీని స్టైల్‌కెప్పుడూ లోటు లేనేలేదు. డైమండ్స్, క్రిస్టల్స్ మరింతగా మెరిపించాలన్నా, మురిపించాలన్నా నలుపే కావాలి.
మోనోక్రొమేటిక్ డెస్సింగ్ లేటెస్ట్ ఫ్యాషన్ కూడా. నఖశిఖ పర్యంతం ఒకటే రంగు వేయడంవల్ల నాజూగ్గా ఉండేవాళ్ళు మరింత అందంగా పొడవుగా కనిపిస్తారు.
అయితే, వేసుకునేది నలుపే అయినా, అందులోని వేర్వేరు షేడ్‌లు కలిగినవి వేసుకుంటే మరింత అందంగా అగుపిస్తారు. ఉదాహరణకు రిబ్బింగ్, నిట్స్, ట్వీడ్స్, జాకార్డ్స్, ఫ్యాబ్రిక్స్‌ను తీసుకుని విభిన్న డిజైన్లలో కుట్టించుకోవచ్చు. మరీ పూర్తిగా ఎప్పుడూ నలుపు రంగు డ్రెస్సే వేసుకోవడం ఇష్టం లేకపోతే పైది ముదురు రంగూ, కిందిది లేతరంగూ వేసుకోవాలి లేదా ఈ రంగుల్లోనే అటు ఇటుగా మార్చి ధరించాలి.
నడుము పైభాగంలో ధరించేందుకు ‘బ్లాక్ ఈజ్ బెస్ట్’ అని అంటారు. దీనికి ఆపోజిట్ కలర్‌గా కింది భాగంలో వైట్ స్కర్ట్ లేదా ఫ్యాంట్ వేస్తే ‘బ్లాక్ అండ్ వైట్’ కాంబినేషన్ అందమే వేరు. అందాలన్నీ ‘బ్లాక్ అండ్‌వైట్’తో ముడిపడి ఉన్నాయని చెప్పక తప్పదు.
ఒక్కమాటలో చెప్పాలంటే... ఎలాంటివాళ్ళకయినా కలర్ ఫొటోలో కన్నా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలోనే అందంగా కనిపిస్తారు. ఏ రంగు దుస్తులైనా నలుపురంగుకు సాటిరావు. దట్ ఈజ్ ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ బ్లాక్ ఈజ్ ద బెస్ట్’!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి