ఏమిటీ దూరం
-కంచర్ల
వైవాహిక బంధం గురించి ఆలోచించినపుడల్లా అందమైన పాట మదిలో సుడులు తిరుగుతుందెవరికైనా...
‘జతబాయని కూరిమి జంటగ మెదిలే దంపతులే ఇల ధన్యులనీ...’ అంటూ సాగే ఆ చరణం మనసుని మధురోహల్లోకి లాక్కుపోతుంది. కౌగిలిల్లోకి గాలి సైతం చొరబడకుండా దాంపత్య జీవిత సౌఖ్యాన్ని అనుభవించాలని కవి అంటుంటే- నేటి జంటలు మాత్రం ‘పర్సనల్ స్పేస్’ కావాలంటున్నాయి. ఇప్పుడిదే విడాకులకు ప్రధానాంశమవుతుందని పరిశీలకుల అంచనా.
‘నేను కనబడకపోతే మావారు ఒక్కక్షణం కూడా ఉండలేరు’ అని ఒకప్పుడు స్ర్తి గర్వంగా చెప్పుకొనేది. నేటి యువతులు అలా అనడంలేదు. -‘ఇరవై నాలుగ్గంటలూ నాకు కాపలేంటి? ఊపిరి ఆడనట్లుంటుంది. కాస్త నా మానాన నన్ను వదిలేయవచ్చుగా’ అంటున్నారు. స్ర్తిలే కాదు. పురుషులదీ అదే మాట. ‘వాళ్ళమ్మగారింటికి, స్నేహితుల ఇళ్ళకి కూడా నన్ను రమ్మంటుంది. తాను వెళ్ళి నన్ను వదిలేస్తే నా స్నేహితులతో కాసేపైనా ఫ్రీగా గడుపుతాను కదా’ అంటారు.
నిపుణులేమంటారంటే... ఏకాంతంగా గడిపే కొంత సమయం -అది పొద్దున్న నిద్రలేవగానే కావచ్చు. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే కావచ్చు. ప్రశాంతంగా గడిపే ఆ సమయంలో వ్యక్తి తనలోకి తాను చూసుకోవడం సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తు స్వార్థమయ ప్రపంచంలో ఎవరూ బంధం పటిష్టంగా ఉండటానికి తానేం చేశానని ఆలోచించడంలేదు. ఈ బంధం తనకేమిచ్చిందని ఆలోచిస్తున్నారు. అవే గొడవలు.
నా స్పేస్ నాకివ్వు. నీకు మాత్రం అలా ఇవ్వను -అంటే గొడవేకదా మరి. చాలా సందర్భాల్లో ఇద్దరూ బిజీగా ఉండి కలిసి ఎక్కువ సమయం గడపకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నదని ఒక అంచనా. అసలు కారణాన్ని వదిలి ఎదుటివారిని నిష్టూరమాడడానికే ఈ స్పేస్‌ని సాకుగా చూపుతుంటారు. ‘పాశ్చాత్య ప్రభావమే ఇదంతా’ అని కొట్టిపడేసేవారికి వీళ్ళేం సమాధానం చెప్తారు? ‘స్పేస్’ అన్న పదాన్ని సాధారణంగా వాడకపోవచ్చు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ భావనని గుర్తిస్తున్నారు.
‘స్పేస్’ అన్నది ఒక బంధంలో ఉన్న ఇద్దరూ వ్యక్తులుగా ఎదగడానికి ఉపయోగపడాలి. అంతేగానీ నాది.. నీది... అంటూ ఒకరినొకరు దూరంగా పారిపోవడం కాదు. ఒక బంధంలో స్పేస్ అనేది.. నీది, నాది, మనది.. అని మూడు విధాలుగా ఉంటుంది. స్ర్తి అయినా పురుషుడైనా తనకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవడానికి, తప్పుచేసిన భావం కలగకుండా కాస్త స్వేచ్ఛగా కోరుకున్న విధంగా గడపడానికి, ఒంటరిగా బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి... స్వేచ్ఛ ఉండటమే ‘స్పేస్’. మన సమాజంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే పురుషుల స్పేస్‌కి లభించిన ప్రాధాన్యం స్ర్తిలకు లభించదు. భర్త, పిల్లలు, ఇల్లు.. అన్నీ కలిపి ఆమె స్వేచ్ఛను హరిస్తాయి. ఆమె ఎప్పుడయినా నోరు తెరిచి విసుగు వ్యక్తం చేస్తే మంచి ఇల్లాలు కాదని, ఓపిక లేదని వ్యాఖ్యానిస్తారు. కానీ పరిస్థితి అలాగే కొనసాగితే నిస్పృహ పేరుకుపోయి వివాహ బంధంలో అకస్మాత్తుగా సంక్షోభం తలెత్తుతుంది. దీన్ని గుర్తించి పురుషులు జీవిత భాగస్వామికి స్వేచ్ఛనిస్తే అంతా సుఖమయమే. భాగస్వాములిద్దరూ ఒకరునొకరు అర్థం చేసుకుని ‘స్వేచ్ఛ’ ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ‘స్పేస్’కు అర్థం ఉంటుంది. ఇద్దరి మనసులో, ఆలోచనలూ, అభిరుచులూ కలసినపుడే ‘కామెన్ స్పేస్’ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా పెంచి పోషించుకుంటే వీరి మధ్య సమస్యలే రావు. వ్యక్తిగత స్పేస్ కోసం కామన్ స్పేస్‌ని త్యాగం చేస్తే బంధం బలహీనమవుతుంది. నేటి యాంత్రిక ప్రపంచంలో ఈ ‘స్పేస్’ను కామన్‌గా కాపాడుకోవడం చాలాచాలా అవసరం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి