ముద్దొచ్చే ముత్యం
అందాన్నీ, ఆరోగ్యాన్నీ, సౌకుమార్యాన్నీ, స్వచ్ఛతనీ, దర్పాన్ని, నిరాడంబరతనీ ఏకకాలంలో ప్రతిఫలించే శక్తి దీనికి మాత్రమే ఉంది. అందుకే నాటి నుంచి నేటి తరంవరకూ అంతా దీని ప్రేమికులే. సరాలల్లుతూ సరాగాలాలపిస్తూ వనె్నల చినె్నలు వెదజల్లుతూ వెనె్నల వానలు కురిపిస్తూ అతివల్ని అలరిస్తూ అందరినీ మురిపిస్తున్న అందమైన అలంకారం, అజరామర సౌందర్యం ఆణి‘ముత్యం’.
అతివల అందాల్నీ నిర్మలమైన మనసునీ కడిగిన ముత్యం అని పోల్చడం వింటుంటాం. కానీ ముత్యమనేది సముద్ర నీటిలో నివసించే మొలస్కన్ జీవులు విసర్జించే కర్భన పదార్థం. ఎక్కువగా ఆయస్టర్లు, తక్కువగా నత్తలనుంచి ముత్యాలు ఏర్పడతాయి. దృఢమైన కవచం లోపల గుట్టుగా జీవించే ఈ జీవుల శరీరంలోకి ఓ చిన్న అన్య పదార్థం.. అది ఇసుకరేణువు కావచ్చు.. పరాన్నజీవి కావచ్చు ప్రవేశించినపుడు దాన్ని బయటకు పంపిస్తూ దాని చుట్టూ కవచంలా ఆర్గొనైట్, కాంకియోలిన్ అనే కర్బన పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ స్రావానే్న మదర్ ఆఫ్ పెరల్ ‘నాక్రే’ అంటారు. ఈ విధంగా అన్య పదార్థం చేరిపుడు మొదట ఏర్పడినదానిమీదే పొరలుపొరలుగా కర్బన పదార్థం స్రవిస్తుంది. అదే ముత్యంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే ముత్యం ఆకారం, లోపలకు ప్రవేశించిన అన్య పదార్థం యొక్క ఆకారం.. అది ఏర్పడే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. సూదిమొన నుంచి పావురం గుడ్డు సైజువరకూ వివిధ పరిమాణాల్లో ముత్యాలు దొరుకుతాయి. 450 క్యారెట్లు బరువు కలిగిన అతి పెద్ద ముత్యం కూడా లభ్యమయిందంటే ఆశ్చర్యమే.
సామాన్యులకు సైతం నేడు ముత్యాలు సుపరిచితమే. కానీ పంతొమ్మిదో శతాబ్దం వరకూ ముత్యాల హారాలే ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఆభరణాలంటే నమ్ముతారా!
ఎందుకంటే, అప్పట్లో అత్యంత అరుదుగా మాత్రమే దొరికే అపురూపమన రత్నాలివి. మొదట్లో ముత్యాలు సముద్రంలో మాత్రమే దొరికేవి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలనుంచే ఎక్కువగా ముత్యాలు మార్కెట్లోకి వచ్చేవి. ఇప్పటికీ సహజమైన ముత్యాలకు ఇవే ప్రధాన రేవులు. నలుపు రంగు ముత్యాలు ఎర్ర సముద్రంలో మాత్రమే దొరికేవి. కొంతకాలానికి దురదృష్టవశాత్తు వీటి ఉత్పత్తి క్షీణించింది. రాజ కుటుంబీకులు మాత్రమే ధరించే ముత్యాలను ఇప్పుడు సామాన్యులు సైతం ధరిస్తున్నారు. సరిగ్గా వందేళ్ళ క్రితం ముత్యాలను పెంపకం ద్వారా మార్కెట్లోకి తెచ్చారు. కళతప్పిన ముత్యాలు క్రమేణా కళకళలాడుతూ వెలుగులను విరజిమ్మింది. ప్రస్తుతం మనకు దొరికే ముత్యాల్లో 95 శాతం పెంపకం ద్వారా లభించేవే.
ముత్యాల పంటగా మారినప్పటినుంచీ అక్కడ, ఇక్కడ అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ముత్యాల వెల్లువైంది. ఇందుకు మన దేశం, మన రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. పైగా నిజాం పాలనలో ఎక్కడెక్కడినుంచో వచ్చే ముత్యాలకు ఒడుపుగా రంధ్రాలు చేయడంలో హైదరాబాదీలు ప్రావీణ్యం సంపాదించారు. దీంతో భాగ్యనగరం ‘పెరల్ సిటీ’గా చరిత్రలో స్థానాన్ని సంపాదించింది. అయితే మన దేశంలో క్రమంగా రత్నాల స్థానాన్ని బంగారు కైవసం చేసుకోవడంతో మధ్యలో కొంతకాలం ముత్యం కాస్త మసకబారినట్లు కనిపించింది.
కానీ, ఇటీవల మళ్ళీ పుంజుకొంది. ఆభరణాల డిజైనర్లు రంగు రంగుల ముత్యాలు, ఇతర రత్నాల సాయంతో వినూత్నమైన డిజైన్లతో నగల్ని రూపొందించి మంచి ముత్యాలకీ డిజైనర్ లుక్ తీసుకొచ్చారు.
సిల్కు, షిఫాన్ డ్రెస్సుల మీదకు మ్యాచయ్యేలా గులాబీ, ఆకుపచ్చ, నలుపు, బూడిద వర్ణాలముత్యాల్ని నేటి తరం ఎంతో ఇష్టపడి ధరిస్తోంది. సూదిమొననుంచి పావురం గుడ్డు సైజు వరకూ వివిధ పరిణామాల్లో లభించే ముత్యాల్లోని రకాల గురించి, నాణ్యత, భద్రత తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
ముత్యాల్లో ముచ్చటగా మూడు రకాలున్నాయి. మనిషి ప్రమేయం లేకుండా ఏర్పడేవీ, సముద్రంలో దొరికేవీ సహజమైనవి. మొలస్కన్ల శరీరంలోకి అన్య పదార్థాన్ని మనిషి ప్రవేశపెట్టడం ద్వారా ఏర్పడేవి ‘కల్చర్డ్ పెరల్స్’. ఇవి కృత్రిమమైనవి కావు. ఈ విధానంవల్లే ముత్యాల పరిశ్రమ ఇంతింతై వటుడింతై వృద్ధి చెందింది.
మంచినీటిలో నివసించే మొలస్కన్ల నుంచి లభించేవే ‘మంచినీటి ముత్యాలు’. ఇవి సముద్ర నీటిలో లభించే ముత్యాలంత నాణ్యతను కలిగి ఉండవు. అందుకే వీటి ఖరీదు కూడా తక్కువే. ఉడికిన అన్నంలా ఉండే ఈ ముత్యాలకు హైదరాబాద్ కూడా పెట్టింది పేరే.
ముత్యాలన్నీ మంచివేనా?... అంటే కాదనే చెప్పాలి. వీటిల్లో కృత్రిమమైనవీ ఉన్నాయి. ‘‘మాజొర్కా ముత్యాలు’’ ఇలాంటివే. గాజు లేదా ప్లాస్టిక్ పూసలకు కర్బన్ పదార్థంతో పూత పూసి అచ్చు ముత్యాల్లా తయారుచేస్తారు. చూడ్డానికి సహజమైన ముత్యాల్లా ఉండే వీటిని తెలియనివారు ఎక్కువధరపెట్టి కొంటుంటారు. చాలామంది తెలియక నకిలీ ముత్యాలను సహజమైనవిగా భ్రమిస్తుంటారు. పైగా వీటికి ‘సెమీ కల్చర్డ్’ అని స్టైల్‌గా పేరు పెట్టి మనల్ని బాగా నమ్మించి నకిలీ ముత్యాలను అమ్మేసే వ్యాపారులు నేడు కోకొల్లలు. కాబట్టే ముత్యాల కొనుగోలులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ముత్యాలను కొనేటప్పుడు కచ్చితంగా మెరుపు, ఆకారం, పరిణామం, రంగును తప్పకుండా గుర్తుంచుకోవాలి. అసలు సిసలైన ముత్యాలు దృఢంగా, మందంగా వెనె్నల విరిసినట్లుగా మెరుస్తాయి. చూడ్డానికి నున్నగా ఉంటాయి. మచ్చలు, గీతలూ, చిల్లులూ అసలే ఉండకూడదు. పున్నమి చంద్రుడిలా వంకర లేకుండా పూర్తిగా గుండ్రంగా ఉన్నవే ఎక్కువ ఖరీదైనవి. సైజు పెరిగే కొద్దీ ధర కూడా ఎక్కువే. గులాబీ, నలుపు రంగుతోపాటు ధవళ కాంతులతో మెరిసే తెలుపు రంగు ముత్యాలే నాణ్యమైనవీ శ్రేష్ఠమైనవీ. తక్కువ నాణ్యత కలిగిన పసుపు, గోధుమ షేడ్‌లు కొనకపోతే మంచిది. ఏదిఏమైనా నాణ్యతను బట్టి ముత్యాలు ధరలు పలుకుతాయి. ముత్యాల హారం నేడు వెయ్యి రూపాయలు మొదలు పది లక్షల వరకూ అందుబాటులో ఉంటున్నాయి. కాల్షియం కార్బొనేట్‌తో ఏర్పడటంవల్ల వాతావరణ ప్రభావానికి ఇవి రంగు మారతాయి. అయితే వందేళ్లు గ్యారంటి చెప్పవచ్చు. ఆ తర్వాత రంగును కోల్పోయే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి