శుక్రవారం, మార్చి 25

వై.యస్. వివేకా రాజీనామా వెనుక రాజకీయం! - మీ ఆదాయంలో ‘ఆదా’



వై.యస్. వివేకా  రాజీనామా
వెనుక రాజకీయం!
పార్టీ కి గుడ్ బై !?
 
కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు 
ఉప ఎన్నికలు జరుగుతుండడంతో 
రాజకీయాలలో  వేడెక్కింది. 
హడావుడి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ శిబిరాల్లో ఉధృతమైంది

కాగా, కాంగ్రెస్ పార్టీలో అయోమయం ఇంకా కొనసాగుతోంది. 
మంత్రి పదవికి రాజీనామా చేసిన వైఎస్ వివేకానందరెడ్డి తనపందా  మార్చుకొన్నారు.  జగన్ పన్ని వ్యూహం  పండింది. ఆయన పాచికలు పారాయి. ఎట్టకేలకు వై.యస్. వివేకనందరెడ్డి పదవికి రాజీనామా చేసారు. మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయలక్ష్మి, కడప లోక్‌సభ స్థానానికి జగన్ పోటీ చేయడం దాదాపు ఖరారైనా చివరి నిమిషములో పెను మార్పు చోటు చేసుకున్నాయి.  
 
వివేకాను పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దించాలన్నది 
కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే 
అక్కడ పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన వివేకా
  తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేస్తున్నందున
అక్కడ కాంగ్రెస్ పోటీ చేయారాదన్న ప్రచారాన్ని చేపట్టారు.  ఇది జన్నాట కమే.
బాబాయితో, జగన్ పన్నిన  వ్యూహమే.  పులివెందుల అసెంబ్లీ స్థానానికి  బాబాయ్ వివేకాను నిలబెట్టి 
కడప లోక్‌సభ స్థానంలో తాను  పోటీకి దిగాలన్నదే  ఆలోచన. బాబాయ్ 
వివేకాను  అసెంబ్లీకి పోటీ పెట్టాలన్నఆలోచన లేదని 
ఒక  వైపు జగన్ చెపుతూనే కొత్త వ్యూహం మొదలు పెట్టాడు. 
 జగన్  ఆంతర్యం ఏమిటన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదు.  వివేకా తెరవెనుక మరో విధమైన ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి  కాంగ్రెస్ పార్టి కి తన   రాజీనామా పత్రాన్ని అందజేసి పులివెందులకు తాను పోటీ చేస్తున్నాని, అయితే తాను చేసేది తన అన్న పార్టీ టిక్కెట్టు పయినే అన్న   విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తన వదిన పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ కి నిలబడితే తాను అసెంబ్లీకి పోటీ చేయబోనని వివేకా అంటున్నట్లు  నాయకులు  కొందరు చెబుతున్నారు.
పులివెందుల అసెంబ్లీ స్థానానికి వివేకాను నిలబెట్టి కడప లోక్‌సభ స్థానంలో జగన్ పోటీకి దిగితే విజయం తమదే అన్న ధీమా వైయస్సార్ కాంగ్రెస్ లో వుంది.  కాంగ్రెస్ తరపున అయితే పులివెందులలో కచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకం వివేకాకులేదు. కాబట్టే జగన్ వేసిన ఎత్తుగడలకు వివేకా తల వగ్గాడు.   ఎట్టకేలకు మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టికి కుడా గుడ్ బై చెప్పాడు.  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ సందిగ్ధవవస్థలో  పడింది.
  పులివెందులలో కాంగ్రెస్ పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై కాంగ్రెస్ నాయకులు
మీమాంస లో పడి  కొందరు చర్చలు జరిపారు. ఎట్టకేలకు బాబాయి కుడా మన పార్టీ లోకే  వచ్చేశాడని,  ఎన్నికలు అవగానే  కొత్తవ్యుహం మొదలవుతుంది సన్నిహితుల 
దగ్గర జగన్ అన్నట్టు సమాచారం  .
 కాగా కాబోయే ముఖ్య మంత్రి కూడా   తానే అని అన్నట్లు తెలిసింది. ఈ వార్త ఏప్రిల్ ఫూల్ కే. నిజానికి
కడప, పులివెందుల ఉప ఎన్నికలనేపద్యంలోరాజకీయ పరిణామాలను   తేలిగ్గా తీసుకోరాదని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.   


 

 

మీ ఆదాయంలో ‘ఆదా’

-కంచర్ల


మనలో చాలామంది చాలా విషయాల్లో ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. కాని డబ్బు విషయానికొచ్చేసరికి మాత్రం ప్లానింగ్ ఉండదు. దాంతో ఎంత సంపాదించినా డబ్బు ఆదా చేయలేకపోతున్నామని బాధపడతారు. అలా కాకుండా డబ్బు విషయంలో స్మార్ట్‌గా వ్యవహరించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
సంపాదనలో ఎంత మొత్తాన్ని ఆదా చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. మీరు ఏర్పరుచుకున్న ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి ఈ ప్రణాళిక అవసరం. ఇందువల్ల ఖర్చు చేసే పద్ధతిలో మార్పు వస్తుంది. డబ్బు మిగల్చడం సులభమవుతుంది.
మనీ మేనేజ్‌మెంట్‌లో గుర్తుంచుకోవాల్సిన మరో అంశం క్రెడిట్ కార్డుల గురించి. లెక్కకు మించిన ఖర్చు చేయడంవల్ల అప్పు తడిసి మోపెడంతవుతుంది. అందుకే ప్లాస్టిక్ మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డుతో ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలంటే చెకింగ్ లేదా మనీ మార్కెట్ అక్కౌంట్‌లో అందుకు సరిపడా డబ్బునే ఉంచుకోవాలి. అప్పుడు వ్యయాన్ని మీకు మీరే నిరోధించుకోగలుగుతారు.
టాక్స్ రిటర్న్స్ కట్టాల్సి వచ్చేంత వరకు మనలో చాలామంది టాక్స్ పేమెంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. చివరి నిమిషంలో హడావిడి పడుతుంటారు. చివరి తేదీ వరకు ఆగకుండా ఈలోపే ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లను కలిసి పన్ను భారం పడకుండా ఉన్న స్కీంలను తెలుసుకోవాలి. దొరికే కాస్త సమయాన్ని పన్నుల గురించి ఆలోచించమంటారా? అని అనొద్దు. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడంవల్ల టాక్స్ ఫైల్ చేసే సమయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంటే.. ఇన్స్యూరెన్స్, మ్యూచువల్ ఫండ్ అక్కౌంట్ స్టేట్‌మెంట్‌లను, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను, టాక్స్ రిటర్న్‌ల పేపర్లన్నింటినీ ఒకచోట జాగ్రత్త పరచుకొని లావాదేవీలను నడపాలి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పత్రాలను ఎక్కడపడితే అక్కడ ఓపెన్ చేయకూడదు. అన్నింటినీ ఒకేచోట భద్రపరచుకొని అవసరమైన సమయంలో పరిశీలించి కడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందువల్ల పన్నుల భారం నుంచి బయట పడవచ్చు.
చివరగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఒక వస్తువును కొనేటప్పడు అవి మీకెంత వరకు ఉపయోగమో ఆలోచించుకోవాలి. ఊరికే కొని ఇంట్లో పడేసే కన్నా ఆ డబ్బును ఇంకో ఖర్చుకు దాచి ఉంచడం మంచిది. అట్టహాసాలకు వెళ్లి చేతులు కాల్చుకోవద్దు. డబ్బులు పొదుపు చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను సంప్రదించి ‘ఆదా’ పద్ధతులను అవలంభించాలి. నమ్మకమైన చోట డబ్బును దాచుకోవాలి. చీటీల పేరుతో మోసపోవద్దు. దినసరి ఖర్చులు తగ్గించుకోవాలి. డబ్బులు అధికంగా ఖర్చు చేయక జాగ్రత్తగా వ్యవహరించడానికి రోజువారీ లెక్కలను ఒక పుస్తకంలో రాసుకోవాలి. నెలాఖరులో లెక్కలు చూసి వచ్చేనెలకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి